యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

స్వచ్ఛ భారత్ 2022 కింద మెగా క్లీన్లీనెస్ డ్రైవ్‌లను అక్టోబర్ 19న చాందినీ చౌక్ నుండి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్


స్వచ్ఛ భారత్ 2022 కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 60 లక్షల కి.గ్రా. వ్యర్థాలను సేకరించారు

Posted On: 18 OCT 2022 10:54AM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ స్వచ్ఛ భారత్ 2022 కింద 19 అక్టోబర్ 2022న ఢిల్లీలోని చందానీ చౌక్ నుండి మెగా క్లీన్లీనెస్ డ్రైవ్‌లను ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇలాంటి క్లీన్లీనెస్ డ్రైవ్‌లు 19 అక్టోబర్ 2022న చేపట్టబడతాయి.  స్వచ్ఛ భారత్ 2022 ప్రయత్నాలను డిపార్ట్‌మెంట్ ద్వారా ఏకీకృతం చేయడం దీని లక్ష్యం. యువజన వ్యవహారాలు మరియు దాని అనుబంధ సంస్థలైన ఎన్‌వైకెఎస్ మరియు ఎన్ఎస్‌ఎస్‌లు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తున్నాయి.

మంచి ప్రారంభం గొప్ప మార్పుకు అలాగే పెద్ద పరివర్తనకు దారితీస్తుంది.  ఆజాదీ కా అమృత్  మహోత్సవ స్మారకార్థం యువజన వ్యవహారాల శాఖ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అందుకు నిదర్శనం.

17 రోజుల క్రితం ఒక నెల వ్యవధిలో కోటి కిలోల వ్యర్ధాల సేకరణ లక్ష్యంతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా దేశంలోని అన్ని జిల్లాల నుండి యువత మరియు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ఇప్పటి వరకు 60 లక్షల కి.గ్రా. వ్యర్థాలు సేకరించబడ్డాయి.

ఇది ఒక విధమైన ట్రెండ్ సెట్టర్. ప్రజలు ముఖ్యంగా యువత వారి నేపథ్యం మరియు అనుబంధాలతో సంబంధం లేకుండా కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా స్వచ్ఛంద ప్రాతిపదికన కార్యక్రమంలో చేరడానికి ఇతరులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

స్వచ్ఛతా అభియాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ 2014లో ప్రారంభించారు. అప్పటి నుండి ఈ విషయంలో విశేషమైన పురోగతిని గమనించవచ్చు. ప్రధానమంత్రి నేతృత్వంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమం కొత్త సంకల్పం, నిబద్దతకు కొనసాగింపు.

యూత్ సెంట్రిక్ మోడల్‌తో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం విజువలైజేషన్, ప్రజలను సమీకరించడం మరియు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువతకు ప్రధాన పాత్రను కల్పించింది. అభివృద్ధి దిశగా యువత కదలిక దేశానికి శుభసూచకం.

కార్యక్రమ  ప్రధాన లక్ష్యం గ్రామం అయినప్పటికీ మత సంస్థలు, ఉపాధ్యాయులు, కార్పొరేట్ సంస్థలు, మహిళా సంఘాలు మరియు ఇతర జనాభాలోని నిర్దిష్ట విభాగాలు కూడా తమ సంఘీభావాన్ని తెలియజేయడానికి మరియు దానిని నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చడానికి కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

చారిత్రక/ఐకానిక్ స్థానాలు మరియు పర్యాటక ప్రదేశాలు, బస్టాండ్/రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారి మరియు విద్యాసంస్థలు వంటి హాట్‌స్పాట్‌లలో కూడా ఇలాంటి డ్రైవ్‌లు చేపట్టబడుతున్నాయి.

ఈ కార్యక్రమ స్కేల్ మరియు ఔట్రీచ్ పరంగా రెండింటిలోనూ ప్రత్యేకమైనది మరియు యువ భగీదారి నుండి జన్ ఆందోళన్‌కు నమూనాగా దృశ్యమానం చేయబడింది. దీని ద్వారా కార్యక్రమ విజయం మరియు స్థిరత్వానికి ప్రతి పౌరుడి పాత్ర మరియు సహకారంతో రూపొందించబడింది.

స్వచ్ఛ భారత్ అనేది ఒక కార్యక్రమం మాత్రమే కాదు ఇది సామాన్యుల ఆందోళనలను మరియు సమస్యను పరిష్కరించడానికి వారి సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ కార్యక్రమ ముఖ్య అంశం ఏంటంటే అందరి వాటాదారుల మధ్య సమన్వయం మరియు సహకారం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిర్మూలించడం మరియు పరిశుభ్రతను నిర్ధారించడం అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి వివిధ విభాగాలు/ఏజన్సీలు సిబిఓలు మరియు పౌర సమాజ సంస్థలు కలిసి వస్తున్నాయి.

అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఎన్‌వైకెఎస్ మరియు ఎన్‌ఎస్‌ఎస్‌కు చెందిన లక్షలాది మంది యువ వాలంటీర్ల మద్దతు మరియు సహకారం లేనిదే ఈ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమ ప్రయాణం సాధ్యపడేది కాదు. ఈ కార్యక్రమంలో లక్షలమంది కనిపించని యోధులు ఉన్నారు. ఈ డ్రైవ్‌లో వారే నిజమైన హీరోలు.


 

*******



(Release ID: 1868749) Visitor Counter : 121