ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘పరీక్ష పే చర్చ’లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి: ప్రధానమంత్రి పిలుపు

प्रविष्टि तिथि: 04 JAN 2023 9:39PM by PIB Hyderabad

   ఏడాది ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమం తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక పరస్పర చర్చాగోష్టిలో పాలుపంచుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“పరీక్ష పే చర్చ’ అన్నది అత్యంత ఉత్తేజకర కార్యక్రమాలలో ఒకటి. పరీక్షల వేళ ఒత్తిడిని దూరం చేయడానికి, మన పరీక్ష యోధుల (#ExamWarriors)కు మద్దతివ్వడానికి వీలున్న మార్గాలపై చర్చకు ఇది అవకాశమిస్తుంది. ఈ నెల 27న నిర్వహించే ఈ కార్యక్రమం కోసం నేను ఎదురుచూస్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ప్రత్యేక పరస్పర చర్చాగోష్టిలో పాల్గొనాలని కోరుతున్నాను. #PPC2023” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/AK


(रिलीज़ आईडी: 1888770) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Malayalam