ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రాల హోం మంత్రులతో మేధోమథన శిబిరంలో ప్రధాని ప్రసంగం
“సహకారాత్మక సమాఖ్య తత్వానికి ఈ మేధోమథన శిబిరమే ఉదాహరణ”;
“సుపరిపాలనకు ‘పంచ ప్రాణ్’ సూత్రం చోదక శక్తి కావాలి”;
“అత్యాధునిక సాంకేతికతతో శాంతిభద్రతల వ్యవస్థ మెరుగుపడగలదు”;
“శాంతిభద్రతల నిర్వహణ నిర్విరామంగా నిర్వర్తించాల్సిన బాధ్యత”;
“ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరులో ‘ఉపా’ వంటి
చట్టాలతో వ్యవస్థకు మరింత బలం చేకూరింది”;
“ఒకే దేశం-ఒకే యూనిఫాం’తో చట్టాల అమలు వ్యవస్థకు సార్వత్రిక గుర్తింపు”;
“బూటకపు వార్తల నిరోధంలో మనం సాంకేతికతంగా ఇంకా ముందంజ వేయాలి”;
తుపాకులు లేదా కలాలు.. రూపమేదైనా నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించాలి”;
“పోలీసు సామర్థ్యంతో ముడిపడిన ఆ శాఖ వాహనాలు ఎన్నడూ పాతబడరాదు”
Posted On:
28 OCT 2022 12:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల హోంశాఖ మంత్రుల మేధోమథన శిబిరంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- పండుగల వేళ శాంతియుత వాతావరణం దిశగా శాంతిభద్రతల సిబ్బంది ఏర్పాట్లను అభినందించారు. సహకారాత్మక సమాఖ్య తత్వానికి ఈ మేధోమథన శిబిరమే ఒక ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదే అయినప్పటికీ అవి దేశ సమైక్యత, సమగ్రతలతో సమానంగా ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు. “ప్రతి రాష్ట్రం ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవాలి.. పరస్పరం స్ఫూర్తి పొందుతూ.. దేశాభ్యున్నతికి కృషి చేయాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఇదే నిదర్శనం.. అదే సమయంలో దేశప్రజల పట్ల మన కర్తవ్యం కూడా” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత అమృతకాలం గురించి ప్రస్తావిస్తూ- ఈ సమయంలో ‘పంచప్రాణ్’ సూత్రాన్ని ముందుకు నడిపించే అమృత తరం ఆవిర్భవిస్తుందని ప్రధాని అన్నారు. “సుపరిపాలనకు ‘పంచ ప్రాణ్’ సూత్రం చోదకశక్తి కావాలి” అని ఆయన స్పష్టం చేశారు.
దేశం ఎప్పుడైతే బలోపేతం అవుతుందో అప్పుడు అందులో భాగమైన ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం శక్తిని పుంజుకోవడం తథ్యమని ప్రధానమంత్రి అన్నారు. “ప్రతి రాష్ట్రంలోనూ వరుసలో చివరి వ్యక్తికీ ప్రయోజనాలను అందించే సుపరిపాలన ఇదే. శాంతిభద్రతల వ్యవస్థకు, రాష్ట్రాల అభివృద్ధికి మధ్యగల అవినాభావ సంబంధాన్ని ఆయన నొక్కిచెప్పారు. “విశ్వసనీయంగా ఉండటం శాంతిభద్రతల వ్యవస్థకు అత్యంత ముఖ్యం. ప్రజల్లో దానిపై విశ్వాసం, అవగాహన ఎంతో కీలకమైనవి” అని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ‘ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్’లకు ప్రజల్లో గుర్తింపు పెరుగుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా నేరం ప్రదేశానికి పోలీసులు చేరుకోవడాన్ని ప్రభుత్వమే తక్షణం తమవద్దకు వచ్చినట్లుగా ప్రజలు పరిగణిస్తారని గుర్తుచేశారు. కరోనా కాలంలో పోలీసుల సేవలతో ప్రజల్లో వారి ప్రతిష్ట పెరిగిందని ప్రధానమంత్రి అన్నారు. వారిలో నిబద్ధత, విషయ పరిజ్ఞానాలకు లోటులేదని, పోలీసులపై ప్రజల్లో అవగాహన మరింత బలోపేతం కావాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ మేరకు వారికి మార్గనిర్దేశం చేయడం మన నిరంతర ప్రక్రియగా ఉండాలని స్పష్టం చేశారు.
నేరాలు ఇప్పుడు స్థానికతకు పరిమితం కావని, అంతర్రాష్ట్ర-అంతర్జాతీయ స్థాయి నేర సంఘటనలో పెరుగుతున్నాయని ప్రధాని గుర్తుచేశారు. అందుకే కేంద్ర-రాష్ట్ర వ్యవస్థల మధ్య పరస్పర సహకారం కీలకం అవుతున్నదని చెప్పారు. సైబర్ నేరమైనా, డ్రోన్ సాంకేతికతతో ఆయుధాలు లేదా మాదకద్రవ్యాల స్మగ్లింగ్ వంటి నేరమైనా ఆయా ముప్పుల పరిష్కారం దిశగా ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతల కోసం కృషిచేస్తూనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ““అత్యాధునిక సాంకేతికతతో శాంతిభద్రతల వ్యవస్థ మెరుగుపడగలదు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 5జి, దాని ప్రయోజనాలతోపాటు మరింత అప్రమత్తత అవసరాన్ని కూడా ముందుకు తెస్తుందన్నారు. ఈ సాంకేతికత భద్రతపై సామాన్యులలో విశ్వాసం నింపుతుంది కాబట్టి బడ్జెట్ పరిమితులకు అతీతంగా దీని అవసరంపై ఎక్కువగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రులు, హోం మంత్రులకు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ ‘పోలీస్ టెక్నాలజీ మిషన్’ గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- వివిధ రాష్ట్రాల్లోని విభిన్న సాంకేతికతలు పరస్పరం వ్యవహరించలేవు కాబట్టి ఉమ్మడి వేదిక ఆవశ్యకతను నొక్కిచెప్పారు. “మనకు అఖిలభారత దృక్పథం ఉండటంతోపాటు మనం అనుసరించే మంచి విధానాలు పరస్పర నిర్వహణకు వీలుగా ఉండాలి. వాటి మధ్య సార్వత్రిక సంధానం కూడా అవసరం” అన్నారు. ‘రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు న్యాయ-వైద్య శాస్త్రం (ఫోరెన్సిక్ సైన్స్)లో సామర్థ్యాలను పెంచుకోవాలని, ఈ దిశగా గాంధీనగర్‌లోని జాతీయ న్యాయ-వైద్యశాస్త్ర విశ్వవిద్యాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
దేశంలో సంస్కరణలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు దోహదపడే శాంతిభద్రతల వ్యవస్థ పటిష్టానికి కొన్నేళ్లుగా అనేక సంస్కరణలు తెచ్చినట్లు గుర్తుచేశారు. “శాంతిభద్రతల నిర్వహణ వారానికి ఏడు రోజులూ.. 24 గంటలూ నిర్విరామంగా నిర్వర్తించాల్సిన బాధ్యత” అని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియలలో సరికొత్త ఆవిష్కరణలు, పరిజ్ఞానాల మెరుగుదల దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీల చట్టంలోని అనేక అంశాలను నేరరహితం చేయడం ఇందులో ఒక ముందడుగని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రాలు కూడా కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలను విశ్లేషించి అనవసరమైన వాటిని తొలగించాలని కోరారు.
అవినీతి, ఉగ్రవాదం, హవాలా నేరాలతో పటిష్టంగా వ్యవహరించగల సంకల్పం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాల్లో స్పష్టంగా ఉందని ప్రధాని అన్నారు. ముఖ్యంగా “ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరులో యుఎపిఎ’ వంటి చట్టాలు వ్యవస్థకు మరింత బలాన్నిచ్చాయి” అని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు.
దేశం లో రాష్ట్రాల పోలీసు బలగాలన్నిటికి ఒకే విధమైన యూనిఫార్మ్ ఉండే విషయాన్ని గురించి ఆలోచన చేయవలసింది గా సభికుల కు ప్రధాన మంత్రి సూచన చేశారు. ఇది స్థాయి పరం గా నాణ్యమైనటువంటి ఉత్పాదనల కు పూచీపడడం ఒక్కటే కాకుండా చట్టం అమలు యంత్రాంగానికి ఒక ఉమ్మడి గుర్తింపు ను ఇవ్వగలుగుతుందని, పౌరులు దేశం లో ఏ మూలన అయినా పోలీసు సిబ్బంది ని ఇట్టే గుర్తుపట్టగలుగుతారని ఆయన అన్నారు. రాష్ట్రాలు వాటి సంఖ్య ను గాని, లేదా అధికార చిహ్నాన్ని గాని ఎంచుకోవచ్చు. ‘‘ఒక దేశం, ఒకే పోలీస్ యూనిఫార్మ్, ఈ అంశాన్ని మీ పరిశీలన కు నేను నివేదిస్తున్నాను అంతే’’ అని ఆయన అన్నారు. అదే విధం గా, పర్యటన రంగ సంబంధి పోలీసింగ్ కు ప్రత్యేక సామర్ధ్యాలను అభివృద్ధిపరచుకోవడాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది అని ఆయన నొక్కిచెప్పారు. ఏదైనా స్థానం యొక్క పేరుప్రతిష్ఠలకు అత్యంత ప్రధానమైనటువంటి మరియు త్వరిత గతి న ప్రభావాన్ని చూపగల ప్రతినిధులు యాత్రికులు అని ఆయన అన్నారు.
సూక్ష్మగ్రాహ్యత యొక్క ప్రాముఖ్యాన్ని గురించి, అలాగే సొంత శైలి ని అలవరచుకోవలసిన అవసరాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. మహమ్మారి కాలం లో ప్రజల కు, ప్రత్యేకించి వయస్సు పైబడిన పౌరుల కు సాయపడడం కోసం పోలీసులు చేసిన కాల్స్ ను గురించి ఆయన ఉదాహరణల ను ఇచ్చారు. మానవుల తెలివితేటల తో పాటే సాంకేతిక విజ్ఞాన సంబంధి వివేకాన్ని కూడాను పటిష్టపరచుకోవాలని, సాంకేతిక విజ్ఞాన సంబంధి వివేకాన్ని అలక్ష్యం చేయజాలమన్నారు. భారతదేశం హోదా పెరుగుతూ ఉన్న తరుణం లో కొత్తగా తలెత్తే సవాళ్ల విషయం లో జాగరూకం గా ఉండవలసిన అవసరం ఉంది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమాల తాలూకు అవకాశాల ను గురించి ప్రధాన మంత్రి చెబుతూ, వాటి కి సమాచార సంబంధి వనరు గా మాత్రమే గిరి ని గీయకూడదు అన్నారు. ఒకే ఒక్క నకిలీ వార్త కు అయినా సరే, జాతీయ స్థాయి ఆందోళన కు దారి తీసే సామర్థ్యం ఉంటుంది అని ఆయన అన్నారు. గతం లో ఉద్యోగ రిజర్వేశన్ లను గురించిన బూటకపు వార్త కారణం గా భారతదేశం నష్టాల ను ఎదుర్కోవలసి రావడం శోచనీయం అని ఆయన అన్నారు. సమాచారం తాలూకు ఏదైనా అంశాన్ని ప్రజల కు చేరవేసే కన్నా ముందుగా దానిని విశ్లేషించుకొని, సరిచూసుకోవలసిన అవసరం ఉంది అని ఆయన నొక్కిచెప్పారు. ‘‘ఫేక్ న్యూజ్ ను వ్యాప్తి చేయడాన్ని నిరోధించగలిగిన సాంకేతిక విజ్ఞాన సంబంధి పురోగతి ని మనం ఆవిష్కరించాలి’’ అని ఆయన అన్నారు. దేశం లో పౌర రక్షణ పెరగవలసిన అవసరాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, విద్యార్థినీవిద్యార్థులు దీనిని గురించి పరిచయం పెంపొందింపచేసుకొనేటట్లు గా అగ్నిమాపకదళం వారు మరియు పోలీసులు పాఠశాలల లోను, కళాశాలల లోను అభ్యాసాల ను నిర్వహించాలి అని ఆయన కోరారు.
ఉగ్రవాదం యొక్క క్షేత్ర స్థాయి నెట్ వర్క్ ను రూపు మాపవలసిన అవసరం ఎంతయినా ఉంది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, ప్రతి ఒక్క ప్రభుత్వం తన సామర్థ్యం మరియు అవగాహన ల మేరకు వాటి వంతు ప్రయాసల ను చేయడానికి కృషి చేస్తోందన్నారు. అంతా ఒక్కటై స్థితి ని సంబాళించడం తక్షణ కర్తవ్యం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నక్సలిజమ్ తాలూకు ప్రతి ఒక్క రూపం, అది తుపాకులతో కావచ్చు లేదా కలాలతో కూడినది కావచ్చు.. వాటిని దేశ యువత ను తప్పుదారి పట్టించకుండా నివారించడానికి గాను పెకలించవలసి ఉంది’’ అని కూడా ఆయన అన్నారు. భావి తరాల మస్తిష్కాల ను క్రమ మార్గం నుండి తప్పించడం కోసం ఆ తరహా శక్తులు వాటి మేథోపరమైన పరిధి ని విస్తరింపచేసుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి ముందుజాగ్రత్త చెప్పారు. దేశ ప్రజల యొక్క ఐక్యత మరియు అఖండత ల కోసం మరియు సర్ దార్ పటేల్ గారి స్ఫూర్తి తోను మనం ఆ కోవ కు చెందిన ఏ శక్తులను మన దేశం లో వృద్ధి చెందనీయకూడదు. అటువంటి శక్తులు అంతర్జాతీయం గా గణనీయ సాయాన్ని పొందుతుంటాయి అని కూడా ఆయన అన్నారు.
గడచిన ఎనిమిది సంవత్సరాల లో, దేశం లో నక్సల్ ప్రభావిత జిల్లా ల సంఖ్య చెప్పుకోదగిన స్థాయి కి దిగివచ్చింది అని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. ‘‘అది జమ్ము కశ్మీర్ కావచ్చు లేదా ఈశాన్య ప్రాంతాలు కావచ్చు, ప్రస్తుతం మనం మౌలిక సదుపాయాల కల్పన సహా అన్ని రంగాల లో శర వేగంగా అభివృద్ధి ని సాధించడం పైన శ్రద్ధ తీసుకోవలసి ఉంది.’’ అని ఆయన అన్నారు. పట్టణాల కు ప్రవాసం పోయే వారిని తిరిగి వారి స్వస్థలాల కు తీసుకు రావడాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాలు మరియు కోస్తా తీర ప్రాంతాల ను అభివృద్ధి పరచడం అనే అంశం పై మిశన్ మోడ్ లో పాటుపడుతోందని ప్రధాన మంత్రి తెలిపారు. అది ఆయా ప్రాంతాల లో ఆయుధాలు మరియు మాదక పదార్థాల దొంగరవాణా ను అడ్డుకోవడం లో ప్రభావాన్ని చూపగలుగుతుంది అని కూడా ఆయన అన్నారు. ఈ ప్రణాళికల ను అమలుపరచడం లో సరిహద్దు రాష్ట్రాలు మరియు కోస్తా తీర ప్రాంత రాష్ట్రాల నుండి అధిక సహకారం అవసరం అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో, కొన్నేళ్లు గా డిజిపి సమావేశాల లో ఆవిష్కారమైన సూచనల ను గురించి గంభీరంగా అధ్యయనం చేయాలని కోరారు. నూతన స్క్రేపేజ్ పాలిసి పరంగా పోలీసు దళం వాటి వాహనాల ను మదింపు చేసుకోవాలని కూడా ఆయన అన్నారు. ‘‘పోలీసు వాహనాలు వారి కార్యకుశలత కు సంబంధించినవి కాబట్టి అవి ఎన్నటికీ పాతబడిపోకూడదు’’ అని ఆయన అన్నారు.
మనం గనక ఒక జాతీయ దృష్టికోణం తో ముందుకు సాగామంటే, ప్రతి ఒక్క సవాలు కూడాను మన ముందు చిన్నబోతుంది. ‘‘ఈ చింతన్ శిబిరం లో, ఒక మార్గసూచీ తో పాటు గా మెరుగైన సూచన లు వెల్లడి అవుతాయి. మీకు అంతా మంచే జరగాలి అని నేను కోరుకుంటున్నాను’’ అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
పూర్వరంగం
ఈ చింతన్ శిబిరాన్ని 2022 అక్టోబర్ 27వ, 28వ తేదీల లో హరియాణా లోని సూరజ్ కుండ్ లో నిర్వహించడం జరుగుతోంది. ఈ చింతన్ శిబిరం లో వివిధ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు మరియు పోలీసు డైరెక్టర్ జనరల్స్ (డిజిపి లు) మరియు కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సిఎపిఎఫ్ లు) మరియు కేంద్ర పోలీసు సంస్థ (సిపిఒ) ల డైరెక్టర్ జనరల్స్ కూడా పాల్గొంటారు.
ఈ హోం మంత్రుల చింతన్ శిబిరం అనేది స్వాతంత్య్ర దినం సందర్భం లో ప్రధాన మంత్రి ప్రకటించిన పంచ్ ప్రణ్ కు అనుగుణం గా అంతర్గత భద్రత కు సంబంధించిన అంశాల పై విధాన రూపకల్పన పై జాతీయ దృక్పథాన్ని అందించడానికి జరుగుతున్న ఒక ప్రయాస గా ఉంది. సహకారాత్మక సమాఖ్య భావన కు తగినట్లుగా ఈ శిబిరం కేంద్రం, రాష్ట్రాల స్థాయి లో వివిధ స్టేక్ హోల్డర్స్ మధ్య ప్రణాళిక, ఇంకా సమన్వయం లో అధిక అవగాహన కు బాట ను పరచనుంది.
పోలీసు బలగాల ఆధునికీకరణ, సైబర్ అపరాధాల ను అరికట్టడం, అపరాధిక న్యాయ వ్యవస్థ లో పెరుగుతున్న ఐటి ఉపయోగం, భూ సరిహద్దు నిర్వహణ. తీరప్రాంతాల భద్రత, మహిళల భద్రత, మాదక పదార్థాల అమ్మకం, రవాణా లేదా చట్టవ్యతిరేకమైన మాదకద్రవ్యాల దిగుమతి తదితర అంశాల పై ఈ శిబిరం లో చర్చించడం జరుగుతుంది,
*****
DS/TS
(Release ID: 1871541)
Visitor Counter : 237
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam