ప్రధాన మంత్రి కార్యాలయం
కుమర్ శిబిరంలో ఆచరణాత్మక విధుల్లో నియమితురాలైన తొలి మహిళా అధికారి కెప్టెన్ శివచౌహాన్‌కు ప్రధానమంత్రి అభినందన
प्रविष्टि तिथि:
04 JAN 2023 9:42PM by PIB Hyderabad
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సియాచిన్ యుద్ధక్షేత్రంలోని కుమర్ శిబిరంలో ఆచరణాత్మక విధుల్లో నియమితురాలైన తొలి మహిళా అధికారిగా రికార్డులకెక్కిన కెప్టెన్ శివ చౌహాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఫైర్ అండ్ ఫ్యూరీ శాపర్స్ దళానికి చెందిన ఆమె అత్యంత కఠిన శిక్షణ పొందిన అనంతరం ఈ గురుతర బాధ్యతల్లో నియమితులయ్యారు.
ఈ మేరకు ఫైర్ అండ్ ఫ్యూరీ శాపర్స్ దళం ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణం... భారత నారీశక్తి స్ఫూర్తిదాయక పురోగమనానికి నిలువెత్తు నిదర్శనం ఇదే” అని ప్రధామంత్రి అభివర్ణించారు.
***
DS/AK
(रिलीज़ आईडी: 1888771)
आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam