ప్రధాన మంత్రి కార్యాలయం

జి20 కి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశంస్వీకరించిన అనంతరం సంబంధిత అంశాలపై చర్చించడం కోసం గవర్నర్ లు, ముఖ్యమంత్రులు మరియులెఫ్టెనంట్ గవర్నర్ లతో వీడియో సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

Posted On: 09 DEC 2022 8:48PM by PIB Hyderabad

జి20 కి అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం స్వీకరించిన అనంతరం సంబంధిత అంశాల పై చర్చించడం కోసం గవర్నర్ లు, ముఖ్యమంత్రులు మరియు లెఫ్టెనంట్ గవర్నర్ లతో నిర్వహించిన వీడియో సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

 

జి20 కి భారతదేశం అధ్యక్షత వహించడం అనేది యావత్తు దేశం తో ముడిపడివుందని, మరి ఇది దేశం యొక్క దక్షత ను వ్యక్తం చేయడానికి ఒక అపూర్వమైన అవకాశం అని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో పేర్కొన్నారు.

 

కలిసికట్టు గా పని చేయడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. జి20 కి సంబంధించిన కార్యక్రమాల ను నిర్వహించడం లో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. జి20 అధ్యక్షత అనేది భారతదేశం లోని ఒక్క సాంప్రదాయిక మహానగరాల కే కాకుండా ఇతర ప్రాంతాల కు చెందిన శక్తియుక్తుల ను సైతం చాటిచెప్పుకోవడం లో, మని ఈ తరహా లో మన దేశం లో ప్రతి ప్రాంతం యొక్క విశిష్టత ను వెల్లడించడం లో సహాయకారి కాగలదని ఆయన అన్నారు.

 

జి20 కి భారతదేశం అధ్యక్షత వహించే కాలం లో పెద్ద సంఖ్య లో సందర్శకులు భారతదేశాన్ని సందర్శించడానికి తరలి రావచ్చని, వేరు వేరు కార్యక్రమాల పై అంతర్జాతీయ ప్రసార మాధ్యాల దృష్టి కేంద్రీకృతం అవడానికి కూడా అవకాశం ఏర్పడుతుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వేటికవే ఆకర్షణీయమైన వ్యాపారం, పెట్టుబడి మరియు పర్యటన క్షేత్రాల పరం గా తమ ప్రత్యేకతల ను పునరావిష్కరించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయన సూచించారు. సంపూర్ణ ప్రభుత్వం మరియు సంపూర్ణ సమాజం అనే దృష్టికోణాల ద్వారా జి20 సంబంధిత కార్యక్రమాల లో ప్రజల భాగస్వామ్యానికి పూచీపడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన పునరుద్ఘాటించారు.

 

అనేక మంది గవర్నర్ లు, ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్ లు సమావేశం పురోగమించిన క్రమం లో వారి వారి అభిప్రాయాల ను వ్యక్తం చేశారు. రాష్ట్రాలు జి20 సంబంధి సమావేశాల కు ఉపయుక్తమైన ఆతిథ్యాన్ని ఇవ్వడం కోసం పూనుకొని చేస్తున్న సన్నాహాల ను వారు ఈ సందర్భం లో వివరించారు.

 

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జి20 లో భారతదేశం పక్షాన షెర్పా గా ఉన్న అధికారి ఒక నివేదిక ను సమర్పించారు.

 

***

 



(Release ID: 1882745) Visitor Counter : 151