ప్రధాన మంత్రి కార్యాలయం
మినికాయ్, థుండి బీచ్ లకు మరియు కదమత్బీచ్ కు ‘బ్లూ బీచ్’ ల ప్రతిష్ఠాత్మక సూచీ లో స్థానం దక్కేటట్టు చూసినందుకు గానులక్షద్వీప్ ప్రజల కు అభినందనలను తెలిపినప్రధాన మంత్రి
కోస్తా తీర ప్రాంత పరిశుభ్రత ను పెంచే విషయం లో భారతీయుల కు గల ఉత్సాహాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు
Posted On:
26 OCT 2022 7:05PM by PIB Hyderabad
మినికాయ్, థుండి సముద్ర తీరాలు మరియు కదమత్ సముద్ర తీరం ‘బ్లూ బీచ్’ ల ప్రతిష్ఠిత సూచీ లో స్థానాన్ని సంపాదించుకొన్నందుకు గాను లక్షద్వీప్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకం గా అభినందనల ను వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన బీచ్ లుగా వీటికి పర్యావరణ గుర్తింపు లభించింది. ప్రధాన మంత్రి భారతదేశపు ఉల్లేఖనీయమైనటువంటి కోస్తా తీరాన్ని గురించి నొక్కిచెప్పడం తో పాటు గా కోస్తా ప్రాంత సంబంధి స్వచ్ఛత ను పెంపొందింపచేయడం లో భారతీయులు ప్రదర్శించిన ఉత్సాహాన్ని మెచ్చుకొన్నారు.
పర్యావరణం, అడవులు, జల వాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి తాను మరొక ట్వీట్ లో శేర్ చేస్తూ –
‘‘ఇది చాలా బాగుంది. ఈ కార్యసిద్ధి కి గాను విశేషించి లక్షద్వీప్ ప్రజల కు అభినందన లు. భారతదేశపు కోస్తా తీర ప్రాంతం చెప్పుకోదగ్గది. అంతేకాకుండా, కోస్తా తీర ప్రాంత సంబంధి నిర్మలత ను ముందుకు తీసుకుపోయే విషయం లో మన ప్రజల లో ఎంతో ఉత్సాహం కూడా కానవస్తోంది.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1871144)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam