ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నాసిక్-శిర్ డీ హైవే లో జరిగిన ఒక ప్రమాదం కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకుసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ప్రకటించారు 

నాడు పోస్టు చేయడమైనది: 13 JAN 2023 12:00PM by PIB Hyderabad

నాసిక్-శిర్ డీ హైవే లో జరిగిన ఒక ప్రమాదం ప్రాణనష్టాని కి దారి తీసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘నాసిక్-శిర్ డీ హైవే లో జరిగిన ఒక ప్రమాద ఘటన ప్రాణనష్టాని కి దారితీయడం తో దు:ఖం కలిగింది. ఈ ఘటన లో ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ ప్రమాదం లో గాయపడిన వ్యక్తులు త్వరగా పున: స్వస్థులు అగుదురు గాక. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’ అని పేర్కొంది.

 

 


(రిలీజ్ ఐడి: 1890941) సందర్శకుల సూచీ సంఖ్య : : 173