ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్ముకశ్మీర్‌లో వైద్య విద్య నవశకంపై ప్రధానమంత్రి ప్రశంసలు
జమ్ముకశ్మీర్‌లోని 20 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో 265 ‘డిఎన్‌బి’
పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
Posted On:
08 NOV 2022 7:57PM by PIB Hyderabad
జమ్ముకశ్మీర్‌లో వైద్య విద్య నవ శకారంభంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా ఇక్కడి 20 జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రులలో 265 ‘డిఎన్‌బి’ పోస్ట్-గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని కూడా ఆయన అభినందించారు. యువతకు సాధికారత కల్పన, జమ్ముకశ్మీర్‌లో వైద్య మౌలిక సదుపాయాల పెంపు లక్ష్యంగా చేపట్టిన కృషిలో ఇదొక కీలక ప్రయత్నమని ప్రధాని పేర్కొన్నారు.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవ్య ట్వీట్‌పై స్పందిస్తూ ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇది జమ్ముకశ్మీర్‌లో యువతకు సాధికారత కల్పించడంతోపాటు వైద్య మౌలిక సదుపాయాల పెంపునకు ఉద్దేశించిన కీలక ప్రయత్నం!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1874639)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam