హోం మంత్రిత్వ శాఖ
నాలుగు ప్రత్యేక ఆపరేషన్లకు 2022 సంవత్సరానికి కేంద్ర హోంమంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్
Posted On:
31 OCT 2022 11:30AM by PIB Hyderabad
నాలుగు ప్రత్యేక ఆపరేషన్లకు 2022వ సంవత్సరానికి గాను కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్ ను అందించారు. అత్యున్నత స్థాయి ప్రణాళిక, దేశ/ రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత భద్రతకు అత్యంత ప్రాముఖ్యత, సమాజంలోని భారీ వర్గాల భద్రతపై ప్రముఖ ప్రభావం కలిగిన ఆపరేషన్లను గుర్తించే లక్ష్యంతో 2018లో ఈ మెడల్ ను ఏర్పాటు చేశారు. ఈ అవార్డును తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, సరిహద్దు చర్యలు, ఆయుధాల నియంత్రణ, మత్తు మందుల స్మగ్లింగ్ నిరోధం, రక్షణ ఆపరేషన్ వంటి అంశాలలో ప్రత్యేక ఆపరేషన్ కు ఈ అవార్డును అందిస్తారు. ఈ అవార్డును ప్రతి ఏడాదీ 31 అక్టోబర్ న అందచేస్తారు. ఒక ఏడాదిలో, సాధారణంగా అసాధారణ పరిస్థితుల్లో చేపట్టిన 3 ప్రత్యేక ఆపరేషన్లను అవార్డును పరిగణిస్తారు. రాష్ట్ర/ కేంద్ర పాలిత పోలీసులను ప్రోత్సహించేందుకు 5 ప్రత్యేక ఆపరేషన్ల వరకు ఈ అవార్డును ఇవ్వవచ్చు.
అవార్డు గ్రహీతల జాబితా కోసం దిగువ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి:
(Release ID: 1872504)
Visitor Counter : 172
Read this release in:
Odia
,
Malayalam
,
Tamil
,
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Gujarati