ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తెలంగాణాలోని రామగుండంలో 9,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేసిన - ప్రధానమంత్రి


రామగుండంలో ఎరువుల ప్లాంట్‌ను అంకితం చేశారు


"భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు ఉత్సాహంగా గమనిస్తున్నారు"


"ఆత్మవిశ్వాసం, అభివృద్ధి ఆకాంక్షలతో ప్రపంచానికి కొత్త భారతదేశం దర్శనమిస్తోంది"


"కేంద్ర ప్రభుత్వ నిజాయితీ ప్రయత్నాలకు ఎరువుల రంగం ఒక నిదర్శనం"


"ఎస్.సి.సి.ఎల్. ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదు"


‘‘ఎస్‌.సీ.సీ.ఎల్‌. లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా ఎస్.సి.సి.ఎల్. ప్రైవేటీకరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోదు”

Posted On: 12 NOV 2022 5:49PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రోజు తెలంగాణాలోని రామ‌గుండంలో 9,500 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌ చేసి జాతికి అంకితం చేశారు. అంతకు ముందు, రోజు, ప్రధానమంత్రి, రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్.ఎఫ్.సి.ఎల్) కర్మాగారాన్ని సందర్శించారు.

సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగిస్తూ, ఈరోజు ప్రారంభించిన, శంకుస్థాప‌న‌లు జ‌రిపిన ప్రాజెక్టులు వ్యవసాయాన్నీ, వ్యవసాయాభివృద్ధినీ ప్రోత్సహిస్తాయని, చెప్పారు. ఒకవైపు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పాటు, యుద్ధ మరియు సైనిక చర్యలకు సంబంధించిన కఠినమైన పరిస్థితులతో ప్రభావితమవుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "అయితే, వీటన్నింటి మధ్య భారతదేశం మాత్రం, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశలో పయనిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు" అని ప్రధానమంత్రి తెలియజేశారు. 90 నుంచి 30 ఏళ్లకు సమానమైన వృద్ధి రానున్న కొద్ది సంవత్సరాల్లో జరుగుతుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నట్లు, ప్రధానమంత్రి చెప్పారు. అవగాహనకు గత 8 సంవత్సరాల్లో దేశంలో వచ్చిన మార్పే ప్రధాన కారణం. భారతదేశం గత 8 సంవత్సరాలలో పని చేసే విధానాన్ని మార్చుకుంది. 8 ఏళ్లలో ఆలోచనతో పాటు పాలనా విధానం కూడా రూపాంతరం చెందింది" ఆయన వివరించారు. ఇది మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రక్రియలు, వ్యాపారాన్ని సులభతరం చేయడం, భారతదేశ ఆకాంక్షాత్మక సమాజం నుండి ప్రేరణ పొందుతున్న పరివర్తనలలో చూడవచ్చు.

"ఆత్మవిశ్వాసం, అభివృద్ధి ఆకాంక్షలతో ప్రపంచానికి కొత్త భారతదేశం దర్శనమిస్తోంది." అని ఆయన అభివర్ణించారు. దేశంలో అభివృద్ధి అనేది ఏడాదిలో 365 రోజులు కొనసాగే నిరంతర ప్రక్రియ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టును అంకితం చేసినప్పుడు, కొత్త ప్రాజెక్టుల పనులు ఏకకాలంలో ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని, రామగుండం ప్రాజెక్టు దీనికి స్పష్టమైన ఉదాహరణ అని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. రామగుండం ప్రాజెక్టు కు 2016 ఆగస్టు, 7 తేదీన ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

21 శతాబ్దపు భారతదేశం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను సాధించడం ద్వారా ముందుకు సాగగలదని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. "లక్ష్యం ప్రతిష్టాత్మకంగా ఉన్నప్పుడు, మనం కొత్త పద్ధతులతో ముందుకు వచ్చి, కొత్త సౌకర్యాలను సృష్టించాలి", అని ప్రధానమంత్రి సందర్భంగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ నిజాయితీ ప్రయత్నాలకు ఎరువుల రంగం నిదర్శనమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఎరువుల డిమాండును తీర్చడానికి భారతదేశం విదేశాలపై ఆధారపడే కాలాన్ని ప్రధానమంత్రి వివరిస్తూ, రామగుండం ప్లాంటుతో సహా కాలం చెల్లిన సాంకేతికతల కారణంగా గతంలో ఏర్పాటు చేసిన అనేక ఎరువుల కర్మాగారాలు మూతపడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. విపరీతమైన ధరలకు దిగుమతి చేసుకున్న యూరియా రైతులకు చేరకుండా ఇతర ప్రయోజనాల కోసం బ్లాక్‌ మార్కెట్లోకి తరలించేవారని ఆయన విమర్శించారు.

ఎరువుల లభ్యతను మెరుగుపరచడానికి చర్యలు:

వంద శాతం వేప పూత యూరియా.

మూతపడిన 5 పెద్ద ప్లాంట్లను తెరిపిస్తే, 60 లక్షల టన్నులకు పైగా యూరియా ఉత్పత్తి అవుతుంది.

నానో యూరియా తయారీకి ప్రోత్సాహం.

భారత దేశ వ్యాప్తంగా ఒకే బ్రాండ్ - 'భారత్ బ్రాండ్'.

ఎరువులు అందుబాటు ధరల్లో ఉంచేందుకు 8 ఏళ్లలో 9.5 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది.

ఏడాది 2.5 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగింది.

బస్తా యూరియా అంతర్జాతీయ ధర 2,000 రూపాయలు కాగా, రైతులు 270 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు.

ప్రతి డీ.ఏ.పీ. ఎరువుల బస్తా పై రైతులకు కు 2,500 రూపాయల మేర రాయితీ లభిస్తుంది.

ఎరువుల నిర్ణయం సమాచారం కోసం సాయిల్ హెల్త్ కార్డు.

పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 2.25 లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయడం జరిగింది.

2014 తర్వాత, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్యల్లో భాగంగా 100 శాతం వేప పూత యూరియాను ఉత్పత్తి చేయడంతో పాటు, బ్లాక్‌ మార్కెటింగ్‌ ను నిలిపివేయడం జరిగింది. తమ పొలాలకు అవసరమైన పూర్తి పరిజ్ఞానాన్ని, సాయిల్ హెల్త్ కార్డ్ ప్రచారం ద్వారా రైతులకు నిర్ధారించడం జరుగుతోందని, ఆయన వివరించారు. ఏళ్ల తరబడి మూతపడి ఉన్న ఐదు పెద్ద ఎరువుల కర్మాగారాలను పునః ప్రారంభమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ లోని గోరఖ్‌పూర్ ప్లాంటు ఉత్పత్తిని ప్రారంభించింది. రామగుండం ప్లాంటును జాతికి అంకితం చేయడం జరిగింది. ఐదు కర్మాగారాలు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించినట్లైతే, దేశానికి 60 లక్షల టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుంది, దిగుమతుల వ్యయంపై భారీ ఆదా అవుతుంది, రైతులకు యూరియా లభ్యత సులభతరమవుతుంది. రామగుండం ఎరువుల కర్మాగారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని రైతులకు సేవలందిస్తుందని, ప్రధానమంత్రి తెలియజేశారు. చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను ప్లాంటు ప్రోత్సహిస్తుంది. ప్రాంతంలో సరకు రవాణా సంబంధిత వ్యాపారాలకు ఊతమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టే 6,000 కోట్ల రూపాయలతో తెలంగాణ యువతకు అనేక వేల రూపాయల ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఎరువుల రంగంలో సాంకేతిక పురోగతి గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, నానో యూరియా రంగంలో, ఇది, భారీ మార్పు తీసుకు వస్తుందని అన్నారు. ప్రధానమంత్రి ఆత్మ నిర్భరత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మహమ్మారి, యుద్ధం వంటి పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ధరల ప్రభావం రైతుల మీద పడకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 2000 రూపాయల యూరియా బస్తాను, రైతులకు 270 రూపాయలకే అందుబాటులో ఉంచడం జరిగింది. అదే విధంగా, అంతర్జాతీయ మార్కెట్‌ లో 4,000 రూపాయల ధర ఉన్న డీ.ఏ.పీ. ఒక్కో బస్తాపై 2, 500 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వడం జరుగుతోంది.

" ఎరువుల రూపంలో రైతులపై అదనపు భారం పడకుండా చూడాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాల కాలంలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారత రైతులకు తక్కువ ధరలో ఎరువులు లభించేలా చూడడానికి ఈ ఏడాది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసిందని వివరించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో  కేంద్ర ప్రభుత్వం 2.25 లక్షల కోట్లు జమ చేసిందని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. దశాబ్దాలుగా మార్కెట్‌లో లభ్యమవుతున్న అనేక రకాల పేర్లతో లభిస్తున్న  ఎరువులు  రైతులను ఆందోళనకు గురి చేస్తూ వచ్చాయని  ప్రధాన మంత్రి అన్నారు.  “యూరియా ఇప్పుడు భారతదేశంలో ఒకే బ్రాండ్‌ను కలిగి ఉంటుంది .  భారత్ బ్రాండ్ పేరిట యూరియా లభిస్తుంది. ఇప్పటికే    భారత్ బ్రాండ్ యూరియా  నాణ్యత మరియు ధర  నిర్ణయించడం జరిగింది ”అని ప్రధాని వెల్లడించారు. రైతులు ముఖ్యంగా సన్నకారు రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న చర్యలకు ఇది ఒక నిదర్శనమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 

అనుసంధానం, మౌలిక సదుపాయాల రంగంలో ఎదురవుతున్న సమస్యలను ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. సమస్యలను పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో అదునాతన రహదారులు, విమానాశ్రయాలు, జలమార్గాలు,  రైల్వే, ఇంటర్నెట్ రహదారుల నిర్మాణం చేపట్టామని ప్రధాని వివరించారు.పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ఈ సౌకర్యాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. సమన్వయం, అవగాహనతో పనులు అమలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రాజెక్టుల నిర్మాణంలో విపరీతమైన జాప్యం లేకుండా నిర్ణీత కాలంలో పూర్తవుతుందని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం లను కలుపుతూ చేపట్టిన రైల్వే లైను నిర్మాణం  4 ఏళ్లలో పూర్తయిందని తెలిపిన ప్రధాని దీనివల్ల  స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. . అదేవిధంగా, ఈ రోజు పనులు ప్రారంభించిన మూడు హైవేలు పారిశ్రామిక బెల్ట్, చెరకు మరియు పసుపు సాగు దారులకు ప్రయోజనం కలిగిస్తాయని  వివరించారు.

అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్న సమయంలో పుకార్లు వేగంగా వ్యాపించడం సహజమేనని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ శక్తులు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అన్నారు. ప్రస్తుతం  ప్రస్తుతం తెలంగాణలో 'సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్-ఎస్‌సీసీఎల్', ఇతర బొగ్గు గనులపై ఇటువంటి పుకార్లు వినిపిస్తున్నాయని అనాన్రు. ' ఎస్‌సీసీఎల్ లో తెలంగాణ ప్రభుత్వం 51% వాటా, కేంద్ర ప్రభుత్వం 49% వాటా కలిగి వున్నాయి. ఎస్‌సీసీఎల్ ని ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తనంతతాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని ప్రధానమంత్రి వివరణ ఇచ్చారు. ఎస్‌సీసీఎల్ ని ప్రైవేటు పరం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. 

బొగ్గు గనుల్లో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల విలువ చేసే కుంభకోణాలు చోటుచేసుకున్నాయని, దీనివల్ల దేశం విపరీతంగా నష్టపోవాల్సి వచ్చిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కుంభకోణాల వల్ల కార్మికులు,పేదలు , గనులు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు దారుణంగా నష్టపోయారని అన్నారు. తమ ప్రభుత్వం పూర్తి పారదర్శక విధానంలో బొగ్గు గనులను వేలం వేస్తున్నదని ప్రధాని అన్నారు. దేశంలో పెరుగుతున్న బొగ్గు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. ''ఖనిజాలు వెలికితీస్తున్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రయోజనం కలిగించే లక్ష్యంతో   మా ప్రభుత్వం డీఎంఎఫ్- జిల్లా మినరల్ ఫండ్ ఏర్పాటు చేసింది. ఈ నిధి కింద రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి" అని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. “సబ్కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ మరియు సబ్‌కా ప్రయాస్ అనే మంత్రాన్ని అనుసరించడం ద్వారా మేము తెలంగాణను ముందుకు తీసుకుని వెళ్తాం" అంటూ తన ప్రసంగాన్ని శ్రీ మోదీ ముగించారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 70 నియోజకవర్గాల నుంచి రైతులు పాల్గొన్నారు.

నేపథ్యం:

2016 ఆగస్టు 7న రామగుండంలో రామగుండం ప్రాజెక్టు నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయిన  ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి ఈరోజు  జాతికి అంకితం చేశారు. యూరియా రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న పట్టుదలతో ప్రధానమంత్రి అమలు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా రామగుండం  ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పథకం అమలు జరిగింది.  రామగుండం ప్లాంట్ సంవత్సరానికి 12.7 ఎల్ఎంటీ  దేశీయ వేప పూత తో  యూరియా ను  ఉత్పత్తిని చేస్తుంది. 

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) మరియు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL)  రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL)  కలిసి జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.దాదాపు 6300 కోట్ల  పెట్టుబడితో న్యూ అమ్మోనియా-యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను   రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కి అప్పగించారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ ప్లాంట్‌కు అవసరమైన  గ్యాస్ జగదీష్‌పూర్-ఫుల్పూర్-హల్దియా పైప్‌లైన్ ద్వారా సరఫరా చేయబడుతుంది.

తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ మరియు మహారాష్ట్రలోని రైతులకు యూరియా ఎరువులు తగినంత మరియు సకాలంలో సరఫరా అయ్యేలా ప్లాంట్ చర్యలు తీసుకుంటుంది.  ఈ ప్లాంట్ వల్ల  ఎరువుల లభ్యతను మెరుగుపరచడమే కాకుండా రహదారులు , రైల్వేలు, అనుబంధ పరిశ్రమల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి తో  ఈ ప్రాంతంలో మొత్తం ఆర్థికాభివృద్ధిని దోహదపడుతుంది. కర్మాగారానికి అవసరమైన సరుకులు సరఫరా చేయడానికి ప్రాంతంలో ఎంఎస్ఎంఈ సంస్థలు ఏర్పాటు అవుతాయి.ఎంఎస్ఎంఈ ల ఏర్పాటు వల్ల స్థానిక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.   రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే  'భారత్ యూరియా' దిగుమతులను తగ్గిస్తుంది.  ఎరువులు, సౌకర్యాలు సకాలంలో రైతులకు సరఫరా అవుతాయి. దీనివల్ల  స్థానిక రైతులు ప్రయోజనం పొందుతారు.  ఆర్థిక వ్యవస్థకు అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

దాదాపు 1000 కోట్ల రూపాయలతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. జాతీయ రహదారి -765 DGలోని మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్ లో  .2200 కోట్ల రూపాయల విలువైన వివిధ రోడ్డు ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.  జాతీయ రహదారి -161BB లోని  బోధన్-బాసర్-భైంసా విభాగం, జాతీయ రహదారి -353C లో సిరోంచ నుండి మహదేవ్‌పూర్ సెక్షన్ లో పనులు అమలు జరుగుతాయి. 

*****

DS/TS


(Release ID: 1875558) Visitor Counter : 285