ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘పరీక్షా పే చర్చా 2023’ కు సంబంధించినకార్యకలాపాల లో పాలుపంచుకోవలసింది గా విద్యార్థుల ను, తల్లితండ్రులను మరియు ఉపాధ్యాయుల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి

Posted On: 30 NOV 2022 4:37PM by PIB Hyderabad

‘పరీక్షా పే చర్చా 2023’ కు సంబంధించిన కార్యకలాపాల లో పాలుపంచుకోవలసింది గా విద్యార్థుల కు, తల్లితండ్రుల కు మరియు ఉపాధ్యాయుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. మన విద్యార్థుల కు ఒత్తిడి కి తావు ఉండనటువంటి పరిసరాల ను ఏర్పరచే దిశ లో అంతా కలసికట్టుగా పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

విద్య మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ ను ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి మరొక ట్వీట్ లో -

‘‘ ‘పరీక్షా పే చర్చా 2023’ కు సంబంధించిన ఈ ఆసక్తిదాయకమైన కార్యకలాపాల లో పాలుపంచుకోవలసింది గా ఎగ్జామ్ వారియర్స్ అందరికి, వారి తల్లితండ్రుల కు మరియు ఉపాధ్యాయుల కు నేను పిలుపు ను ఇస్తున్నాను. మన విద్యార్థుల కు ఒత్తిడి ఎదురు కాని పరిసరాల ను ఏర్పరచే దిశ లో మనం అందరం కలసికట్టుగా పాటుపడదాం రండి. #PPC2023 ’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 


(Release ID: 1880182) Visitor Counter : 170