ప్రధాన మంత్రి కార్యాలయం

యుపిఐ 2022 డిసెంబర్ లో 12.8 లక్షలకోట్ల రూపాయల విలువైన 782 కోట్ల లావాదేవీల మైలురాయి ని సాధించడం తో యుపిఐ చెల్లింపులకు ప్రజాదరణ పెరుగుతూ ఉండడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


డిజిటల్ పేమెంట్స్ ను అక్కున చేర్చుకొన్నందుకు దేశ ప్రజల ను ఆయనమెచ్చుకొన్నారు

Posted On: 02 JAN 2023 9:31PM by PIB Hyderabad

డిజిటల్ పేమెంట్స్ ను అక్కున చేర్చుకొన్నందుకు దేశప్రజల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతదేశం లో 2022వ సంవత్సరం డిసెంబర్ లో 12.8 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన 782 కోట్ల యుపిఐ లావాదేవీలు నమోదైనటువంటి ఒక ప్రతిష్టాత్మక ఘటన చోటు చేసుకొంది.

ఫిన్ టెక్ రంగం లో నైపుణ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి ట్విటర్ లో పొందుపరచిన సమాచారాన్ని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ప్రస్తావిస్తూ -

‘‘ఏ విధం గా అయితే మీరు యుపిఐ కి లోకప్రియత్వాన్ని పెంపొందింపచేస్తున్నారో, అది బలే బాగుందని నాకు అనిపించింది. నేను డిజిటల్ పేమెంట్స్ ను అక్కున చేర్చుకొన్నందుకు గాను నా తోటి భారతీయుల కు అభినందనల ను తెలియ జేస్తున్నాను. వారు సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణ ల పట్ల చెప్పుకోదగ్గ అనుకూలత ను చాటారు.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 

 

 

 



(Release ID: 1888303) Visitor Counter : 180