విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ మినీ రత్న విద్యుత్ సంస్థగా పనిచేస్తున్న ఎన్ఈఈపికో లిమిటెడ్ నిర్మించిన 600 మెగావాట్ల కమెంగ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 19 NOV 2022 12:59PM by PIB Hyderabad

 కేంద్ర ప్రభుత్వం జాతీయంగా నిర్ణయించిన సహకారం (NDC) లక్ష్య సాధనకు దోహదపడనున్న అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించిన  600 మెగావాట్ల కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం

 2030 నాటికి 30000 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సాధించాలన్న లక్ష్యంలో భాగంగా నిర్మించిన  కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం

● 8200 రూపాయల ఖర్చుతో  అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలో సుమారు 80 కిలోమీటర్ల విస్తీర్ణంలో కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం 

 కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంతో విద్యుత్ రంగంలో అరుణాచల్ ప్రదేశ్‌ మిగులు రాష్ట్రం గా మారుతుంది.   గ్రిడ్ స్థిరత్వం మరియు ఏకీకరణ మరియు గ్రిడ్‌లోని సౌర మరియు పవన శక్తి వనరుల సమతుల్యత పరంగా నేషనల్ గ్రిడ్‌కు భారీ ప్రయోజనాలు అందించనున్న కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం 

 

అరుణాచల్ ప్రదేశ్ లో  విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  ప్రభుత్వ రంగ మినీ రత్న విద్యుత్ సంస్థగా పనిచేస్తున్న ఎన్ఈఈపికో  లిమిటెడ్ నిర్మించిన  600 మెగావాట్ల కమెంగ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఈ రోజు ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. 

ప్రాజెక్టు నిర్మాణాన్ని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో  కేంద్ర ఇంధన, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి శ్రీ ఆర్.కే.సింగ్ స్వయంగా పర్యవేక్షించారు. అనేక సవాళ్ళను అధిగమించి 600 మెగావాట్ల కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దేశానికి పరిశుద్ధ ఇంధనాన్ని అందించి, అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలన్న లక్ష్యంతో కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం జరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి, దేశంలో జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా జాతీయ గ్రిడ్ ను స్టీరికరించి విద్యుత్ సరఫరా మెరుగు పరిచే అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ  శ్రీ ఆర్.కే.సింగ్ పనిచేశారు. 
ఈశాన్య భారతదేశంలో నిర్మాణం పూర్తి చేసుకున్న జల విద్యుత్ కేంద్రాలలో కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం ఆరవది. కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. పారిస్ ఒప్పందం 2015 కింద  కేంద్ర ప్రభుత్వం జాతీయంగా నిర్ణయించిన సహకారం (NDC) లక్ష్య సాధనకు కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం సహకరిస్తుంది. 2030 నాటికి దేశంలో  30000 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సాధించాలన్న లక్ష్యంలో భాగంగా  కమెంగ్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. 8200 రూపాయల ఖర్చుతో  అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలో సుమారు 80 కిలోమీటర్ల విస్తీర్ణంలో కమెంగ్ జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటయింది. 
3353 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టులో రెండు డ్యామ్‌లు మరియు 150 మెగావాట్ల 4 యూనిట్ల పవర్‌హౌస్ ఉన్నాయి.ప్రాజెక్టులో  ఏటా 3353 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.   గ్రిడ్ స్థిరత్వం మరియు ఏకీకరణ మరియు గ్రిడ్‌లోని సౌర మరియు పవన శక్తి వనరుల పరంగా జాతీయ గ్రిడ్‌కు భారీ ప్రయోజనాలు అందించే ప్రాజెక్టు  అరుణాచల్ ప్రదేశ్‌ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుస్తుంది.
ప్రపంచంలోని చాలా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కోవిడ్-19 మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.  అనేక సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్ఈఈపికో (కేంద్ర  ప్రభుత్వ సంస్థ మరియు మహారత్న,ఎన్టీపీసీ  లిమిటెడ్  యాజమాన్యంలోని అనుబంధ సంస్థ) ఈ మెగా ప్రాజెక్ట్ ను  2020 జూన్,నుంచి 2021 ఫిబ్రవరి మధ్య కాలంలో దశల వారీగా విజయవంతంగా పూర్తి చేసి ప్రారంభించింది.
కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు,  అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్  బ్రిగేడియర్  (డాక్టర్ .) బి.డి. మిశ్రా (రిటైర్డ్) ,   అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ , అరుణాచల్ ప్రదేశ్ ఉప  ముఖ్యమంత్రి శ్రీ చౌనా మెయిన్, పార్లమెంట్ సభ్యులు శ్రీ నబమ్ రెబియా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్ఈఈపికో  షెడ్యూల్-ఏ  మినీ రత్నప్రభుత్వ రంగ సంస్థగా పనిచేస్తోంది. 2057 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సంస్థ  కలిగి ఉంది.  జల , సహజ వాయువు, సౌర శక్తి  ఆధారిత/థర్మల్ పవర్ స్టేషన్లు సంస్థ పరిధిలో పనిచేస్తున్నాయి. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి గణనీయంగా సహకరించిన  ఎన్ఈఈపికో మరియు అభివృద్ధిలో గణనీయంగా దోహదపడింది. సౌర శక్తి, ఇతర బహుళ ప్రయోజన ప్రాజెక్టులను జమ్మూ కాశ్మీర్ లో చేపట్టేందుకు  ఎన్ఈఈపికో  సన్నాహాలు చేస్తోంది. 
 
***

(Release ID: 1877401) Visitor Counter : 537