ప్రధాన మంత్రి కార్యాలయం

న్యూఢిల్లీలోని భార‌తీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌నా సంస్థ‌లో పి.ఎం.కిసాన్‌స‌మ్మేళ‌న్ 2022ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ

600 ప్ర‌ధాన‌మంత్రి కిసాన్‌స‌మృద్ధి కేంద్రాల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

"ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న్ ఉర్వార‌క్ ప‌రియోజ‌న కింద ఒక దేశం ఒక ఎరువు కార్య‌క్ర‌మం ప్రారంభం
భార‌త్‌యూరియా బ్యాగ్‌ల ఆవిష్కర‌ణ‌"

"16,000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల పిఎం-కిసాన్ నిధుల విడుద‌ల‌"

"దేశ‌వ్యాప్తంగా 3.5 ల‌క్ష‌ల రిటైల్ ఎరువుల షాపుల‌ను ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మృద్ధి కేంద్రాలుగా ద‌శ‌ల‌వారీగా మార్పు,
రైతుల‌కు సంబంధించిన వివిధ అవ‌స‌రాలు తీర్చే కేంద్రాలుగా వీటిని తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు"

"సాంకేతికత ఆధారిత అధునాత‌న సాగుప‌ద్ధ‌తులు అవ‌లంబించ‌డం ప్ర‌స్తుతావ‌స‌రం"

"గ‌త 7-8 సంవ‌త్స‌రాల‌లో సుమారు 70 ల‌క్ష‌ల‌కు పైగా హెక్టార్ల‌భూమిని సూక్ష్మ సేద్యం కిందికి తీసుకురావ‌డం జ‌రిగింది.
1.75 కోట్ల మందికిపైగారైతులు, 2.5 ల‌క్ష‌ల మందికి పైగా ట్రేడ‌ర్ల‌ను ఈ-నామ్ తో అనుసంధానం చేయ‌డం జ‌రిగింది. ఈ -నామ్ లావాదేవీలు సుమారు 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు దాటాయి."

"వ్య‌వ‌సాయ‌రంగంలో మ‌రిన్ని స్టార్ట‌ప్ లు రానున్నాయి. ఇవి వ్య‌వ‌సాయ‌రంగానికి, గ్రామీణ ఆర్ధిక‌వ్

Posted On: 17 OCT 2022 2:09PM by PIB Hyderabad

 ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ  న్యూఢిల్లీలోని భార‌త్య వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌నా సంస్థ‌లో ఈ రోజు ఏర్పాటు చేసిన పిఎం కిసాన్ స‌మ్మేళ‌న్ 2022ను ప్రారంభించారు. అదే సంద‌ర్భంలో ప్ర‌ధాన‌మంత్రి కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల మంత్రిత్వ‌శాఖ కింద ఏర్పాటు చేసిన‌   600 ప్రధాన‌మంత్రి కిసాన్ స‌మృద్ధి కేంద్రాల‌ను (పిఎంకెఎస్‌కె) ప్రారంభించారు. దీనికితోడు ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఊర్వార‌క్ ప‌రియోజ‌న కింద ఒక దేశం ఒక ఎరువును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధికింద (పిఎం-కిసాన్‌) ప్ర‌త్య‌క్ష న‌గ‌దుబ‌దిలీ ద్వారా ప్ర‌ధాన‌మంత్రి 12 వ విడ‌త నిధుల‌ను ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ ద్వారా విడుద‌ల చేశారు.
ప్ర‌ధాన‌మంత్రి అగ్రి స్టార్ట‌ప్ స‌మ్మేళ‌నాన్ని, ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించారు. ఈకార్య‌క్ర‌మం సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి ఇండియ‌న్ ఎడ్జ్ పేరుతో ఎరువుల రంగానికి సంబంధించిన ఈ మ్యాగ‌జైన్‌ను ప్రారంభించారు. స్టార్ట‌ప్ ఎగ్జిబిష‌న్ థీమ్ పెవిలియ‌న్ ను ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శించి , అక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన ఉత్పత్తుల‌ను ప‌రిశీలించారు.
అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడుతూ, జైజ‌వాన్‌, జై కిసాన్‌, జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్ అనేవి అన్నీ ఒకే చోట ఉన్నాయ‌ని ప్ర‌శంసించారు. ఈ మంత్రాన్ని ప్ర‌త్య‌క్షంగా మ‌నం ఇక్క‌డ చూస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. కిసాన్‌స‌మ్మేళ‌నం అనేది రైతుల జీవితాల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు, వారి సామ‌ర్ధ్యాన్ని పెంపొందించేందుకు, అధునాత‌న వ్య‌వ‌సాయ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

600కుపైగా ప్ర‌ధాన‌మంత్ర  స‌మృద్ధి కేంద్రాల‌ను ఈరోజు ప్రారంభించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఈ కేంద్రాలు కేవ‌లం ఎరువుల అమ్మ‌కపు కేంద్రాలుగా మాత్ర‌మే కాకుండా దేశంలోని రైతుల‌తో బ‌ల‌మైన బంధాన్ని క‌లిగిఉంటాయ‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి(పిఎం-కిసాన్‌) కింద తాజా వాయిదా గురించిప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఈ మొత్తం రైతుల ఖాతాల‌లోకి నేరుగా చేరుతుంద‌ని, ఇది ఎలాంటి మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా వారికిచేరుతుంద‌ని అన్నారు. మ‌రో విడ‌త రూ 16,000 కోట్ల రూపాయ‌ల‌ను కోట్లాది మంది రైతుల కుటుంబాలకు పి.ఎం కిసాన్‌స‌మ్మాన్ నిధి కింద విడుద‌ల చేసిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఈ వాయిదా మొత్తం రైతుల‌కు దీపావ‌ళికి కాస్త ముందుగా అందుతున్నందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌న ఉర్వార‌క్ ప‌రియోజ‌న‌- ఒక దేశం,ఒక ఎరువు కార్య‌క్ర‌మాన్ని కూడా ప్రారంభించిన‌ట్టు తెలిపారు. ఈ ప‌థ‌కం కింద అందుబాటు ధ‌ర‌లో నాణ్య‌మైన ఎరువులు భార‌త్ బ్రాండ్ పేరుతో రైతుల‌కు అందుతాయ‌ని ఆయ‌న అన్నారు.

2014 కు ముందునాటి ప‌రిస్థితుల‌ను గుర్తుచేస్తూ ప్ర‌ధాన‌మంత్రి, వ్య‌వ‌సాయ దారులు ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొనేవార‌ని, యూరియా బ్లాక్‌మార్కెటింగ్ ఉండేద‌ని అన్నారు. వారికి న్యాయ‌బ‌ద్దంగా ద‌క్క‌వ‌ల‌సిన‌ది ద‌క్కేది కాద‌ని అన్నారు. అయితే ఆ త‌ర్వాత యూరియాకు ప్ర‌భుత్వం నూరుశాతం వేప పూత వేసి  బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్ట‌గ‌లిగింద‌ని అన్నారు. "ఎంతో కాలంగా మూత‌ప‌డి ఉన్న దేశంలోని ఆరు అతిపెద్ద యూరియా ఫ్యాక్ట‌రీల‌ను తిరిగి తెరిపించేందుకు మేం ఎంతో కృషి చేశాం" అని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

క‌ష్టించిప‌నిచేసే రైతుల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లిగిస్తున్న ప‌లు ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి,  ద్ర‌వ‌రూప నానో యూరియా ఉత్ప‌త్తిలో ఇండియా స్వావ‌లంబ‌న దిశ‌గా శ‌ర‌వేగంతో ముందుకు పోతున్న‌ద‌ని అన్నారు. నానో యూరియా అనేది త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ఉత్ప‌త్తిసాధ‌న‌కు అనువైన‌ద‌ని అన్నారు. దీని ప్ర‌యోజ‌నాల గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఒక బ‌స్తా యూరియాకుగా ఒక బాటిల్ నానోయూరియా స‌మాన‌మ‌న్నారు. దీనివ‌ల్ల యూరియా బ‌స్తాల త‌ర‌లింపున‌కు అవుతున్న ఖ‌ర్చు పెద్ద ఎత్తున ఆదా అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు.యూరియా అందుబాటును కూడా పెంచుతుంద‌ని ఆయ‌న అన్నారు.

సాంకేతిక‌త ఆధారిత అధునాత‌న సాగువిధానాల‌ను అనుస‌రించాల్సిన అవ‌స‌రాన్ని నొక్కిచెబుతూ ప్ర‌ధాన‌మంత్రి, వ్య‌వ‌సాయ‌రంగంలో నూత‌న వ్య‌వ‌స్థ‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, మ‌రింత శాస్త్రీయ , సాంకేతిక ప‌ద్ధ‌తుల‌ను విశాల దృక్ఫ‌థంతో అనుస‌రించాల‌న్నారు. ఈ ర‌క‌మైన ఆలోచ‌న‌తో, మ‌నం వ్య‌వ‌సాయ‌రంగంలో శాస్త్రీయ ప‌ద్ధ‌తుల‌ను పెంపొందిస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్న‌ట్టుకూడా చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 22 కోట్ల భూసార ప‌రీక్షా కార్డుల‌ను పంపిణీ చేసిన‌ట్టు చెప్పారు. నాణ్య‌మైన విత్త‌నాల‌ను రైతుల‌కు అందించేందుకు శాస్త్రీయ కృషి జ‌రుగుతున్న‌ట్టు కూడా ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. గ‌త 7-8 సంవ‌త్స‌రాల‌లో 1700 వ‌ర‌కు కొత్త విత్త‌న‌ర‌కాలను, మారిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రైతుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చినట్టు చెప్పారు.


చిరుధాన్యాల విష‌యంలో అంత‌ర్జాతీయంగా ఆస‌క్తి పెరుగుతుండ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఇవాళ దేశంలో సంప్ర‌దాయ చిరుధాన్యాలు, తృణ ధాన్యాలు, ప‌ప్పు ధాన్యాల‌కు సంబంధించి విత్త‌న హ‌బ్‌లు రూపుదిద్దుకుంటున్నాయ‌న్నారు. ఇండియాకుచెందిన ప‌ప్పుధాన్యాల ర‌కాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రోత్స‌హించే చ‌ర్య‌ల‌పై దృష్టిపెట్టిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. వ‌చ్చే ఏడాది అంత‌ర్జాతీయ ప‌ప్పుధాన్యాల సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టించిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.
సాగుకు విచ‌క్ష‌ణా ర‌హితంగానీటి వాడ‌డం గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ప్ర‌తి చుక్క నీటికి మ‌రింత ఉత్ప‌త్తి దిశ‌గా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు చెప్పారు. మైక్రో ఇరిగేష‌న్‌, డ్రిప్ ఇరిగేష‌న్‌ద్వారా దీనిని సాధిస్తున్న‌ట్టు తెలిపారు. 70 ల‌క్ష‌ల‌కు పైగా హెక్టార్ల భూమిని గ‌త 7-8 సంవ‌త్సరాల వ్య‌వ‌ధిలో మైక్రో ఇరిగేష‌న్ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

సంప్ర‌దాయ సాగును ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఇది భ‌విష్య‌త్‌లో త‌లెత్తే ప‌లు స‌వాళ్ల‌కు స‌మాధానం కాగ‌ల‌ద‌ని అన్నారు. ఈ విష‌యమై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవ‌గాహ‌న పెరుగుతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌లో సంప్రదాయ సాగు విష‌యంలో రైతులు పెద్ద ఎత్తున కృషిచేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. గుజ‌రాత్ లో జిల్లా, గ్రామ పంచాయ‌తి స్థాయిలో సైతం ఇందుకు పెద్ద ఎత్తున కృషి జ‌రుగుతున్న‌ట్టు తెలిపారు

 
పిఎం -కిసాన్ కార్య‌క్ర‌మం కింద జ‌రుగుతున్న మార్పును ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం వాడ‌డం ద్వారా చిన్న రైతులు ఏ విధంగా ప్ర‌యోజ‌నం పొందుతున్నార‌న్న దానికి పిఎం కిసాన్ స‌మ్మాన్‌నిధి ఒక ఉదాహ‌ర‌ణ అని ఆయ‌న అన్నారు. ఈ ప‌థ‌కం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి సుమారు 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు రైతుల బ్యాంకు ఖాతాల‌లోకి ప్ర‌త్య‌క్ష న‌గ‌దుబ‌దిలీ ద్వారా నేరుగా బ‌దిలీ అయింద‌న్నారు. దేశ రైతుల‌లో 85 శాతంగా ఉన్న చిన్న‌రైతుల‌కు ఇది పెద్ద అండ‌గా ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

