ప్రధాన మంత్రి కార్యాలయం
బాలి లో జి-20 శిఖర సమ్మేళనంజరుగుతున్న క్రమం లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ చాన్స్ లర్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
16 NOV 2022 1:39PM by PIB Hyderabad
బాలి లో జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.
ఇది ఈ నేత ల మధ్య ఈ సంవత్సరం లో చోటు చేసుకొన్న మూడో సమావేశం; మునుపటి సమావేశాల లో ఈ సంవత్సరం మే 2వ తేదీ నాడు బర్లిన్ లో జరిగిన ఆరో ఇండియా-జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేశన్స్ లో పాలుపంచుకోవడం కోసం ప్రధాన మంత్రి అక్కడ కు వెళ్ళిన సందర్భం లో జరిగిన భేటీ ఒకటోది. దాని తరువాత చాన్స్ లర్ శ్రీ స్కోల్జ్ ఆహ్వానం మేరకు జి-7 శిఖర సమ్మేళనం లో భాగస్వామ్య దేశం గా ప్రధాన మంత్రి జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ ను సందర్శించిన సందర్భం లో చోటు చేసుకొన్న భేటీ రెండోది గా ఉన్నాయి.
నేత లు ఇద్దరు భారతదేశం మరియు జర్మనీ ల మధ్య విస్తృత ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించారు. ఈ సహకారం అనేది ఐజిసి జరిగిన సందర్భం లో ఛాన్స్ లర్ మరియు ప్రధాన మంత్రి కలసి పార్ట్ నర్ శిప్ ఆన్ గ్రీన్ ఎండ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ పత్రాల పై సంతకాలు చేయడం తో ఒక కొత్త అధ్యాయం లోకి ప్రవేశించింది. వ్యాపారం మరియు పెట్టుబడి సంబంధాల ను మరింత గా విస్తరింప జేసుకోవాలని, అంతేకాక రక్షణ, భద్రత, ప్రవాసం, మొబిలిటీ, ఇంకా మౌలిక సదుపాయల రంగాల లో సహకారాన్ని పెంపొందింప చేసుకోవాలని కూడా నేత లు ఉభయులు అంగీకారానికి వచ్చారు.
జి20 మరియు ఐక్య రాజ్య సమితి సహా బహుళ పక్ష వేదికల లో సహకారాన్ని మరియు సమన్వయాన్ని వృద్ధి చెందింపచేసుకోవడానికి ఇరువురు నేత లు సమ్మతి ని వ్యక్తం చేశారు.
***
(Release ID: 1876552)
Visitor Counter : 131
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam