పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

మన్ కీ బాత్ తాజా ఎడిషన్ లో ప్రజలను ఏకం చేయడంలోభారతీయ సంగీతం ప్రాముఖ్యాన్ని ప్రస్తావించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


మన సంప్రదాయాలను, సంప్రదాయ పరిజ్ఞానాన్ని పరిరక్షించడం, దానిని ప్రోత్సహించడం, సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత: శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 29 NOV 2022 1:39PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2022, నవంబర్ 27న 95వ 'మన్ కీ బాత్' సందర్భంగా మన దేశం ప్రపంచంలోనే అత్యంత పురాతన సంప్రదాయాలకు నిలయం అని అన్నారు. అందువల్ల, మన సంప్రదాయాలను , సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, దానిని ప్రోత్సహించడం, సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్లడం కూడా మన బాధ్యత అని ఆయన అన్నారు. భారత దేశం లోనే కాకుండా విదేశాలలో కూడా భారతీయ సంగీతం ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని ఎలా తీసుకువస్తోందో ప్రధాన మంత్రి వివ రించారు.సంగీతం శరీరానికి విశ్రాంతి ఇవ్వడమే కాకుండా, మనస్సుకు ఆనందాన్ని కూడా ఇస్తుంది, సంగీతం మన సమాజాన్ని కూడా కలుపుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.ప్రధాన మంత్రి నాగా సమాజంను ఉదాహ lరణ గా పేర్కొంటూ, వారి ఉత్కృష్ట సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను కూడా

ఉదాహరించారు.

 

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా బాపూజీకి ఇష్టమైన పాటను పాడిన గ్రీస్ గాయకుడు 'కాన్ స్టాంటినోస్ కలిట్జిస్' గురించి ప్రధాన మంత్రి మన్ కీ బాత్ సందర్భంగా ప్రస్తావించారు. ఆ గాయకుడికి భారతదేశం పట్ల ఎంత అభిమానం ఉన్నదంటే, గత 42

సంవత్సరాలలో ఆయన దాదాపు ప్రతి సంవత్సరం భారత దేశానికి వచ్చారని

ప్రధాన మంత్రి అన్నారు. భారతీయ సంగీతం మూలం గురించి, వివిధ భారతీయ సంగీత వ్యవస్థలు, వివిధ రకాల రాగాలు, తాళాలు ,రసాలతో పాటు వివిధ ఘరానాలను గురించి అధ్యయనం చేశారని తెలిపారు. ఆయన భారతీయ సంగీత అనేక మంది గొప్ప వ్యక్తుల సేవలను అధ్యయనం చేశారని, lభారతదేశ శాస్త్రీయ నృత్యాల వివిధ అంశాలను కూడా నిశితంగా అర్థం చేసుకున్నారని ప్రధాని చెప్పారు. ‘‘ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఈ అనుభవాలన్నింటినీ ఒక పుస్తకంలో చాలా అందంగా పొందుపరిచారు. ఇండియన్ మ్యూజిక్ అనే ఆయన పుస్తకంలో సుమారు 760 చిత్రాలు ఉన్నాయి. ఈ ఛాయాచిత్రాలలో ఎక్కువ భాగం ఆయనే స్వయంగా తీసుకున్నారు. ఇతర దేశాలలో భారతీయ సంస్కృతి పట్ల అటువంటి ఉత్సాహం , ఇష్టం నిజంగా హృదయపూర్వకమైనది‘‘ అని శ్రీ మోదీ అన్నారు.

 

గత 8 సంవత్సరాలలో భారత దేశం నుండి సంగీత వాయిద్యాల ఎగుమతులు మూడున్నర రెట్లు పెరిగాయనే మరో

ఆసక్తికరమైన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.ఎలక్ట్రికల్ మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుతూ, వాటి ఎగుమతులు 60 రెట్లు పెరిగాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి , సంగీతానికి ఆదరణ, అభిమానం పెరుగుతోందని, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ , బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు భారతీయ సంగీత వాయిద్యాల అతిపెద్ద కొనుగోలుదారు లని, మన దేశానికి సంగీతం, నృత్యం , కళల గొప్ప వారసత్వం ఉండటం మనందరి అదృష్టం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

నీతి శతకం ద్వారా ప్రసిద్ధుడైన గొప్ప ఋషి కవి భర్తృహరి గురించి మనందరికీ తెలుసునని , కళ, సంగీతం , సాహిత్యం పట్ల ఒకరికి ఉన్న అనుబంధం మానవాళి యొక్క నిజమైన గుర్తింపు అని ఆయన ఒక పద్యంలో పేర్కొన్నారని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘వాస్తవానికి, మన సంస్కృతి దానిని మానవత్వానికి, దైవత్వానికి తీసుకువెళుతుంది. వేదాలలో, సామవేదం మన వైవిధ్యభరితమైన సంగీతానికి మూలం అని పిలువబడింది. అది సరస్వతీ మాత వీణ కావచ్చు, భగవాన్ కృష్ణుడి వేణువు కావచ్చు, భోలేనాథ్ దమ్రు కావచ్చు, మన దేవుళ్ళు, దేవతలు కూడా సంగీతంతో ముడిపడి ఉన్నారు.భారతీయులమైన మనం ప్రతిదానిలో సంగీతాన్ని కనుగొంటాము. అది నది శబ్దం కావచ్చు, వర్షపు బిందువులు కావచ్చు, పక్షుల కిలకిలారావాలు కావచ్చు, గాలి ప్రతిధ్వనించే ధ్వని కావచ్చు, మన నాగరికతలో ప్రతిచోటా సంగీతం ఉంటుంది. ఈ సంగీతం శరీరానికి విశ్రాంతినివ్వడమే కాకుండా, మనసుకు ఆనందాన్ని కూడా ఇస్తుంది. సంగీతం కూడా మన సమాజాన్ని కలుపుతుంది. భాంగ్రా, లావణీలకు ఉత్సాహమూ, ఆనందమూ ఉంటే, రవీంద్ర సంగీత్ మన ఆత్మలను పైకి లేపుతుంది.దేశవ్యాప్తంగా గిరిజనులకు విభిన్న సంగీత సంప్రదాయాలు ఉన్నాయి. వారు ఒకరినొకరు ప్రకృతితో సామరస్యంగా జీవించడానికి ప్రేరణ కలిగిస్తారు.మన సంగీత రూపాలు మన సంస్కృతిని సుసంపన్నం చేయడమే కాకుండా, ప్రపంచ సంగీతంపై చెరగని ముద్రవేశాయి. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచంలోని నలుమూలలకు వ్యాపించింది ‘‘అని ప్ర ధాన మంత్రి

ఉద్ఘాటించారు.

 

భారత దేశానికి వేల మైళ్ల దూరంలో ఉన్న దక్షిణ అమెరికా దేశమైన గయానా వరకు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి

ప్రభావం గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు.19 వ , 20 వ శతాబ్దాలలో భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు గయానాకు వెళ్ళారు. భజన కీర్తన సంప్రదాయంతో సహా భారతదేశంలోని అనేక సంప్రదాయాలను కూడా వారు తమతో తీసుకువెళ్ళారు. మనం భారతదేశంలో హోలీని జరుపుకుంటున్నప్పుడు, గయానాలో కూడా హోలీ రంగులు ఉత్సాహంతో సజీవంగా వస్తాయి. ఎక్కడైతే హోలీ రంగులు ఉంటాయో అక్కడ ఫగ్వా అనే ఫగ్వా సంగీతం కూడా ఉంటుంది. గయానాలోని ఫగ్వాలో భగవాన్ రాముడు ,భగవాన్ కృష్ణుడితో సంబంధం ఉన్న వివాహ గీతాలను పాడే ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఈ పాటలను చౌతల్ అని పిలుస్తారు.అవి ఒకే రకమైన ట్యూన్ పై ఇక్కడ లాగా ఎత్తైన పిచ్ వద్ద పాడబడతాయి. అంతే కాదు గయానాలో చౌతాల్ పోటీలు కూడా జరుగుతాయి. అదేవిధంగా, చాలా మంది భారతీయులు, ముఖ్యంగా తూర్పు ఉత్తర ప్రదేశ్ ,బీహార్ నుండి ఫిజీకి కూడా వెళ్లారు.వారు సాంప్రదాయ భజన-కీర్తనలను, ప్రధానంగా రామచరితమానస్ నుండి ద్విపదలను పాడేవారు. వారు ఫిజిలో భజన-కీర్తనతో సంబంధం ఉన్న అనేక మండలులను కూడా ఏర్పాటు చేశారు. నేటికీ ఫిజీలో రామాయణ మండలి పేరుతో రెండు వేలకు పైగా భజన కీర్తన మండళ్లు ఉన్నాయి. ఈ రోజు వాటిని ప్రతి గ్రామం, ప్రాంతంలో చూడవచ్చు.

