ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘నో మనీ ఫార్ టెరర్’ అంశం పై మంత్రుల స్థాయి మూడో సమావేశంన్యూ ఢిల్లీ లో జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం 

Posted On: 18 NOV 2022 10:39AM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గం లో నా సహచరుడు శ్రీ అమిత్ శాహ్, ఇతర మహానుభావులు, విభిన్న దేశాల ప్రతినిధులు, ప్రపంచం నలు మూలల నుండి విచ్చేసిన పరిశోధన సంస్థ ల మరియు భద్రత బలగాల సభ్యులు మరియు ప్రియమైన నా మిత్రులారా,

ఉగ్రవాదాని కి ఆర్థిక సహాయం అందుతుండడానికి వ్యతిరేకం గా జరుగుతున్నటువంటి మంత్రుల స్థాయి మూడో సమావేశం లో పాలుపంచుకోవలసిలసింది గా మీ అందరి కి స్వాగత వచనాలను పలుకుతున్నాను.

మిత్రులారా,

ఈ సమావేశం భారతదేశం లో జరుగుతూ ఉండడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఉగ్రవాదం యొక్క బీభత్సాన్ని ప్రపంచం తీవ్రం గా పరిగణించడాని కి ఎంతో కాలం ముందుగానే మా దేశం ఆ అనుభవాన్ని చవిచూసింది. దశాబ్దాల తరబడి, ఉగ్రవాదం వివిధ పేరుల తో మరియు విభిన్న రూపాల తో భారతదేశాన్ని గాయపరచేందుకు యత్నిస్తూ వస్తోంది. మేం వేల సంఖ్య లో విలువైన ప్రాణాల ను కోల్పోయాం. అయితే, మేం సాహసం తో ఉగ్రవాదం పై పోరాడుతూ వచ్చాం.

 

ఉగ్రవాదాని కి ఎదురొడ్డి నిలవడం లో కృత నిశ్చయులై ఉన్నటువంటి ఒక దేశం యొక్క ప్రజల తో భేటీ అయ్యి వారితో మాటామంతీ జరిపే అవకాశం ప్రతినిధుల కు లభించనుంది. మేం ఒక దాడి ఘటన ను అయినా సరే, అనేక దాడుల తో సమానమైంది గా భావిస్తాం. పోయేది ఒక ప్రాణమే అయినప్పటికీ, అది అనేక ప్రాణాల నష్టం తో సమానం. కాబట్టి, ఎప్పటివరకు అయితే ఉగ్రవాదం మొదలంటా నాశనం అయిపోదో, అప్పటి వరకు మనం విశ్రమించనే విశ్రమించ కూడదు.

మిత్రులారా,

ఈ సమావేశం చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. దీనిని కేవలం మంత్రుల సమ్మేళనం గా చూడ కూడదు. ఎందుకంటే, ఇది మానవాళి ని ప్రభావితం చేసేటటువంటి ఒక విషయాని కి సంబంధించింది. ఉగ్రవాదం తాలూకు దీర్ఘకాలిక దుష్ప్ర భావం, మరీ ముఖ్యం గా పేదల పైన, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థ పైన ఎంతో భారీది గా ఉంటుంది. అది పర్యటన కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు.. ఏదైనా ఒక రంగం అదే పని గా బెదరింపులకు లోనవుతూ ఉండడాన్ని ఏ వ్యక్తీ హర్షించరు. మరి ఈ కారణం గానే ప్రజల యొక్క బ్రతుకు తెరువుల ను లాగేసుకోవడం జరుగుతుంది. ఉగ్రవాదుల కు అందుతున్నటువంటి ఆర్థిక సహాయం పైన మనం దెబ్బ తీయడం అనేది అన్నింటి కంటే ముఖ్యమైంది గా అయిపోతుంది.

మిత్రులారా,

వర్తమాన ప్రపంచం లో పరిశీలించినట్లయితే, అప్పుడు ఉగ్రవాదం తాలూకు అపాయాల ను గురించి ప్రపంచాని కి గుర్తు చేయవలసిన అవసరం ఏదీ లేదు. ఏమైనా, కొన్ని చోటుల లో ఉగ్రవాదాన్ని గురించిన కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఇప్పటికీ ఇంకా నెలకొని ఉన్నాయి. వేరు వేరు స్థానాల లో జరిగే దాడుల కు వ్యతిరేకం గా ప్రతిస్పందన యొక్క తీవ్రత కూడా విధవిధాలు గా ఉండనక్కర లేదు. ఆ దాడులు ఎక్కడ జరిగాయి అనే విషయం పై ఆధారపడి భిన్నమైన స్పందన ఉండరాదు. ఉగ్రవాద సంబంధి దాడులు అన్నిటికి వ్యతిరేకం గా హెచ్చు తగ్గుల కు తావు ఉండనంత గా కోపం మరియు చట్టపరం గా చర్య తీసుకోవడం అవశ్యం. దీనికి అదనం గా, కొన్ని సందర్భాల లో ఉగ్రవాదుల కు వ్యతిరేకం గా చట్టపరం గా చర్యల ను తీసుకోవడాన్ని నిరోధించడం కోసం ఉగ్రవాదాని కి వత్తాసు పలుకుతూ పరోక్ష తర్కాలను సైతం వినిపించడం జరుగుతుంది. ఈ ప్రపంచ వ్యాప్త బెదరింపు తో తలపడవలసి వచ్చినప్పుడు అస్పష్టమైన వైఖరి కి ఏ అవకాశమూ లేదు. ఇది మానవజాతి మీద, స్వేచ్ఛ మీద, ఇంకా సభ్యత మీద జరిగినటువంటి దాడి అనే చెప్పాలి. దీనికి ఎటువంటి హద్దు రేఖ లు అనేవి లేనే లేవు. ఏకరీతి లో ఉండేటటువంటి, ఏకోన్ముఖమైనటువంటి మరియు సహనాని కి రవంత ఆస్కారం అయినా ఉండనటువంటి భావన తాలూకు బలం ద్వారా నే ఉగ్రవాదాన్ని ఓడించడం వీలుపడుతుంది.

మిత్రులారా,

ఒక ఉగ్రవాది ని ఎదుర్కోవడం మరియు ఉగ్రవాదం పైన యుద్ధం చేయడం.. ఈ రెండు కూడాను వేరు వేరు అంశాలు. ఒక ఉగ్రవాది ని ఆయుధ ప్రయోగం ద్వారా నిష్క్రియాపరుని గా/ నిష్క్రియాపరురాలు గా చేయవచ్చును. ఉగ్రవాదుల పట్ల తక్షణ ఎత్తుగడల తో ప్రతిక్రియ ను చేపట్టడం అనేది ఒక సైనిక సంబంధి విషయం అయితే కావచ్చు. కానీ, వ్యూహ రచన సంబంధి లాభాలు, వారి యొక్క ఆర్థిక అండదండల ను దెబ్బతీయడమే ప్రధానం గా సాగే ఒక విశాల వ్యూహాన్ని అనుసరించనప్పుడు ఆవిరి అయిపోతాయి. ఒక ఉగ్రవాది ఒక్కరే అవుతారు. కానీ, ఉగ్రవాదం అనే సరికి అది వ్యక్తుల కు మరియు సంస్థల కు సంబంధించిన ఒక సమాహారం. ఉగ్రవాదాన్ని దాని యొక్క వేళ్ళ తో సహా పెకలించివేయాలి అంటే గనక దానికి ఒక విస్తారమైనటువంటి సక్రియాత్మక సమాధానం అవసరపడుతుంది. మన పౌరులు సురక్షితం గా ఉండాలి అని మనం కోరుకొంటున్నట్లయితే, అప్పుడు మనం ఉగ్రవాదం మన ఇళ్ళ లోకి చొచ్చుకు వచ్చే వరకు వేచి ఉండ కూడదు. మనం ఉగ్రవాదుల ను తరుముతూ, వారికి వెన్నుదన్ను గా నిలచేటటువంటి నెట్ వర్క్ ను ఛేదించాలి, మరి వారి ఆర్థిక వనరుల ను దెబ్బ కొట్టవలసి ఉంటుంది.

మిత్రులారా,

ఉగ్రవాద సంస్థ లు అనేక మూలాల నుండి డబ్బు ను అందుకొంటూ ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ మూలాల లో ఒక మూలం ఏమిటి అంటే అది కొన్ని దేశాల నుండి అందే సమర్ధన యే. కొన్ని దేశాలు వాటి విదేశీ విధానం లో ఒక భాగం గా ఉగ్రవాదాని కి కొమ్ము కాస్తుంటాయి. అవి ఉగ్రవాదాని కి రాజకీయపరమైనటువంటి, సైద్ధాంతికమైనటువంటి మరియు విత్త సంబంధమైనటువంటి సహాయాన్ని అందిస్తాయి. క్రమబద్ధం గా యుద్ధం జరగడం లేదు అంటే దాని అర్థం శాంతే అని అంతర్జాతీయ సంస్థ లు తలపోయ కూడదు. ప్రచ్ఛన్న యుద్ధాలు సైతం అపాయకారి యే కాక హింసాత్మకమైనవి కూడాను. ఉగ్రవాదాని కి వత్తాసు పలికే దేశాల ను శిక్షించి తీరాలి. ఉగ్రవాదుల పట్ల సానుభూతి ని పుట్టించడానికి యత్నించే సంస్థల ను మరియు వ్యక్తుల ను ఒంటరుల ను చేసివేయాలి. అటువంటి వ్యవహారాల లో ఏ విధమైనటువంటి షరతుల ను అనుమతించరాదు. ఉగ్రవాదాని కి తెర ముందు నుండి మరియు తెర వెనుక నుండి లభ్యం అయ్యే అన్ని రకాలైన దన్నుల కు వ్యతిరేకం గా ప్రపంచం ఏకతాటి మీద నిలబడి డీకొనవలసిన అవసరం ఉంది.

మిత్రులారా,

ఉగ్రవాదానికి నిధుల అందజేత ప్రక్రియ లో సంఘటిత అపరాధం కూడా ఒక మూలం గా ఉంటోంది. సంఘటిత అపరాధాన్ని భిన్నమైన రూపం లో చూడ కూడదు. ఈ ముఠా లు తరచు గా ఉగ్రవాద మూకల తో గాఢమైన లంకెల ను ఏర్పరచుకొని ఉంటాయి. తుపాకుల ను రహస్యం గా మరియు చట్టవిరుద్ధం గా ఒక దేశం లోకి పంపించేటటువంటి/ తుపాకుల ను రహస్యం గా మరియు చట్టవిరుద్ధం గా స్వీకరించేటటువంటి కార్యకలాపాల లో, మత్తుపదార్థాల లో మరియు రహస్య వ్యాపారం లో దొరికే డబ్బు ను ఉగ్రవాదం లోకి మళ్ళించడం జరుగుతూ ఉంటుంది. ఈ ముఠా లు లాజిస్టిక్స్ పరం గా, కమ్యూనికేశన్ పరం గా కూడాను సాయపడుతుంటాయి. ఉగ్రవాదానికి వ్యతిరరేకంగా పోరాడడం కోసం సంఘటిత అపరాధాని కి వ్యతిరేకం గా చట్టపరమైన చర్యల ను తీసుకోవడం అత్యంత అవసరం. ఒక్కొక్క సారి చట్ట వ్యతిరేకం గా ఆర్జించిన సొమ్ము ను పరాయి ప్రాంతాని కి పంపించడం మరియు ద్రవ్య సంబంధమైన అపరాధాలు వంటి కార్యకలాపాలు సైతం ఉగ్రవాద సంబంధి నిధుల రూపాన్ని సంతరించుకొంటున్నాయి అని కూడా వెలుగు లోకి వచ్చింది. దీని పైన పోరాడాలి అంటే యావత్తు ప్రపంచ దేశాల మధ్య సమన్వయం ఏర్పడాలి.

మిత్రులారా,

ఈ కోవ కు చెందిన ఒక జటిలమైనటువంటి వాతావరణం లో, ఐక్య రాజ్య సమితి భద్రత మండలి, ఫైనాన్శల్ ఏక్శన్ టాస్క్ ఫోర్స్ , ఫైనాన్శల్ ఇంటెలిజెన్స్ యూనిట్ స్ మరియు ఎగ్ మాంట్ గ్రూపు లు చట్ట విరుద్ధ ధన ప్రవాహాలను గుర్తించడం లో, ఆటంక పెట్టడం లో మరియు చట్టపరమైన విచారణ చేసే క్రమం లో సహకారాన్ని పెంపొందింపచేస్తున్నాయి. ఇది గడచిన రెండు దశాబ్ధాల కు పైగా కాలం లో, ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధాని కి ఎన్నో విధాలు గా దోహదపడుతూ వస్తోంది. ఇది ఉగ్రవాదాని కి నిధుల ను అందించడం లో పొంచి ఉన్న ముప్పుల ను అర్థం చేసుకోవడం లో కూడా సహాయకారి గా ఉంటున్నది.

మిత్రులారా,

ప్రస్తుతం, ఉగ్రవాదానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలు మార్పునకు లోనవుతున్నాయి. శరవేగం గా సరికొత్త రూపు రేఖల ను సంతరించుకొంటున్న సాంకేతిక విజ్ఞానం అనేది ఇటు ఒక పరిష్కార మార్గం గా, అటు ఒక సవాలు గా కూడా నిలుస్తున్నది. ఉగ్రవాదానికి ధన సహాయం అందించడానికి మరియు ఉగ్రవాదులు గా నియామకాలు జరపడానికి కొత్త రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం జరుగుతున్నది. డార్క్- నెట్, ప్రైవేటు పద్ధతి న జారీ చేసేటటువంటి కరెన్సీ లు మరియు అన్య నూతన సాంకేతికతల తాలూకు సవాళ్ళు తలల ను ఎత్తుతున్నాయి. నూతన ఆర్థిక సహాయ సంబంధి సాంకేతికతల ను అందరూ అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ ప్రయాసల లో ప్రైవేటు రంగాన్ని కూడా కలుపుకొని పోవడం ముఖ్యం. ఒక ఏకరూప అవగాహన, అడ్డగింపునకు ఏకీకృత ప్రణాళిక మరియు ఒక ఏకీకృతమైన నియమ నిబంధనల ను అమలులోకి తీసుకు రావలసి ఉన్నది. కానీ మనం ఎల్లప్పటికీ ఒక విషయం పట్ల జాగ్రత తో ఉండాలి. సాంకేతిక విజ్ఞానాన్ని తప్పుపట్టడం అనేది దీనికి సమాధానం కాబోదు. ఇంత కన్న ఉగ్రవాదాన్ని ఆనవాలు పట్టడానికి, దాని జాడల ను వెతకడానికి మరియు దానికి ఎదురొడ్డి నిలవడానికి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి.

మిత్రులారా,

ఇప్పుడు, భౌతిక ప్రపంచం లో సహకారం ఒక్కటే కాకుండా వర్చువల్ జగతి లో సహకారం కూడా అవసరపడుతుంది. సైబర్ టెరరిజమ్ ను మరియు ఆన్ లైన్ రాడికలైజేశన్ ను విస్తరింపచేయడం కోసం మౌలిక సదుపాయాల ను ఉపయోగించుకోవడం జరుగుతున్నది. కొన్ని మారుమూల ప్రాంతాల నుండి మరియు ఆన్ లైన్ మాధ్యం ద్వారా ఆయుధాల ను ఎలా ప్రయోగించాలో అనే శిక్షణ ను ఇస్తాం అంటూ ప్రతిపాదన లు వస్తుంటాయి. కమ్యూనికేశన్స్, ఒక చోటు నుండి మరొక చోటు కు రాక పోక లు, లాజిస్టిక్స్ సహితం గా విభిన్న దేశాల లో ఈ గొలుసు కు అనేక లంకె లు ఉంటున్నాయి. ప్రతి ఒక్క దేశం తన అందుబాటు లో ఉన్న ఈ గొలుసు లోని ముక్క కు వ్యతిరేకం గా తప్పక చర్య తీసుకోగలుగుతుంది మరి ఆ దేశం ఈ పని ని తప్పక చేయాలి.

మిత్రులారా,

అనేక దేశాల లో వాటికంటూ సొంత చట్ట పరమైన సిద్ధాంతాలు, ప్రక్రియలు మరియు నిబంధనలు అంటూ ఉన్నాయి. సార్వభౌమ దేశాల దగ్గర వాటి ప్రణాళికల లో భాగం గా పనిచేసే అధికారం ఉంది. ఏమైనా, విభిన్న ప్రణాళిక ల మధ్య గల తేడాల ను తీవ్రవాదులు దుర్వినియోగ పరచుకొనేందుకు అవకాశం ఇవ్వకుండా కూడా మనం సావధానం గా ఉండవలసిందే. దీనిని ప్రభుత్వాల మధ్య విస్తృతమైన సమన్వయం మరియు అవగాహన ల ద్వారా అడ్డుకోవడం సాధ్యపడుతుంది. సంయుక్త కార్యకలాపాల నిర్వహణ, రహస్య సమాచారం విషయం లో సమన్వయం మరియు పరదేశీ దోషుల ను/అపరాధుల ను అప్పగించడం వంటివి ఉగ్రవాదాని కి విరుద్ధం గా జరిగే యుద్ధం చేయడం లో సహాయకారి అవుతాయి. సమూల సంస్కరణ వాదం సమస్య ను మరియు అతివాదం సమస్య ను కలసికట్టు గా పరిష్కరించడం సైతం ముఖ్యం. సమూల సంస్కరణ వాదాని కి ఊతాన్ని ఇచ్చే వారు ఎవరైనా సరే, వారి కి ఏ దేశం లోనూ నిలువ నీడ అనేది దొరకకూడదు.

మిత్రులారా,

గడచిన కొన్ని నెలలు గా, భద్రత కు సంబంధించిన విభిన్న పార్శ్వాల పై అనేక సమావేశాల ను భారతదేశం లో నిర్వహించడం జరిగింది. భారతదేశం న్యూ ఢిల్లీ లో ఇంటర్ పోల్ యొక్క మహా సభ కు ఆతిథేయి గా వ్యవహరించింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి యొక్క ఉగ్రవాద వ్యతిరేక సంఘం తాలూకు ప్రత్యేక సమావేశం ముంబయి లో జరిగింది. ఈ యొక్క నో మనీ ఫార్ టెరర్సమావేశం లో ఉగ్రవాదాని కి నిధుల అందజేత కు వ్యతిరేకం గా ప్రపంచాన్ని గతిశీలం కలిగింది గా మలచడం కోసం భారతదేశం చేయూత ను అందిస్తున్నది. మనం ఉగ్రవాదం పై జరుగుతున్న యుద్ధాన్ని తరువాతి మజిలీ కి తీసుకుపోవడం కోసం యావత్తు ప్రపంచాన్ని కూడగట్టాలన్నదే మా ఉద్దేశ్యం గా ఉంది.

మిత్రులారా,

రాబోయే కొన్ని రోజులలో జరిగే చర్చోపచర్చల లో సఫలత సిద్ధించడం కోసం సైతం ఈ సమావేశం లో పాలుపంచుకొంటున్న వారందరికీ నేను శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. ఉగ్రవాదాని కి అందుతున్న నిధుల పై అన్ని వైపుల నుండి దండెత్తి ధ్వంసం చేయడం లో మీరు సాయపడతారు అని నాకు పూర్తి గా నమ్మకం ఉంది.

మీకు ఇవే ధన్యవాదాలు.

మీకు అనేకానేక ధన్యావాదాలు.

***


(Release ID: 1877027) Visitor Counter : 274