ప్రధాన మంత్రి కార్యాలయం
మాతృ మరణాల నిష్పత్తి లో చెప్పుకోదగిన క్షీణత నమోదు అయినందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
30 NOV 2022 4:36PM by PIB Hyderabad
కాన్పు ల సంబంధి మరణాల నిష్పత్తి 2014-16 మధ్య కాలం లో ఒక లక్ష సజీవ జననాల కు గాను 130 గా నమోదై, 2018-20 మధ్య కాలానికి వచ్చే సరికి ఆ ధోరణి కాస్తా ఒక లక్ష సజీవ జననాల కు గాను 97 స్థాయి కి చెప్పుకోదగ్గ రీతి లో క్షీణించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు. మహిళల సశక్తీకరణ కు సంబంధించిన అన్ని దశ లు చాలా ప్రబలం గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియ చేసిన ట్వీట్ ను ప్రధాన మంత్రి మరొక ట్వీట్ లో ప్రస్తావిస్తూ -
‘‘ఇది చాలా ప్రోత్సాహకరమైనటువంటి ధోరణి. ఈ మార్పు ను చూసినందుకు సంతోషం గా ఉంది. మహిళల సశక్తీకరణ కు సంబంధించిన అన్ని దశల ను వృద్ధి చెందింప చేసే విషయం లో మన శ్రద్ధ చాలా సుస్థిరం గా ఉంటోంది.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1880183)
आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam