ప్రధాన మంత్రి కార్యాలయం

బెంగళూరు లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లో రెండో టర్మినల్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

Posted On: 11 NOV 2022 3:09PM by PIB Hyderabad

బెంగళూరు లో గల కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తాలూకు రెండవ టర్మినల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు.  విమానాశ్రయం అధికారుల తో ఆయన భేటీ అయ్యారు కూడాను. ఈ సందర్భం లో విమానాశ్రయం అధికారులు రెండో టర్మినల్ భవనం రూపురేఖల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించారు.  కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఎక్స్ పీరియన్స్ సెంటర్ లో సమకూర్చిన సదుపాయాల ను ఆయన పరిశీలించడం తో పాటు రెండో టర్మినల్ గుండా కలియదిరిగారు.  రెండో టర్మినల్ ను గురించిన ఒక లఘు చిత్రాన్ని కూడా ప్రధాన మంత్రి వీక్షించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లోని రెండో టర్మినల్ విమానాశ్రయం యొక్క సామర్థ్యాన్ని పెంపు చేయడం తో పాటు మరిన్ని సౌకర్యాల ను కూడా అందించనుంది.  ఇది మన నగర స్వరూపాలను ఉన్నత శ్రేణి మౌలిక సదుపాయాల సహితం గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యం తో చేపట్టిన మా ప్రయాసల లో ఒక భాగం గా ఉన్నది.  టర్మినల్ అత్యంత సుందరం గాను, ప్రయాణికుల కు సౌకర్యవంతమైంది గాను ఉంది.  దీనిని ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

పూర్వరంగం

 

బెంగళూరు లో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వ్యయం తో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టర్మినల్ ను నిర్మించడమైంది.  ప్రస్తుతం ఏడాది కి 2.5 కోట్ల మంది ప్రయాణికులు రాక పోక లు జరుపుతున్న విమానాశ్రయ సామర్థ్యం ఈ టర్మినల్ అందుబాటు లోకి వచ్చాక రెట్టింపై, సంవత్సరానికి 5-6 కోట్ల మంది ప్రయాణికుల కు అనువైంది గా ఉండగలదు.

 

ఉద్యానవన నగరమైన బెంగళూరు కు ఒక బహుమతి గా, ప్రయాణికుల కు ఒక ఉద్యానవనం లో నడచిన అనుభూతి ని ఇచ్చేదిగా ఈ రెండో టర్మినల్ ను రూపొందించడం జరిగింది.  ప్రయాణికులు పది వేలకు పైగా చదరపు మీటర్ల పచ్చని గోడలు, వేలాడే తోట లు, ఆరుబయలు ఉద్యానవనాల గుండా సాగేందుకు వీలు ఉంది.  ప్రాంగణం అంతటా వంద శాతం నవీకరణ యోగ్య ఇంధనాన్ని వినియోగించుకొనే అవకాశం ఉండడం తో ఈ విమానాశ్రయం ఇప్పటికే స్థిరత్వం లో ఒక గుర్తింపు ను తెచ్చుకొంది. 

 

ఈ రెండో టర్మినల్ ను స్థిరత్వ సూత్రాల తో రూపొందించడం జరిగింది.  స్థిరత్వం కోసం చేపట్టిన చర్యల ఆధారం గా,  కార్యకలాపాల ను ప్రారంభించడానికి ముందే అమెరికా  గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (జిబిసి) ద్వారా ప్రి సర్టిఫైడ్ ప్లాటినమ్ రేటింగు ను పొందిన ప్రపంచం లోని అతి పెద్ద టర్మినల్ గా ఈ రెండో టర్మినల్  నిలచింది.   రెండో టర్మినల్ కోసం ఏర్పాటు చేసిన అన్ని కళాఖండాల ను ‘నవరస’ ఇతివృత్తం ఏకం చేస్తుంది.  ఇక్కడ అమర్చిన కళాఖండాలు కర్నాటక వారసత్వం, సంస్కృతి లతో పాటు సువిశాల భారతీయ తత్వాన్ని కూడా ప్రతిబింబిస్తాయి.

 

మొత్తం మీద, రెండో టర్మినల్ రూపకల్పన, నిర్మాణం నాలుగు మార్గదర్శక సూత్రాల ద్వారా ప్రభావితమైంది. అవి ఏవేవంటే పచ్చని తోట లో టర్మినల్, స్థిరత్వం, సాంకేతికత, కళ మరియు సంస్కృతి అనేవే.  రెండో టర్మినల్‌ ఆధునికమైంది అయినప్పటికీ ఈ అంశాల వల్ల ఈ టర్మినల్ ప్రకృతి తో మమేకమై, ప్రయాణికులందరికీ ‘ఒక చిరస్మరణీయమైన గమ్యం’ తాలూకు అనుభవాన్ని అందిస్తుంది.

 

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి వెంట కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, కర్నాటక గవర్నరు శ్రీ థావర్ చంద్ గహ్ లోత్ మరియు కేంద్ర  మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశి లు ఉన్నారు.

 

 

 

*****

DS/TS

 

***

 



(Release ID: 1875279) Visitor Counter : 168