ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ లో పిఎమ్ జెఎవై-ఎమ్ఎ యోజన ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 16 OCT 2022 12:41PM by PIB Hyderabad

గుజరాత్ లో పిఎమ్ జెఎవై-ఎమ్ఎ యోజన ఆయుష్మాన్ కార్డు ల పంపిణీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 17వ తేదీ న సాయంత్రం 4 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.

గుజరాత్ లో 2012వ సంవత్సరం లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న ప్రధాన మంత్రి పేద ప్రజల ను రోగాల కు , మరియు వైద్య చికిత్స కు అయ్యే అత్యధిక ఖర్చుల బారి నుండి కాపాడడం కోసం ‘‘ముఖ్యమంత్రి అమృతమ్ (ఎమ్ఎ)’’ పథకాన్ని మొదలుపెట్టారు. 2014వ సంవత్సరం లో, ‘‘ఎమ్ఎ’’ యోజన ను 4 లక్షల రూపాయల వార్షిక ఆదాయ పరిమితి కలిగిన కుటుంబాల కు కూడా ఆ యొక్క పథకం ప్రయోజనాలు దక్కేటట్టు గా పొడిగించడమైంది. తరువాత, ఈ పథకాన్ని మరిన్ని ఇతర సమూహాల కు కూడా విస్తరింపచేయడమైంది. ఈ పథకాని కి ‘‘ముఖ్యమంత్రి అమృతం వాత్సల్య (ఎమ్ఎవి) యోజన’’ అనే ఒక కొత్త పేరు ను పెట్టడం జరిగింది.

 పథకం యొక్క సాఫల్యం తాలూకు అనుభవాన్నుంచి సారాన్ని గ్రహించి, ‘ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి-పిఎమ్ జెఎవై)’ ని భారతదేశం ప్రధాన మంత్రి 2018వ సంవత్సరం లో ప్రవేశపెట్టారు. ఇది ప్రాథమిక, రెండో మరియు మూడో సంరక్షణ కోసం, ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు కవరేజి ని ప్రదానం చేసే ఆరోగ్య బీమా పథకం. క్రమం లో ఈ పథకం ఒక కుటుంబం లో ఎంత మంది సభ్యులు ఉన్నారు, వారి వయస్సు ఎంత అనేవి పట్టించుకోనటువంటి ఈ పథకం ప్రపంచం లోకెల్లా అతి పెద్దదైనటువంటి ఆరోగ్య బీమా పథకం. ఎబి- పిఎమ్ జెఎవై ని ప్రారంభించడం తో, గుజరాత్ 2019వ సంవత్సరం లో ఎమ్ఎ / ఎమ్ఎవి యోజన లను ఎబి-పిఎమ్-జెఎవై పథకం లో కలిపివేసింది. ఇంకా దీనికి పిఎమ్ జెఎవై- ఎమ్ఎ యోజన అనే ఒక నూతనమైన పేరు ను పెట్టింది. మరి ఎమ్ఎ / ఎమ్ఎవి లబ్ధిదారులు, ఇంకా ఎబి- పిఎమ్ జెఎవై ల లబ్ధిదారులు ఏకీ కృత‌మైనటువంటి పిఎమ్ జెఎవై-ఎమ్ఎ కార్డుల కు అర్హులు గా అయిపోయారు.

కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి ఈ కార్డుల పంపిణీ ని ఆరంభించనున్నారు. లబ్ధిదారుల కు ఇ-కెవైసి ని పూర్తి చేసిన తరువాత, నేశనల్ హెల్థ్ ఆథారిటి యొక్క పేనల్ లో ఉన్న ఏజన్సీ లు గుజరాత్ అంతటా లాభితులు అందరి కి 50 లక్షల రంగు రంగుల ఆయుష్మాన్ కార్డులను వారికి వారి ఇళ్ల వద్ద పంచి ఇవ్వడం జరుగుతుంది.

***


(Release ID: 1868354) Visitor Counter : 206