ప్రధాన మంత్రి కార్యాలయం
అక్టోబర్ 19వ, 20వ తేదీల లోగుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
దాదాపుగా 15,670 కోట్ల రూపాయల విలువ కలిగిన పథకాల కు గుజరాత్ లో ప్రజలకు అంకితం మరియు శంకుస్థాపన చేయనున్నప్రధాన మంత్రి
భారతదేశంయొక్క రక్షణ రంగ సంబంధి తయారీ కౌశలాన్ని కళ్ళకు కట్టే దిశ లో ఒక ముఖ్యమైన ముందడుగులో భాగంగా, డిఫ్ఎక్స్ పో22 నుప్రారంభించనున్న ప్రధాన మంత్రి
ఎక్స్ పో లోవిశేషించి మొట్టమొదటిసారి భారతీయ కంపెనీల కోసమే ఏర్పాటు చేసినటువంటి ఒక రక్షణసంబంధి ప్రదర్శన కు నిలయం కానుంది
ప్రధానమంత్రి డిఫ్ స్పేస్ కార్యక్రమాన్ని ప్రారంభించి, దీసా ఎయర్ ఫీల్డ్ కు శంకుస్థాపన చేస్తారు; స్వదేశీ శిక్షణ విమానం హెచ్ టిటి -40ని కూడా ఆయన ఆవిష్కరిస్తారు
కేవడియా లోమిశన్ లైఫ్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు
కేవడియా లో హెడ్స్ఆఫ్ మిశన్స్ పదో కాన్ఫరెన్స్ లో కూడా ప్రధాన మంత్రి పాల్గొంటారు
ప్రధానమంత్రి రాజ్ కోట్ లో ఇండియా అర్బన్ హౌసింగ్ కాన్ క్లేవ్ 2022 ను ప్రారంభించనున్నారు; ఇంచుమించు 5860 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తో పాటు దేశప్రజలకు అంకితం చేయనున్నారు
దాదాపుగా 4260 కోట్ల రూపాయల వ్యయంతో గుజరాత్ లో మిశన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సె లన్స్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు
దాదాపుగా 3580 కోట్ల రూపాయల విలువ కలిగిన అభివృద్ధి పథకాల కుజూనాగఢ్ లోను, 1970 కోట్లరూపాయల విలువ కలిగిన అభివృద్ధి పథకాలకు వ్యారా లోను శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
Posted On:
18 OCT 2022 10:36AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 19వ, 20వ తేదీల లో గుజరాత్ ను సందర్శించి 15,670 కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితం చేయడం తో పాటు గా శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధానమంత్రి డిఫ్ ఎక్స్ పో 22 ను అక్టోబరు 19వ తేదీ నాడు ఉదయం పూట ఇంచుమించు 9గంటల 45 నిమిషాలకు గాంధీనగర్ లోని మహాత్మ మందిర్ కన్వెన్శన్ ఎండ్ ఎగ్జిబిశన్ సెంటర్ లో ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి సుమారు 12 గంటల వేళ లో అడాలజ్ లో మిశన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లన్స్ ను ప్రారంభిస్తారు. ఆయన మధ్యాహ్నం సుమారు 3 గంటల 15 నిమిషాలకు జూనాగఢ్ లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. తదనంతరం సాయంత్రం పూట దాదాపుగా 6 గంటల వేళలో రాజ్ కోట్ లో ఇండియన్ అర్బన్ హౌసింగ్ కాన్ క్లేవ్ 2022 ను ఆయన ప్రారంభిస్తారు. అలాగే అనేక కీలక పథకాలకు శంకుస్థాపన చేసి, దేశ ప్రజలకు అంకితం ఇస్తారు. ఆయన రాజ్ కోట్ లో దాదాపుగా రాత్రి 7 గంటల 20 నిమిషాలకు వినూత్నమైన నిర్మాణ పద్ధతులతో కూడిన ఒక ప్రదర్శనను కూడా ప్రారంభిస్తారు.
