ప్రధాన మంత్రి కార్యాలయం

ఢిల్లీలో జనవరి 6.. 7 తేదీల్లో ప్రధాన కార్యదర్శుల రెండో జాతీయ సదస్సుకు అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి


‘ఎంఎస్‌ఎంఇ'లు.. మౌలిక వసతులు-పెట్టుబడులు, కనిష్ట షరతులు.. మహిళా సాధికారత.. ఆరోగ్యం-పోషకాహారం.. నైపుణ్యాభివృద్ధి వంటి 6 అంశాలపై చర్చలు;

వికసిత భారతం: చివరి అంచెకు చేరిక.. ఐదేళ్ల జీఎస్టీ ప్రపంచ భౌగోళిక-రాజకీయ సవాళ్లు.. భారత్‌ ప్రతిస్పందన ప్రధానాంశాలుగా మూడు ప్రత్యేక చర్చాగోష్ఠులు;

నాలుగు చర్చనీయాంశాలు- స్థానికత కోసం స్వగళం.. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం.. జి20: దేశాల పాత్ర.. వర్ధమాన సాంకేతికతలపైనా సదస్సులో చర్చ;

ప్రతి ఇతివృత్తం కింద రాష్ట్రాలు/యూటీల నుంచి ఉత్తమాచరణల
ఆదానప్రదానంతో పరస్పర అభ్యాసం… అనుసరణలకు అవకాశం;

రాష్ట్రాలు/యూటీలతో మూడు ముందస్తు వర్చువల్
భేటీల ఫలితాలపైనా ఈ సమావేశంలో ప్రస్తావన

గత మూడు నెలలుగా కేంద్రం-రాష్ట్రాలు/యూటీల మధ్య 150కిపైగా విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ సదస్సు చర్చనీయాంశాలపై తుది నిర్ణయం

Posted On: 04 JAN 2023 8:40PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2023 జనవరి 6, 7 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండో జాతీయ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే దిశగా ఇది మరో కీలక ముందడుగు కానుంది. కాగా, 2022 జూన్‌లో ప్రధాన కార్యదర్శుల తొలి సదస్సు ధర్మశాలలో జరిగింది. అయితే, ఈ ఏడాది 2023 జనవరి 5 నుంచి 7వ తేదీవరకూ మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాలతో భాగస్వామ్యంద్వారా సుస్థిర, సువేగ ప్రగతి సాధనపై సదస్సు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతోపాటు అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్‌ అధికారులు, ఆయా రంగాల నిపుణులు మొత్తం 200 మంది ఈ సదస్సులో పాల్గొంటారు. వృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పన, సమ్మిళిత మానవాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ వికసిత భారత నిర్మాణ లక్ష్యాన్ని సాధించే దిశగా సహకారాత్మక కార్యాచరణకు ఈ సదస్సు పునాది వేస్తుంది.

   నోడల్ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ రంగాల నిపుణుల మధ్య మూడు నెలలుగా నిర్వహించిన 150కిపైగా ప్రత్యక్ష-వర్చువల్ సంప్రదింపుల సమావేశాల్లో విస్తృత చర్చల తర్వాత ఈ జాతీయ సదస్సు చర్చనీయాంశాలు నిర్ణయించబడ్డాయి. తదనుగుణంగా గుర్తించబడిన ఆరు ఇతివృత్తాలు- (i) ‘ఎంఎస్‌ఎంఇ’లకు ప్రాధాన్యం; (ii) మౌలిక సదుపాయాలు-పెట్టుబడులు; (iii) కనిష్ఠ షరతులు; (iv) మహిళా సాధికారత; (v) ఆరోగ్యం-పోషకాహారం; (vi) నైపుణ్యాభివృద్ధి వగైరాలపై ఈ సదస్సు ప్రధానంగా చర్చిస్తుంది.

   అలాగే (i) వికసిత భారతం: చివరి అంచెకు చేరిక; (ii) ఐదేళ్ల వస్తుసేవల పన్ను (జీఎస్టీ)..  ఆచరణ-అనుభవాలు; (iii) ప్రపంచ భౌగోళిక-రాజకీయ సవాళ్లు-భారత్ ప్రతిస్పందన ప్రధానాంశాలుగా మూడు ప్రత్యేక చర్చాగోష్ఠులు నిర్వహించబడతాయి.

   అంతేకాకుండా నాలుగు ప్రధానాంశాలు… (i) స్థానికత కోసం స్వగళం; (ii) అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం; (iii) జి20: దేశాల పాత్ర; (iv) వర్ధమాన సాంకేతికతలపై కేంద్రీకృత చర్చలు జరుగుతాయి.

   వీటితోపాటు రాష్ట్రాలు పరస్పరం నేర్చుకునేలా ప్రతి ఇతివృత్తం క్రింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉత్తమాచరణలపైనా సమావేశంలో ప్రత్యేక ప్రస్తావనలుంటాయి.

   ప్రస్తుత ప్రధాన సదస్సుకు ముందు ప్రధానమంత్రి ఆదేశాలకు అనుగుణంగా-రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో మూడు వర్చువల్ కాన్ఫరెన్సులు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా (i) జిల్లాలు కేంద్రకంగా అభివృద్ధి; (ii) వృత్తాకార ఆర్థిక వ్యవస్థ; (iii) ఆదర్శ కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధానాంశాలుగా నిర్వహించిన ఈ వర్చువల్ సమావేశాల నిర్ణయాలు కూడా ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సులో ప్రముఖంగా ప్రస్తావనకు వస్తాయి.

******



(Release ID: 1888769) Visitor Counter : 147