సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో స్వచ్ఛతా ప్రచారం-2, జయప్రదం


4,735 క్వింటాళ్ల చెత్త, వ్యర్థాల తొలగింపు...

1,75,447 చదరపు అడుగుల ప్రాంతం
చెత్తరహితం, రూ.3.71కోట్ల రెవెన్యూ ఆర్జన...

1,08,298 భౌతిక ఫైళ్లపై సమీక్ష
66,938 పాత ఫైళ్ల తొలగింపు
336 ప్రాంతాల్లో స్వచ్ఛతా ప్రచారం,
3,766 స్థలాలు పరిశుభ్రం

Posted On: 03 NOV 2022 11:36AM by PIB Hyderabad

  స్వచ్ఛతా అభియాన్ పథకం కింద రెండవ దశ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని (స్పెషల్ క్యాంపెయిన్ 2.0ను) కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విజయవంతంగా పూర్తి చేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఆ శాఖ అనుబంధ కార్యాలయాలు, సబార్డినేట్ కార్యాలయాలు, ఆ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, పత్రికా సమాచార కార్యాలయం (పి.ఐ.బి.) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు; సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సి.బి.సి.); ప్రచురణల విభాగం; రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్.ఎన్.ఐ.); కేంద్రీయ ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు (సి.బి.ఎఫ్.సి.); ఎలక్ట్రానిక్ మీడియా పర్యవేక్షణ కేంద్రం (ఇ.ఎం.ఎం.సి.); న్యూ మీడియా వింగ్ (ఎన్.ఎం.వి.); ప్రసార భారతి (. ఆకాశవాణి బి. దూరదర్శన్);  ఫిలిం-టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్.టి.ఐ.ఐ.-పూణె); సత్యజిత్ రే ఫిలిం-అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్.ఆర్.ఎఫ్.టి.ఐ.,- కోల్‌కతా); ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐ.ఐ.ఎం.సి.); ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పి.సి.ఐ.); బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ (ఇండియా) లిమిటెడ్ (బెసిల్), జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్.ఎఫ్.డి.సి.). (విలీనమైన ఫిలిం మీడియా యూనిట్లతో సహా) అన్ని సంస్థల్లో ఈ ప్రచార కార్యక్రమం జయప్రదంగా జరిగింది. 2022 అక్టోబర్ 2వ తేదీనుంచి 31వ తేదీవరకూ అఖిల భారత స్థాయిలో ఈ రెండవ దశ ప్రత్యేక ప్రచారం చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం,  పాతవి/అనవసరమైనవి అయిన ఫైళ్లను తొలగించివేయడం,  కార్యాలయాల ఆవరణాల శుభ్రత, స్థల నిర్వహణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సాధించిన విజయాలు ఇలా ఉన్నాయి: -

 

  • 14 ఎ.పి. రెఫరెన్సులు, 320 ప్రజాఫిర్యాదులు, 181 పి.జి. అప్పీలళ్లను, 4 పార్లమెంటరీ హామీలను పరిష్కరించారు.
  •  మొత్తం1,08,298 ఫిజికల్ ఫైళ్లను సమీక్షించి, వాటిలో 66,938 పాత ఫైళ్లను తొలగించివేశారు. 2,217 ఎలక్ట్రానిక్ ఫైళ్లను (ఇ-ఫైళ్లను) సమీక్షించి వాటిలో 1,868 ఫైళ్లను తొలగించివేశారు. 1,75,447 చదరపు అడుగుల ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఖాళీ చేశారు. రూ. 3,71,66,846 మేర ఆదాయాన్ని (రెవిన్యూని) సముపార్జించారు.
  •  మొత్తం 336వరకూ ఆరుబయలు పరిశుభ్రతా ప్రచారం నిర్వహించారు. 3,766 ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి చెత్తను తొలగించారు.
  1. సన్నాహక దశ
  • 2022 సెప్టెంబర్ 14 నుంచి 30వ తేదీవరకూ జరిగిన సన్నాహక దశలో, నోడల్ అధికారి నియామకం, అనుబంధ-సబార్డినేట్ కార్యాలయాలు, వాటి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో అవగాహన కల్పన, పరిశుభ్రత ప్రచార స్థలాల ఎంపిక, గుర్తింపు, రద్దీ సామగ్రి, అనవసరమైన వ్యర్థాల గుర్తింపు వంటి చర్యలు తీసుకున్నారు. పాత న్యూస్ పేపర్లు/మ్యాగజైన్ల ఏరివేయడం కోసం  విక్రేతలను ఏర్పాటు చేసుకునే అంశంపై గట్టి కసరత్తు జరిగింది.
  • ముందస్తు ప్రచార తనిఖీలో భాగంగా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ 2022 సెప్టెంబర్ 29న అహ్మదాబాద్‌ దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించారు. మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ కార్యాలయాలలో స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించేందుకు ఈ పర్యటనను చేపట్టారు. కార్యక్రమ ఘనవిజయానికి  అవసరమైన అపారమైన ఉత్సాహాన్ని ఈ పర్యటన కల్పించింది.  
  • సన్నాహక దశలోనే మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ అధికారులు, వివిధ రకాల క్షేత్రస్థాయి కార్యాలయాలను సందర్శించారు. ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జరిగే ముందస్తు సన్నాహక దశ పనులను వారు ఈ సందర్భంగా పరిశీలించారు.
  • ప్రచారం విజయవంతం కావడానికి, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో సహా వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో దీనిపై అవగాహన కల్పించడానికి పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ (డి.ఎ.ఆర్.పి.జి.)తో సమన్వయం/సహకారంతో అమలు చేయడానికి మంత్రిత్వ శాఖలోని అన్ని మీడియా కార్యాలయాలకు మీడియా ప్రణాళికను, మార్గదర్శకాలను జారీ చేశారు.

 

 

  1. ప్రచార దశ
  • 2022 అక్టోబర్ 2న 2వ దశ ప్రత్యేక ప్రచారం ప్రారంభం కావడంతో, డి.ఎ.ఆర్.పి.జి. మార్గదర్శకాల ప్రాతిపదికన పురోగతిని పర్యవేక్షించే ప్రక్రియను రోజువారీ పద్ధతిలో నిర్వహించారు. మంత్రిత్వ శాఖ నుంచి అధికారులు మీడియా యూనిట్లు, వారి క్షేత్ర కార్యాలయాల్లో అక్కడికక్కడే పురోగతిని సమీక్షించడానికి, లక్ష్యాలు విజయవంతంగా  అమలు జరిగేలా మార్గదర్శకత్వం అందించడానికి మంత్రిత్వ శాఖ అధికారులను డిప్యుటేషన్‌ పద్ధతిలో నియమించారు.
  •  రెండవ దశ ప్రత్యేక ప్రచారం పురోగతిని ప్రతిరోజూ డి.ఎ.ఆర్.పి.జి. ద్వారా ప్రత్యేక పోర్టల్ (https://www.pgportal.gov.in/scdpm22 సహాయంతో పర్యవేక్షించారు. కార్యక్రమ విజయాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు పోర్టల్‌లో పొందుపరిచారు.
  •  

 

క్రమసంఖ్య

కేటగిరీ

2022 అక్టోబరు నెలాఖరునాటికి ప్రగతి

1

స్వచ్ఛతా ప్రచార స్థలాలు (బయటి ప్రాంతాల్లో)

336

2

పరిశుభ్రతా ప్రక్రియ అమలుజరిగిన స్థలాల సంఖ్య (ఆవరణ లోపల, బయటి ప్రాంతాల్లో)

3,766

3

రికార్డుల నిర్వహణ:

సమీక్షించిన ఫైళ్లు (భౌతిక ఫైళ్లు + ఇ-ఫైళ్లు)

1,10,515

4

ప్రజా ఫిర్యాదులు + పరిష్కరించిన అప్పీళ్లు

501

5

ఆర్జించిన ఆదాయం (రెవెన్యూ)

Rs. 3,71,66,846

6

చెత్తనుంచి విముక్తి పొందిన ప్రాంతం ( చదరపు అడుగుల్లో)

1,75,447

7

ఎం.పి. రెఫరెన్సులు

14

 

 

 

 

8

పార్లమెంటరీ హామీల సంఖ్య

4

9

తొలగించిన రద్దీ సామగ్రి/పాతవస్తువులు/వార్తాపత్రికలు తదితరాల పరిమాణం (క్వింటాళ్లలో)

4,735

         
  • ప్రత్యేక ప్రచారంలో వివిధ కార్యాచరణ అంశాలకింద, మంత్రిత్వ శాఖ 2022 అక్టోబరు 2నుంచి, 2022 అక్టోబరు 31వ తేదీ వరకూ సాధించిన విజయాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి.
  • 4. లక్ష్యాలను అధిగమించేందుకు దారి తీసిన అంశాలు

1) బయటి ప్రదేశాల్లో ప్రచారం (ప్రారంభ లక్ష్యం- 196 సాధించింది- 336)

2) తొలగించి వేయాల్సిన భౌతిక ఫైళ్ళపై సమీక్ష (తొలి లక్ష్యం- 48,726 సాధించింది-1,08,298)

3) ఇ-ఫైళ్ల సమీక్ష (తొలి లక్ష్యం- 86 సాధించింది-2,217)

4) ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించినప్పటికీ వివిధ స్థలాల్లో పారిశుద్ధ్యంపై పూర్తి చేసిన కార్యక్రమాలు- 3,766

5. కార్యక్రమంలో సాధించిన అద్భుతమైన విజయాలు తెలియజెప్పేందుకు వివిధ ప్రాంతాలపై ఫిలింల చిత్రీకరణ

అద్భుతమైన విజయాలు సాధించిన కార్యకలాపాలకు సంబంధించి 4 స్థలాలను చిత్రీకరించారు. డి.ఎ.ఆర్.పి. మార్గదర్శకాలకు అనుగుణంగా చిత్రీకరణ జరిగింది. వాటిని ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా చూపించారు. అవి:

1.) దూరదర్శన్ కేంద్రం, జైపూర్; 2) ఆకాశవాణి కేంద్రం, జైపూర్, ; 3) ఆకాశవాణి కేంద్రం, త్రివేండ్రం  4) సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సి.బి.సి.), స్టోర్ రూమ్.

  1. విజయగాథలు

ఎ.) దూరదర్శన్ కేంద్రం, అహ్మదాబాద్

బి.) ఆకాశవాణి విజయం

సి) సి.బి.సి.(పదేళ్లకు పైగా పేరుకుపోయిన బిల్లులను, నమూనా వార్తా పత్రికలను తొలగిస్తున్నారు.)

  1. ప్రత్యేక ప్రచార కార్యక్రమం-2 సాధించిన విజయాలను వివిధ సమాచార సాధనాల ద్వారా ప్రచారం చేయడం. 

 

) మొత్తం ట్వీట్ల సంఖ్య

1,174

బి) మొత్తం వీడియోల సంఖ్య

318

సి) ప్రదర్శించిన మొత్తం లఘు చలనచిత్రాలు

17

డి) ఇతర సామాజిక మాధ్యం పోస్టుల మొత్తం సంఖ్య

834

) జారీ అయిన పి.ఐ.బి. ప్రకటనలు

3

 

 

 

 

 

 

8. ప్రచారం కింద, వివిధ సమాచార సాధనాల ద్వారా ముఖ్యంగా చేపట్టిన పోస్టులు

  స్వచ్ఛతపై 2వ దశ ప్రత్యేక ప్రచార కార్యక్రమం కింద అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రంలో, విజయవాడలోని ఆకాశవాణి కేంద్రంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జరిపిన పర్యటనల గురంచి స్థానిక మీడియాలో ప్రచురణ.   

 

ప్రింట్ మీడియా

 

 

 

బి. లఘు చలనచిత్రాల ప్రదర్శన

  •  స్వచ్ఛతా అన్న ఇతివృత్తంతో, ప్రత్యేక ప్రచార కార్యక్రమం-2పై అవగాహనను కలిగించేందుకు, కార్యక్రమం ప్రభావాన్ని తెలియజేసేందుకు 7 లఘు చలన చిత్రాలను చలనచిత్ర విభాగం ప్రదర్శించింది. వాటిని ఈ దిగువన చూడవచ్చు:
  1. ధమ్నేర్ (10 నిమిషాలు)

క్లుప్తంగా సారాంశం: మహారాష్ట్రలోని ధమ్నేర్ గ్రామవాసులు, ఎంతో అంకిత భావంతో కష్టపడి పనిచేసి, తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చుకున్నారు.

  1. చిమూ (4 నిమిషాలు)

సారాంశం:

చెత్తచెదారం వెదజల్లితే కలిగే హాని ఏమిటో చిము ప్రాంతం అర్థం చేసుకుంది. నగరాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో తెలియజెప్పేందుకు సిద్ధపడింది.

  1. చర్చిగేట్ ఫాస్ట్ (3 నిమిషాలు)

సారాంశం: ఉమ్మివేయడం అనే అతి చిన్న తప్పు, సమాజంమీద, పర్యావరణంపైన, చివరకు ఆరోగ్యంపైన ఎంత ప్రభావం చూపుతుందో తెలియజెప్పే చిత్రం.

  1. మిస్టర్ క్లీన్ కమ్స్ టు సిటీ (3 నిమిషాలు)

సారాంశం: పౌరవిజ్ఞానం, అవగాహన, నగర పరిశుభ్రతపై చిత్రీకరించిన లఘు చలనచిత్రం.

  1. పైడ్ పైపర్ ఆఫ్ ముంబై (4 నిమిషాలు)

సారాంశం: పరిశుభ్రతపై అవగాహన కోసం నిర్మించిన అనిమేషన్ చిత్రం ఇది. మీ శుభ్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం మీ బాధ్యత మాత్రమే అన్న సందేశాన్ని అందిస్తుంది. ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే నీకే హానికరంగా మారుతుందని హెచ్చరిస్తుంది.

  1. హిస్సాబ్ దో (3 నిమిషాలు)

సారాంశం: నగరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో ఈ చిత్రం చెబుతుంది.  నీ నివాస పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం నీ సామాజిక బాధ్యతగా నిర్దేశిస్తుంది.

  1. ప్లాస్టిక్ వరల్డ్ (7 నిమిషాలు)

సారాంశం:

ప్లాస్టిక్ వ్యర్థాలు ఆవరించిన నేపథ్యంలో భవిష్యత్తులోని విస్తారమైన, మెట్ట ప్రాంతాన్ని అభివర్ణించే యానిమేషన్ చలనచిత్రం. మానవ జీవితంపై,  పర్యావరణ వ్యవస్థపై ప్లాస్టిక్ ప్రమాదకరమైన ప్రతికూల ప్రభావాలను గురించి ఇది హెచ్చరిస్తుంది.

 

9. 2022 అక్టోబరు 31తర్వాత పురోగతిలో ఉన్న/పెండింగ్‌లో ఉన్న పనులు

)  తొలగించి వేయాల్సిన పాతవి/పనికిరానివి అయిన వాహనాలు- 194

         బి) సి.బి.సి.లో పదేళ్లకుపైగా పాతబడిన బిల్లులను, నమూనా పేపర్లను తొలగించివేస్తున్నారు.

సి) ఆకాశవాణికి సంబంధించి వివిధ కేంద్రాల్లో/కార్యాలయాల్లో కొనసాగుతున్న ఇంధన ఆడిట్ ప్రక్రియ.

డి) న్యూఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రం (పి.ఐ.బి.)లో ఉద్యానవన ప్రక్రియ మెరుగుదల.

) ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో విరాళంగా అందించవలసిన పుస్తకాలు.

 

కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అహ్మదాబాద్ దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించిన దృశ్యాలు.

 

 

సూచనా భవన్‌లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సి.బి.సి.)

 ప్రధాన కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కార్యదర్శి అపూర్వ చంద్ర సందర్శించిన చిత్రం

7

3 (1)

 

                  

 

***



(Release ID: 1873578) Visitor Counter : 128