ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సుప్రీం కోర్టులో నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి


ఇ-కోర్ట్‌ పథకంలో భాగంగా వివిధ కొత్త కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం

Posted On: 25 NOV 2022 2:50PM by PIB Hyderabad

   రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో 2022 నవంబరు 26న సుప్రీం కోర్టులో ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత రాజ్యాంగ సభ 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని 2015 నుంచి ఏటా ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ‘ఇ-కోర్ట్‌’ ప్రాజెక్టు సంబంధిత వివిధ కొత్త కార్యక్రమాలను ప్రధాని ప్రారంభిస్తారు. కోర్టులకు ‘ఐసీటీ’ సామర్థ్యం కల్పించడం ద్వారా కక్షిదారుల, న్యాయవాదులు, న్యాయవ్యవస్థకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ ప్రాజెక్టు రూపొందించబడింది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి ప్రారంభించబోయే కార్యక్రమాల్లో- “వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌, జస్టిస్‌ (JustIS) మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్ట్‌, ఎస్‌3వాస్‌ (S3WaaS) వంటివి ఉన్నాయి.

   ర్చువల్ జస్టిస్ క్లాక్: ఇది న్యాయ సేవాప్రదాన వ్యవస్థకు సంబంధించి కోర్టు స్థాయిలో రోజు/వారం/నెల ప్రాతిపదికన వివిధ కేసుల విచారణ స్వీకరణ, పరిష్కారం, పెండింగ్‌ వివరాలను వెల్లడించే వినూత్న విధానం. నిర్దిష్ట న్యాయస్థానం ద్వారా కేసుల పరిష్కార స్థితిగతులను ప్రజలతో పంచుకోవడం ద్వారా కోర్టుల పనితీరును జవాబుదారీతనం, పారదర్శకతతో కూడినవి రూపొందించడమే దీని లక్ష్యం. జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లోగల ఏ కోర్టు పరిధిలోని కేసుల వివరాలనైనా ఈ ‘వర్చువల్ జస్టిస్ క్లాక్‌’ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చు.

   స్టిస్‌ మొబైల్‌ అనువర్తనం 2.0: ఇది న్యాయాధికారులకు తమ కోర్టులోనే కాకుండా తమ  పరిధిలోగల న్యాయమూర్తులకు సంబంధించిన పరిష్కృత, పెండింగ్‌ కేసుల పర్యవేక్షణ ద్వారా కోర్టుల సమర్థ నిర్వహణకు తోడ్పడే ఉపకరణం. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకూ ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. దీని సాయంతో వారు ఇకపై తమ అధికార పరిధిలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో పరిష్కృత, పెండింగ్‌ కేసులను పర్యవేక్షించగలరు.

   డిజిటల్‌ కోర్ట్‌: ఇది కోర్టులను కాగితరహితం చేయడంలో భాగంగా కోర్టు రికార్డులను డిజిటలీకరించి, న్యాయమూర్తికి అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించిన విధానం.

   స్‌3వాస్‌ వెబ్‌సైట్లు: ఇది జిల్లా న్యాయవ్యవస్థ సంబంధిత నిర్దిష్ట సమాచారం, సేవల ప్రచురణకు ఉద్దేశించిన వెబ్‌సైట్‌ల రూపకల్పన, నిర్దిష్టం చేయడం, అమలు, నిర్వహణలకు ఉద్దేశించిన ఒక చట్రం. ఎస్‌3వాస్‌ (S3WaaS) అనేది సురక్షిత, అందుబాటు, సౌలభ్యంతో కూడిన వెబ్‌సైట్‌లను రూపకల్పన దిశగా ప్రభుత్వ సంస్థల కోసం అభివృద్ధి చేయబడిన క్లౌడ్ సేవ. ఇది బహుభాషా సహితం, పౌర-దివ్యాంగ హితమైనదిగా ఉంటుంది.

 

******


(Release ID: 1878997) Visitor Counter : 219