అక్టోబర్ 20వ తేదీ నాడు ఉదయం దాదాపుగా 9 గంటల 45 నిమిషాల వేళలో కేవడియాలో ప్రధానమంత్రి మిషన్ లైఫ్ ను ప్రారంభించనున్నారు. మిట్ట మధ్యాహ్నం దాదాపుగా 12 గంటల వేళలో కేవడియా లో హెడ్స్ ఆఫ్ మిశన్ పదో కాన్ ఫరన్స్ లో ప్రధాన మంత్రి పాల్గొననున్నారు. అటు తరువాత మధ్యాహ్నం దాదాపుగా 3 గంటల 45 నిమిషాల వేళలో ఆయన వ్యారా లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
గాంధీ నగర్ లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి డిఫ్ ఎక్స్ పో 22 ను ప్రారంభిస్తారు. ‘పాథ్ టు ప్రైడ్’ ఇతివృత్తం లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్ పో, ఇండియన్ డిఫెన్స్ ఎక్స్ పో లో ఇంత వరకు ఎన్నడూ లేనంత పెద్ద భాగస్వామ్యానికి సాక్షి కానుంది. మొట్టమొదటిసారిగా విదేశీ ఓఈఎమ్ లయొక్క భారతదేశ అనుబంధ సంస్థ లు, భారతదేశంలో నమోదయిన కంపెనీ డివిజన్ లు, భారతీయ కంపెనీతో జాయింట్ వెంచర్ కలిగివున్న ఎగ్జిబిటర్ లు సహా ప్రత్యేకంగా భారతీయ కంపెనీల కోసమే ఉద్దేశించిన రక్షణ సంబంధి ప్రదర్శన ను ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమం భారతదేశం లోని రక్షణ సంబంధి తయారీ కౌశలం ఏ మేరకు విస్తరించింది, దాని స్థాయి ఎలాంటిదో కళ్ళకు కట్టనుంది. ఈ ఎక్స్ పో లో ఒక ఇండియా పెవిలియన్ మరియు స్టేట్ పెవిలియన్ లు ఏర్పాటు కానున్నాయి. ఇండియా పెవిలియన్ లో ప్రధాన మంత్రి హిందూస్థాన్ ఎయరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రూపొందించిన స్వదేశీ శిక్షణ విమానం హెచ్ టిటి- 40 ని ఆవిష్కరించనున్నారు. ఈ విమానం లో అత్యాధునిక యుద్ధ వ్యవస్థలను జతపరచడంతో పాటుగా విమాన చోదకులకు అనుకూలంగా ఉండేటటువంటి సదుపాయాలను కలిపి రూపుదిద్దడం జరిగింది.
ఇదే కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి మిశన్ డిఫ్ స్పేస్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లక్ష్యం ఏమిటి అంటే అది రక్షణ బలగాల కోసమని పరిశ్రమ మరియు స్టార్ట్- అప్స్ ల అండదండల తో అంతరిక్ష రంగానికి సంబంధించి వినూత్నమైన సాల్యూశన్స్ ను అభివృద్ధి పరచాలి అనేదే. ప్రధాన మంత్రి గుజరాత్ లోని దీసా వాయు క్షేత్రాని కి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఫార్వర్డ్ ఎయర్ ఫోర్స్ బేస్ దేశం లో భద్రత పరమైన స్వరూపాని కి పటిష్టత ను సంతరిస్తుంది.