 

మన దేశం ప్రపంచంలోనే పురాతన

సంప్రదాయాలకు నిలయంగా ఉన్నందుకు మనం ఎల్లప్పుడూ గ ర్వ ప డుతున్నామని ప్రధాన మంత్రి అన్నారు. అందువల్ల, మన సంప్రదాయాలను, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, దానిని ప్రోత్సహించడం , సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్లడం కూడా మన బాధ్యత. మన ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ కు చెందిన కొందరు మిత్రులు అటువంటి ప్రశంసనీయమైన ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ సంప్రదాయాలు , నైపుణ్యాలను కాపాడటానికి , వాటిని తరువాతి తరానికి అందించడానికి, అక్కడి ప్రజలు ఒక సంస్థను ఏర్పాటు చేశారు, దాని పేరు 'లిడి-క్రో-యు'.

నాగా సంస్కృతిలోని అందమైన కోణాలను పునరుద్ధరించే పనిని ఈ సంస్థ చేపట్టింది.ఉదాహరణకు, నాగా జానపద సంగీతం చాలా గొప్ప శైలి. ఈ సంస్థ నాగా మ్యూజిక్ ఆల్బమ్ లను ప్రారంభించే పనిని ప్రారంభించింది. ఇప్పటివరకు ఇలాంటి మూడు ఆల్బమ్ లు లాంచ్ అయ్యాయి. వీరు జానపద సంగీతం, జానపద నృత్యానికి సంబంధించిన వర్క్ షాప్ లను కూడా నిర్వహిస్తారు. వీటన్నింటికీ యువతకు శిక్షణ కూడా ఇస్తారు. అంతే కాదు, యువతకు సాంప్రదాయ నాగాలాండ్ శైలి దుస్తుల తయారీ, టైలరింగ్ నేతపనిలో కూడా శిక్షణ ఇస్తారు. ఈశాన్యంలో వెదురు నుండి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తారు. కొత్త తరం యువతకు వెదురు ఉత్పత్తులను తయారు చేయడం కూడా నేర్పిస్తారు.దీనితో, ఈ యువత వారి సంస్కృతితో అనుసంధానం కావడమే కాకుండా, వారికి కొత్త ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది. లిడి-క్రో-యు వద్ద ప్రజలు నాగా జానపద-సంస్కృతి గురించి మరింత ఎక్కువ మందికి తెలిసేలా చేయడానికి ప్రయత్నిస్తారు.

 

ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి

కార్యక్రమాలను చేపట్టాలని, తమ ప్రాంతాలు , ప్రదేశాలలో సాంస్కృతిక శైలులు, సంప్రదాయాలను

సంరక్షించడం కోసం కృషి చేయాలని

ప్రధాన మంత్రి కోరారు.

 

ప్ర ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లోని వివిధ సంపుటాల్లో ఏక్

భారత్ శ్రేష్ఠ భారత్ కు సగర్వమైన స్థానం ఇచ్చారు.

*******



(Release ID: 1879798) Visitor Counter : 150