మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

విద్యార్థినుల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు రాష్ట్రాలు అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని కోరిన కేంద్రం

Posted On: 22 DEC 2022 9:24AM by PIB Hyderabad

 ముఖ్యాంశాలు:

* నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఇమ్యునైజేషన్ (ఎన్టిఏజిఐ) యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యుపిఐ)లో హెచ్పివి వ్యాక్సిన్‌ను 9-14 సంవత్సరాల వయస్సు గల యుక్త వయస్సులో ఉన్న బాలికలకు 9 సంవత్సరాలలో నెమ్మదిగా  ప్రారంభించాలని సిఫార్సు చేసింది.

 

*టీకా ప్రాథమికంగా పాఠశాలల్లో అందిస్తారు. (గ్రేడ్ ఆధారిత విధానం: 5వ-l0వది). ప్రచారం రోజున పాఠశాలకు రాలేని బాలికలను చేరుకోవడానికి, టీకాలు ఆరోగ్య కేంద్రంలో అందించాలి. పాఠశాల వెలుపల ఉన్న బాలికలకు కమ్యూనిటీ ఔట్రీచ్, మొబైల్ బృందాల ద్వారా ప్రచారం ప్రచారం.  

 

సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించాలని, దేశవ్యాప్తంగా బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. ప్రపంచవ్యాప్తంగా, గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో 4వ అత్యంత సాధారణ క్యాన్సర్ గా పేర్కొంది. భారతదేశంలో, గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రపంచ గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో అత్యధిక నిష్పత్తి భారత్ లోనే ఉంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, ప్రభావితంగా దానిని చికిత్స చేయగలిగితే నివారించదగిన, నయం చేయగల వ్యాధి. చాలా గర్భాశయ క్యాన్సర్‌లు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ప్పివి)తో సంబంధం కలిగి ఉంటాయి.  బాలికలు లేదా మహిళలు వైరస్‌కు గురయ్యే ముందు టీకా ఇచ్చినట్లయితే  హెచ్ప్పివి వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ను చాలా వరకు నిరోధించగలదు. వ్యాక్సినేషన్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన డబ్ల్యూ హెచ్ ఓ గ్లోబల్ స్ట్రాటజీ మూలస్తంభాలలో ఒకటి.

ఇమ్యునైజేషన్ కోసం నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్,  యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో 9-14 ఏళ్ల యుక్తవయస్సులో ఉన్న బాలికలకు ఒక సారి క్యాచ్-అప్‌తో హెచ్ పి వి వ్యాక్సిన్‌ని అందించాలన్నది సిఫార్సు. 

పాఠశాలలో బాలికల నమోదు ఎక్కువగా ఉన్నందున టీకా ప్రాథమికంగా పాఠశాలల(గ్రేడ్ ఆధారిత విధానం: 5వ-l0వ) ద్వారా అందిస్తారు. . ప్రచారం రోజున పాఠశాలకు హాజరుకాలేని బాలికలను చేరుకోవడానికి, టీకా ఆరోగ్య కేంద్రంలో అందిస్తారు. అయితే బడి బయట ఉన్న బాలికలకు వయస్సు (9-14 సంవత్సరాలు) ఆధారంగా కమ్యూనిటీ ఔట్రీచ్,  మొబైల్ బృందాల ద్వారా ప్రచారం నిర్వహిస్తారు. టీకా సంఖ్యల నమోదు, రికార్డింగ్, రిపోర్టింగ్ కోసం, U-WIN యాప్ ఉపయోగపడుతుంది. 

ఈ లేఖలో, ప్రచారాన్ని విజయవంతం చేయడానికి వివిధ కార్యకలాపాలను చేపట్టేందుకు తగిన స్థాయిలో అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలను అభ్యర్థించారు:

* టీకా కోసం పాఠశాలల్లోహెచ్ పి వి టీకా కేంద్రాలను నిర్వహించడం.

* జిల్లా ఇమ్యునైజేషన్ అధికారికి మద్దతు ఇవ్వడానికి జిల్లా విద్యా అధికారిని ఆదేశించడం, జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రయత్నాలలో * భాగం కావడం. 

* జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ బోర్డుతో సమన్వయం చేయడం. 

* టీకా కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, పాఠశాలలోని 9-14 సంవత్సరాల బాలికల సంఖ్యను క్రోడీకరించడం 

* U-WINలో పెద్దమొత్తంలో అప్‌లోడ్ చేయడానికి ప్రతి పాఠశాలలో ఒక నోడల్ వ్యక్తి. ప్రత్యేక తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం సందర్భంగా తల్లిదండ్రు లందరికీ పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా అవగాహన కల్పించడం

* మైక్రో ప్లానింగ్ కోసం ప్రతి బ్లాక్‌లో అన్ని రకాల పాఠశాలల తాజా జాబితాను రూపొందించడంలో తోడ్పాటు అందించడం, 

* పాఠశాలల జిఐఎస్ మ్యాపింగ్‌ని యాక్సెస్ చేయడం

 

*****



(Release ID: 1886037) Visitor Counter : 135