ఈ ఎక్స్ పో లో ‘ఇండియా- ఆఫ్రికా: అడాప్టింగ్ స్ట్రేటిజి ఫార్ సినర్గైజింగ్ డిఫెన్స్ అండ్ సిక్యోరిటి కో ఆపరేశన్’ ఇతివృత్తం తో జరిగే రెండో ఇండియా - ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ కూడా చోటు చేసుకుంటుంది. రెండో ఇండియన్ ఓశన్ రీజియన్ ప్లస్ (ఐవోఆర్ +) కాన్ క్లేవ్ ను కూడా ఈ ఎక్స్ పో లో నిర్వహించడం జరుగుతుంది. ఇది శాంతి, వృద్ధి, స్థిరత్వం మరియు సమృద్ధి లను ప్రధానమంత్రి యొక్క ‘సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) దృష్టి కోణానికి అనుగుణంగా ఐవోఆర్ + దేశాల పరమైన రక్షణ సహకారాన్ని వృద్ధి పరచడానికి ఒక సమగ్రమైన చర్చ జరిగేందుకు వేదిక ను సమకూర్చనుంది. ఈ ఎక్స్ పోలోనే మొట్టమొదటి సారి గా రక్షణ రంగం కోసం ఇన్వెస్టర్స్ మీట్ ను కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది వందకు పైగా స్టార్ట్- అప్ లు వాటి యొక్క నూతన ఆవిష్కరణల ను ‘మంథన్ 2022’ లో ప్రదర్శించేందుకు ఒక అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాయి. అలాగే ఈ ఎక్స్ పోలో ఐడిఇఎక్స్ (ఇనోవేశన్స్ ఫార్ డిఫెన్స్ ఎక్స్ లెన్స్ ) అనే రక్షణ రంగ సంబంధి వినూత్నమైన కార్యక్రమం కూడా చోటుచేసుకొంటుంది. ఈ కార్యక్రమం లో ‘బంధన్’ కార్యక్రమం మాధ్యమం ద్వారా 451 భాగస్వామ్యాలు కూడా ప్రారంభం కాగలవు.
ప్రధానమంత్రి అడాలజ్ లోని త్రిమందిర్ లో మిశన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను కూడా ప్రారంభించనున్నారు. ఈ మిశన్స్ ను మొత్తం 10,000 కోట్ల రూపాయల వ్యయం తో రూపుదిద్దడమైంది. ఈ కార్యక్రమం లో భాగం గా దాదాపు గా 4260 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. గుజరాత్ లో కొత్త తరగతి గదులు, స్మార్ట్ క్లాస్ రూము లు, కంప్యూటర్ లేబ్స్ తో పాటు రాష్ట్రం లోని పాఠశాలల కు చెందిన మౌలిక సదుపాయాల సమగ్ర ఉన్నతీకరణ కు ఈ మిశన్ తోడ్పడనుంది.
జూనాగఢ్ లో ప్రధాన మంత్రి
దాదాపు గా 3580 కోట్ల రూపాయల విలువ కలిగిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
కోస్తా తీర ప్రాంతాల లో హైవే ల మెరుగుదల పనులు, అలాగే మరికొన్ని లంకె రహదారుల నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు యొక్క ఒకటో దశ లో 13 జిల్లాల గుండా సాగేటటువంటి 270 కిలోమీటర్లకు పైబడిన హైవే రూపుదాల్చనుంది.
ప్రధాన మంత్రి జూనాగఢ్ లో రెండు నీటి సరఫరా ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా వ్యావసాయిక ఉత్పాదనల ను నిలువ చేయడం కోసం ఉద్దేశించిన ఒక గిడ్డంగి భవనాల సముదాయ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి పోర్ బందర్ లో చెందిన శ్రీ కృష్ణ రుక్మిణి మందిర్, మాధవ్ పుర్ యొక్క సమగ్ర అభివృద్ధికి గాను శంకుస్థాపన చేయనున్నారు. పోర్ బందర్ ఫిశరీ హార్బర్ లో ఇసుక పూడికతీత పనులకు మరియు నీటి సరఫరా ఇంకా మురుగు పారుదల ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. గీర్ సోమ్ నాథ్ లో రెండు ప్రాజెక్టుల కు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుల లో మాధ్ వాడ్ లో ఒక ఫిశింగ్ పోర్ట్ అభివృద్ధి పథకం కూడా ఒకటిగా ఉంది.
రాజ్ కోట్ లో ప్రధాన మంత్రి
దాదాపుగా 5860 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి రాజ్ కోట్ లో దేశ ప్రజలకు అంకితం చేయడంతో పాటు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఆయన ఇండియా అర్బన్ హౌసింగ్ కాన్ క్లేవ్ 2022 ను కూడా ప్రారంభిస్తారు. ఈ కాన్ క్లేవ్ లో భారతదేశం లో గృహ నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చోపచర్చలు జరుగనున్నాయి. వాటిలో భాగంగా ప్రణాళిక రచన, ఆకృతి, రూపకల్పన, నియమనిబంధనలు, అమలు, మరింత మన్నికను ఆవిష్కరించడం, విధాన రూపకల్పన తదితర విషయాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. సార్వజనిక కార్యక్రమం లో పాల్గొన్న అనంతరం ప్రధాన మంత్రి వినూత్న నిర్మాణ పద్ధతులపై ఏర్పాటయిన ఒక ప్రదర్శన ను కూడా ప్రారంభిస్తారు.
సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి లైట్ హౌస్ ప్రాజెక్టు లో భాగం గా నిర్మాణం పూర్తి అయిన 1100 లకు పైగా ఇళ్ళను, ప్రజలకు అప్పగిస్తారు. ఈ గృహాల తాళంచెవులను కూడా లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. బ్రాహ్మణి -2 ఆనకట్ట నుండి నర్మద కెనాల్ పంపిగ్ స్టేశన్ వరకు నిర్మించిన మోర్ బీ - బల్క్ పైప్ లైన్ ప్రాజెక్టు ను ఆయన ప్రజలకు అంకితం చేస్తారు. ఇది ప్రధానం గా ఒక నీటి సరఫరా పథకం. ప్రధాన మంత్రి ద్వారా దేశ ప్రజలకు అంకితం కాబోయే ప్రాజెక్టుల లో రీజినల్ సైన్స్ సెంటర్ , ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ లతో పాటు రహదారి రంగాని కి సంబంధించిన ఇతర ప్రాజెక్టు లు కూడా ఉన్నాయి.
ప్రధాన మంత్రి గుజరాత్ లో ఎన్ హెచ్ 27 లో భాగంగా ఉన్న నాలుగు దోవలు కలిగివున్నటువంటి రాజ్ కోట్ -గోడాల్-జేత్ పుర్ సెక్శన్ ను ఆరు దోవల ను కలిగి ఉండేదిగా విస్తరించే పనుల కు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన మోర్ బీ, రాజ్ కోట్, బోటాద్, జామ్ నగర్ మరియు కచ్ఛ్ లలో వేరువేరు స్థానాల లో దాదాపుగా 2950 కోట్ల రూపాయల విలువ కలిగిన జిఐడిసి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా గఢ్ కా లో అమూల్ నుండి ముడిపదార్థాలు సరఫరా అయ్యేటటువంటి ఒక పాడి ఉత్పత్తుల ప్లాంటు కు, రాజ్ కోట్ లో ఇన్ డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రెండు నీటి సరఫరా ప్రాజెక్టుల కు మరియు రహదారులు, ఇంకా రైల్ వేల రంగానికి చెందినటువంటి ఇతర ప్రాజెక్టుల కు సైతం శంకుస్థాపన లు జరుగనున్నాయి.
కేవడియా లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి ఐక్య రాజ్య సమితి సెక్రట్రి జెనరల్ శ్రీ ఎంటొనియొ గుటెరెస్ తో జరిగే ఒక ద్వైపాక్షిక సమావేశం లో పాలుపంచుకొంటారు. తదనంతరం ఐరాస సెక్రట్రి జనరల్ సమక్షం లో కేవడియా లోని ఏక్ తా నగర్ లో గల ఏక్ తా విగ్రహం వద్ద మిశన్ లైఫ్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి మది లో రూపుదిద్దుకొన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం భారతదేశం నాయకత్వం లో ప్రపంచం అంతటా అమలయ్యే ఒక సామూహిక ఉద్యమం గా రూపొందుతుందన్న ఆశ ఉంది. ఈ ఉద్యమం పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వ్యక్తిగతంగా మరియు ఉమ్మడిగా తగిన కార్యాచరణ ను చేపట్టేందుకు స్ఫూర్తి ని అందిచనుంది.
దీర్ఘకాలం మనుగడ సాధించే దిశలో మన సామూహిక వైఖరి లో తగిన మార్పులను తీసుకురావడం కోసం ఒక త్రిముఖ వ్యూహాన్ని అవలంభించేటట్లు చూడడం అనేది మిశన్ లైఫ్ ధ్యేయం గా ఉంది. ఒకటో దశ లో భాగం గా వ్యక్తుల కు వారి దైనందిన జీవనం లో సీదాసాదా గా ఉంటూనే ప్రభావశీలమైనటువంటి పర్యావరణ మైత్రీ పూర్వక కార్యాలను చేస్తూ ఉండేటట్లు గా వారిలో స్ఫూర్తిని నింపడం (డిమాండు); రెండో దశ లో మారుతున్న డిమాండ్ పట్ల పరిశ్రమ లు మరియు బజారు లు శీఘ్రం గా ప్రతిస్పందించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం (సప్లయ్); ఇక మూడో దశ లో భాగం గా వినియోగం మరియు ఉత్పత్తి.. ఈ రెంటికీ సమర్థన లభించేటట్లుగా ప్రభుత్వాన్ని మరియు పారిశ్రామిక విధానాన్ని ప్రభావితం చేయడం (పాలిసి).. ఈ మిశన్ ఉద్దేశాల లో ప్రధానమైనవి.
ప్రధాన మంత్రి కేవడియా లో 2022 అక్టోబరు 20వ తేదీ మొదలుకొని 22వ తేదీ ల మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్న హెడ్స్ ఆఫ్ మిశన్స్ పదో కాన్ఫరెన్స్ లో కూడా పాలుపంచుకోనున్నారు. ఈ సమావేశం లో ప్రపంచం నలుమూలల నుండి 118 ఇండియన్ మిశన్స్ యొక్క అధిపతులు (వీరిలో రాయబారులు మరియు హై కమిశనర్ లు ఉంటారు) పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో మొత్తం 23 సదస్సు లు జరుగుతాయి. సమకాలీన భౌగోళిక- రాజకీయ, భౌగోళిక-ఆర్థిక స్థితిగతులు, కనెక్టివిటి, భారతదేశం విదేశాంగ విధాన ప్రాధమ్యాలు మొదలైన అంశాల పై కూలంకషమైన ఆంతరంగిక చర్చల ను చేపట్టడం కోసం ఈ సమావేశం ఒక అవకాశాన్ని అందించనుంది. మిశన్ ల ప్రధానాధికారులు ప్రస్తుతం తమ తమ రాష్ట్రాల లో భారతదేశం యొక్క ఆకాంక్ష యుక్త జిల్లాలు, ఒక జిల్లా ఒక ఉత్పాదన, అమృత్ సరోవర్ మిషన్ తదితర ప్రధానమైనటువంటి కార్యక్రమాల పట్ల మంచి అవగాహన ను సాధించడం కోసం సందర్శన లో నిమగ్నమై ఉన్నారు.
వ్యారా లో ప్రధాన మంత్రి
1970 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వ్యాయారా లోను, తాపీ లోను ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. సాపుతారా నుండి ఏక్ తా విగ్రహం వరకు రహదారి ని మెరుగుపరచడం తో పాటు కొన్ని లంకె రహదారుల ను నిర్మించడానికి సంబంధించిన పనుల కు ఆయన శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన జరిగే ఇతర ప్రాజెక్టుల లో తాపీ మరియు నర్మద జిల్లాల లోని 300 లకోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన నీటి సరఫరా పథకాలు కూడా ఉన్నాయి.
***
(Release ID: 1868832)
Visitor Counter : 234
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam