ప్రధాన మంత్రి కార్యాలయం

ఒకటోక్వాడ్రిలాటరల్ లీడర్స్ వర్చువల్ సమిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభిక వ్యాఖ్య లు

Posted On: 12 MAR 2021 1:28PM by PIB Hyderabad

యోర్ ఎక్స్ లన్సిజ్,

అధ్యక్షుడు శ్రీ బైడెన్,

ప్రధాని శ్రీ మారిసన్ మరియు ప్రధాని శ్రీ సుగా,

మిత్రుల మధ్యకు రావడం బాగుంది.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినందుకుగాను అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఎక్స్ లన్సిజ్,
మనం మన ప్రజాస్వామిక విలువ లు మరియు ఒక స్వాతంత్ర్యయుతమైనటువంటి, అరమరికల కు తావు ఉండని అటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొనిపోయేటటువంటి ఇండో- పసిఫిక్ ఆవిష్కారం కోసం మన యొక్క వచన బద్ధత ల ద్వారా ఏకం అయ్యాం.
ఈ రోజు న మన కార్యక్రమ పట్టిక - దేనిలో అయితే టీకామందు లు, జలవాయు పరివర్తన లతో పాటు కొత్త గా ఉనికి లోకి వస్తున్నటువంటి సాంకేతికత లు భాగంగా అవుతున్నాయో - అది క్వాడ్ ను ప్రపంచ హితం కోసం కృషి చేసే ఒక శక్తి గా తీర్చిదిద్దుతుంది.

నేను ఈ సకారాత్మకమైనటువంటి దృష్టి కోణాన్ని భారతదేశం యొక్క ప్రాచీన దర్శనం అయినటువంటి ‘వసుధైవ కుటుంబకమ్’ కు ఒక విస్తరణ గా చూస్తున్నాను. ‘వసుధైవ కుటుంబకమ్’ ప్రపంచాన్ని ఒక కుటుంబం గా భావిస్తుంది.
మనం మన ఉమ్మడి విలువల ను ముందుకు తీసుకుపోవడం కోసమూ, అలాగే ఒక సురక్షితమయినటువంటి, స్థిరమయినటువంటి మరియు సమృద్ధం అయినటువంటి ఇండో- పసిఫిక్ ను ప్రోత్సహించడం కోసమూ ఇదివరకటి కంటే మరింత అధికం గా కలసి పనిచేద్దాం.
క్వాడ్ యొక్క యుగం మొదలైంది అని ఈ రోజు న జరుగుతున్న ఈ శిఖర సమ్మేళనం తో అనుభవం లోకి వస్తున్నది.
ఇక ఇది ఈ ప్రాంతం లో స్థిరత్వాని కి ఒక ముఖ్య స్తంభం గా ఉంటుంది.
మీకు ఇవే నా ధన్యవాదాలు.

***(Release ID: 1867810) Visitor Counter : 126