ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాలి లో జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్న క్రమం లో యునైటెడ్ కింగ్ డమ్  ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 NOV 2022 3:47PM by PIB Hyderabad

జి-20 శిఖర సమ్మేళనం బాలి లో జరుగుతున్న సందర్భం లో యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని శ్రీ రుషి సునక్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.

ఇది ఇరువురు నేతల మధ్య జరిగిన ఒకటో సమావేశం. ప్రధాని శ్రీ రుషి సునక్ పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు గాను ప్రధాన మంత్రి ఆయన కు అభినందనల ను వ్యక్తం చేశారు.

భారతదేశం-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత స్థాయి లో కొనసాగుతుండడం పట్ల మరియు ద రోడ్ మేప్ 2030 ఫార్ ఫ్యూచర్ రిలేశన్స్ యొక్క పురోగతి పట్ల ఇద్దరు నేతలు సంతృప్తి ని వ్యక్తం చేశారు. కామన్ వెల్థ్ మరియు జి-20 సహా ద్వైపాక్షిక, ఇంకా బహుళ పాక్షిక వేదికల లో కలసికట్టుగా పని చేయవలసిన అంశాని కి ఉన్న ప్రాముఖ్యం విషయం లో ఇద్దరు నేత లు సమ్మతి ని వెలిబుచ్చారు.

వ్యాపారం, మొబిలిటీ, రక్షణ మరియు భద్రత వంటి ముఖ్య రంగాల లో సహకారం తాలూకు ప్రసక్తి కూడా చర్చల లో చోటు చేసుకొంది.

***


(రిలీజ్ ఐడి: 1876513) సందర్శకుల సూచీ సంఖ్య : : 164