 

మన రైతుల కు ప్రస్తుతం ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ అందించేటటువంటి వివిధ చర్యల ను తీసుకొంటున్నట్లు ప్రధాన మంత్రి తన ప్రసంగంలో వివరించారు. ఉత్తమమైనటువంటి మరియు ఆధునికమైనటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా వ్యవసాయ క్షేత్రాని కి, బజారు కు మధ్య దూరాన్ని కూడా మేం తగ్గిస్తున్నాం అని ఆయన అన్నారు. దీని తాలూకు అతి పెద్ద లబ్ధిదారు ఎవరూ అంటే అది చిన్న రైతే.. ఎవరైతే పండ్లు, కాయగూరలు, పాలు మరియు చేపల వంటి త్వరగా పాడయిపోయేటటువంటి ఉత్పాదనల తో సంబంధాన్ని కలిగి ఉన్నారో. ఈ అధునాతన సౌకర్యాలు వర్తమానం లో రైతుల పొలాల ను దేశ విదేశాల లోని ప్రధానమైన బజారుల తో కలుపుతున్నాయి. వ్యావసాయిక ఎగుమతుల పరం గా చూస్తే భారతదేశం అగ్రగామి పది దేశాల సరసన నిలచింది అని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి సంబంధి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వ్యావసాయిక ఎగుమతులు 18 శాతం మేరకు వృద్ధి చెందాయి. ప్రధాన మంత్రి ప్రాంతం వారీ ప్రత్యేక ఎగుమతుల ను గురించి ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమాల ను ‘ఒక జిల్లా, ఒక ఉత్పాదన’ పథకం లో భాగం గా సమర్థించడం జరుగుతోంది. అంతేకాకుండా ఎగుమతుల కేంద్రాల ను జిల్లా స్థాయి లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. అదేవిధం గా శుద్ధి చేసిన ఆహారం రైతుల కు మరింత గా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నది. పెద్ద ఫూడ్ పార్కు లు 2 నుండి 23 కు పెరిగాయి. అదే కాలంలో ఎఫ్ పిఒ మరియె ఎస్ హెచ్ జి .లను ఈ పార్కుల తో జోడించడం జరుగుతున్నది. ఇ-ఎన్ఎఎమ్ (e-NAM) రైతుల జీవనాల లో ఒక సకారాత్మకమైనటువంటి ప్రభావాన్ని తీసుకు వచ్చింది. ఇ-ఎన్ఎఎమ్ అనేది రైతులకు వారీ ఉత్పత్తి కి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ దేశంలోని ఏ బజారు లో అయినా అమ్ముకొనేందుకు వీలు కల్పిస్తున్నది. 1.75 కోట్ల మందికి పైగా రైతుల ను మరియు 2.5 లక్షల మంది వ్యాపారుల ను ఇ-ఎన్ఎఎమ్ తో జతపరచడం జరిగింది. ఇ-ఎన్ఎఎమ్ ద్వారా లావాదేవీ లు 2 లక్షల కోట్ల రూపాయల ను మించిపోయాయి అని ఆయన అన్నారు.


దేశం లో వ్యవసాయ రంగం లో స్టార్ట్- అప్స్ సంఖ్య పెరుగుతూ పోవడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ పరిణామం ఈ రంగాని కి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు మేలు చేస్తుంది అని వ్యాఖ్యానించారు. స్టార్ట్- అప్స్ మరియు వినూత్న ఆలోచన లు కలిగిన యువత భారతదేశం లో వ్యవసాయ రంగ భవిష్యత్తు మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు భవిష్యత్తు గా ఉన్నారు. ఖర్చు మొదలుకొని రవాణా వరకు, మన స్టార్ట్- అప్స్ దగ్గర ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.



ఆత్మ నిర్భరత ను గురించి తాను పదేపదే స్పష్టం చేస్తుండడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఖాద్య తైలాలు, ఎరువులు, ఇంకా ముడి చమురు వంటి కీలకమైన ఉత్పాదన లు పెద్ద ఎత్తు న డబ్బు వ్యయాని కి కారణం అవుతున్నాయని, మరి ప్రపంచం లో తలెత్తే స్థితులకు మూలం అవుతున్నాయని, ఆ స్థితుల తో సరఫరాలు కూడా ప్రభావితం అవుతున్నాయన్నారు. డిఎపి తదితర ఎరువులను గురించి ఆయన ఉదాహరణలు గా చెబుతూ, వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని భారతదేశం యూరియాను కిలో ఒక్కింటికి 75 రూపాయలు లేదా 80 రూపాయల ధర చెల్లించి కొనుగోలు చేయవలసి వచ్చిందని, ఏమైనప్పటికీ దానిని రైతుల కు కిలో ఒక్కింటికి 5 రూపాయలు లేదా 6 రూపాయల ధర కు సరఫరా చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం సైతం రైతులకు సుమారు భరించగలిగే స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేందుకు గాను ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ముడి చమురు మరియు గ్యాస్ లకు సంబంధించి విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం ఇథెనాల్ మరియు బయో ఫ్యూయల్ ల విషయం లో తీసుకున్న చర్యల ను గురించి ఆయన ప్రస్తావించారు.


ప్రధాన మంత్రి తను ప్రసంగించే ముగించే సందర్భం లో మిశన్ ఆయిల్ పామ్ ద్వారా లాభాల ను వీలైనంత వరకు విరివి గా పొందవలసింది గా భారతదేశం లోని రైతుల కు విజ్ఞప్తి చేశారు. ఖాద్య తైలాల రంగం లో స్వయం సమృద్ధి ని సాధించే దిశ లో ఈ కార్యక్రమం ఒక ముందడుగు అని ఆయన అన్నారు. నూనె గింజల ఉత్పత్తి ని పెంచడం ద్వారా భారతదేశం ఖాద్య తైలాల వినియోగాన్ని తగ్గించగలుగుతుంది అని కూడా ఆయన చెప్పారు. మన రైతులు ఈ రంగం లో మంచి సామర్థ్యం కలిగిన వారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కాయధాన్యాల ఉత్పత్తి విషయంలో 2015వ సంవత్సరంలో తాము ఇచ్చిన పిలుపు ను ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ కాయధాన్యాల ఉత్పత్తి 70 శాతం వృద్ధి చెందడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ రైతుల కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భం లో మేం వ్యవసాయాన్ని ఆకర్షణీయంగా, సమృద్ధంగా తీర్చిదిద్దుతాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రైతులు అందరికీ, అలాగే స్టార్ట్- అప్స్ కు ఆయన శుభాకంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.


ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింహ్ తోమర్, రసాయనాలు ఎరువుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ సహాయమంత్రులు శోభ కరంద్ లాజే మరియు శ్రీ కైలాశ్ చౌదరిలతో పాటు రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబ తదితరులు ఉన్నారు.

పూర్వరంగం


ఈ కార్యక్రమం లో దేశ వ్యాప్తం గా 13,500 మంది కి పైగా రైతులు మరియు దాదాపు గా 1500 ఏగ్రి స్టార్ట్- అప్స్ కూడా పాలుపంచుకొంటున్నాయి. వివిధ సంస్థల కు చెందిన ఒక కోటి మందికి పైగా రైతులు వర్చ్యువల్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొంటారన్న సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమ్మేళనం లో పరిశోధకులు, విధాన రూపకర్తలు మరియు ఇతర సంబంధిత వర్గాలు కూడా పాల్గొనేందుకు అవకాశం ఉంది.


ప్రధాన మంత్రి రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ కు చెందిన 600 ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రా (పిఎమ్ కెఎస్ కె)లను ప్రారంభించారు. ఈ పథకం లో భాగం గా దేశం లోని రిటైల్ ఫర్టిలైజర్ దుకాణాల ను దశల వారీగా పిఎమ్ కెఎస్ కె లుగా మార్చడం జరుగుతుంది. పిఎమ్ కెఎస్ కె లు రైతుల విభిన్న అవసరాలను తీర్చడంతో పాటుగా ఎరువులు, విత్తనాలు వంటి ఏగ్రి ఇన్ పుట్స్ ను అందిస్తాయి. నేల, విత్తనాలు, ఎరువుల కు సంబంధించి వివిధ పరీక్షల సదుపాయాలను సమకూర్చుతాయి. రైతుల లో చైతన్యాన్ని కలుగజేస్తాయి. ప్రభుత్వానికి చెందిన వివిధ పథకాల తాలూకు సమాచారాన్ని అందించడంతో పాటు బ్లాకు స్థాయి , జిల్లా స్థాయి విక్రయ కేంద్రాలలో రిటైలర్ లకు సామర్థ్య నిర్మాణం లో తోడ్పడుతాయి. 3.3 లక్షల కు పైగా రిటైల్ ఫర్టిలైజర్ దుకాణాల ను ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు గా మార్చాలని ఒక ప్రణాళిక ను సిద్ధం చేశారు.

ప్రధాన మంత్రి ఇదే సందర్భంలో ప్రధాన మంత్రి భారతీయ జన్ ఊర్వరక్ ప్రయోజన - వన్ నేశన్ వన్ ఫర్టిలైజర్ని ప్రారంభించారు. ఈ పథకం లో భాగం గా భారత్ యూరియా బ్యాగ్స్ ను ప్రవేశ పెడుతున్నారు. ఇవి ఎరువుల ను ‘భారత్’ అనే ఒకే బ్రాండ్ పేరు తో విక్రయించడం లో కంపెనీల కు సహాయకారి కానున్నాయి.

రైతుల సంక్షేమం దిశ లో ప్రధాన మంత్రి చాటుకొంటున్న నిబద్ధత కు అద్దం పట్టే చర్యల లో ఒకటా అన్నట్లు గా, ఈ కార్యక్రమం లో ప్రత్యక్ష ప్రయోజన బదలీ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్- కిసాన్) లో 16,000 కోట్ల రూపాయల 12వ కిస్తీ సొమ్ము ను కూడా విడుదల చేశారు. ఈ పథకం లో భాగం గా అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏటా ఒక్కొక్కటీ 2000 రూపాయల వంతు న మూడు సమాన కిస్తీల లో మొత్తం 6000 రూపాయల మేరకు ప్రయోజనాల ను అందించడం జరుగుతుంది. పిఎమ్- కిసాన్ లో భాగం గా ఇంతవరకు 2 లక్షల కోట్ల రూపాయల కు పైగా ప్రయోజనాలు అర్హత కలిగిన రైతు కుటుంబాల కు అందాయి.


ప్రధాన మంత్రి ఏగ్రి స్టార్ట్- అప్ కాన్ క్లేవ్ ఎండ్ ఎగ్జిబిశన్ ను కూడా ప్రారంభించారు. దీనిలో సుమారు 300 స్టార్ట్- అప్ లు ప్రిసిజన్ ఫార్మింగ్, పోస్ట్ - హార్వెస్ట్ ఎండ్ వేల్యూ ఎడ్ సాల్యూశన్స్, సంబంధం గల వ్యవసాయం, చెత్త నుండి సంపద, చిన్న రైతుల కు ఉద్దేశించిన యంత్రీకరణ, సప్లయ్ చైన్ మేనిజ్ మెంట్, ఇంకా ఏగ్రి- లాజిస్టిక్ తో సంబంధంచిన తమ నూతన ఆవిష్కరణల ను ప్రదర్శిస్తాయి. ఈ వేదిక స్టార్ట్- అప్ స్ కు రైతుల తో, ఎఫ్ పిఒ లతో, వ్యవసాయ రంగ నిపుణులతో, కార్పొరెట్స్ మొదలైన వర్గాల తో మాట్లాడేందుకు దోహదం చేస్తుంది. స్టార్ట్- అప్స్ కూడా వాటి అనుభవాన్ని శేర్ చేయడం తో పాటు సాంకేతిక సదస్సుల లో ఇతర స్టేక్ హోల్డర్స్ తోనూ భేటీ అవుతాయి.

ఇదే కార్యక్రమం లో భాగం గా ఎరువులకు సంబంధించిన ఒక ఎలక్ట్రానిక్ పత్రిక ఇండియన్ ఎడ్జ్ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. ఇది ఎరువుల రంగం లో దేశ విదేశాల లో వర్తమాన స్థితిగతుల ను తెలియజేయడంతో పాటు ధరల సరళులకు సంబంధించిన విశ్లేషణ, లభ్యత మరియు వినియోగం, రైతుల సాఫల్య గాథలు, తదితర అంశాల తాలూకు సమాచారాన్ని తెలియజేస్తుంది.

*****

DS/TS

 



(Release ID: 1868559) Visitor Counter : 263