ప్రధాన మంత్రి కార్యాలయం
అత్యంత భారీ ప్రయోగ వాహక నౌక ఎల్.వి.ఎం-3 ను విజయవంతంగా ప్రయోగించిన ఎన్.ఎస్.ఐ.ఎల్., ఇన్-స్పేస్, ఇస్రో లను అభినందించిన - ప్రధానమంత్రి
Posted On:
23 OCT 2022 10:10AM by PIB Hyderabad
అత్యంత భారీ ప్రయోగ వాహక నౌక ఎల్.వి.ఎం-3 ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష ఏజన్సీలు / సంస్థలైన ఎన్.ఎస్.ఐ.ఎల్., ఇన్-స్పేస్, ఇస్రో లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "అంతర్జాతీయ అనుసంధానత కోసం ఉద్దేశించిన 36 వన్-వెబ్ ఉపగ్రహాలతో మన అత్యంత భారీ ప్రయోగ వాహక నౌక ఎల్.వి.ఎం-3 ను విజయవంతంగా ప్రయోగించిన ఎన్.ఎస్.ఐ.ఎల్., ఇన్-స్పేస్, ఇస్రో లకు అభినందనలు. ఎల్.వి.ఎం-3 ఆత్మ నిర్భరత కు ఉదాహరణ గా నిలుస్తుంది, ప్రపంచ వాణిజ్య ప్రయోగ సేవా మార్కెట్ లో భారత దేశ పోటీతత్వాన్ని పెంచుతుంది." అని పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1870550)
Visitor Counter : 202
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada