ప్రధాన మంత్రి కార్యాలయం
భారత-ఆస్ట్రేలియా ఆర్థిక సహకార-వాణిజ్య ఒప్పందం
(ఇండాస్ ఎక్టా) అమలులోకి రావడంపై ప్రధానమంత్రి హర్షం
Posted On:
29 DEC 2022 6:31PM by PIB Hyderabad
భారత-ఆస్ట్రేలియా ఆర్థిక సహకార-వాణిజ్య ఒప్పందం (ఇండాస్ ఎక్టా) ఇవాళ్టినుంచి అమలులోకి రావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక మేలిమలుపని ఈ సందర్భంగా శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ట్వీట్ స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఈ రోజునుంచీ ‘ఇండాస్ ఎక్టా’ అమలులోకి రావడం ఆనందదాయకం. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదొక మేలిమలుపు. మన వాణిజ్య-ఆర్థిక సంబంధాల అపార సామర్థ్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ద్వైపాక్షిక వాణిజ్యానికి ఉత్తేజమిచ్చే అవకాశం. భారతదేశంలో మీకు త్వరలోనే స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నాను. @AlboMP“ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
********
DS/ST
(Release ID: 1887496)
Visitor Counter : 173
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam