ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్లోని మొధేరాలో గల సూర్య దేవాలయాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి

Posted On: 09 OCT 2022 7:45PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని మొఢేరా లో ఉన్న సూర్య దేవాలయాన్ని ఈ రోజు న సందర్శించారు. ప్రధాన మంత్రి ఆలయానికి చేరుకొన్న వేళ ఆయన ను సత్కరించడం జరిగింది. సూర్య దేవాలయం లో హెరిటేజ్ లైటింగు ను శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. అది భారతదేశం లో అచ్చం గా సౌర శక్తి ద్వారా నిర్వహణ లో ఉన్నటువంటి మొట్టమొదటి వారసత్వ స్థలం గా ప్రసిద్ధి ని సంపాదించుకొంది. ఆయన మొఢేరా సూర్య దేవాలయం లో త్రీడీ ప్రొజెక్శన్ మేపింగు ను కూడా ప్రారంభించారు. దేవాలయం యొక్క చరిత్ర ను కళ్లకు కడుతూ సాగిన ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి తిలకించారు.

ప్రధాన మంత్రి ఆలయ సందర్శన సందర్భం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంట్ సభ్యుడు శ్రీ సి.ఆర్. పాటిల్, గుజరాత్ ప్రభుత్వం లో మంత్రులు శ్రీ పూర్ణేశ్ బాయి మోదీ మరియు శ్రీ అర వింద్ బాయి రైయానీ లు కూడా ఆయన ను అనుసరించారు.

అంతక్రితం ఈ రోజు న, ప్రధాన మంత్రి గుజరాత్ లోని మెహసాణా పరిధి లో గల మొఢేరా లో 39 వందల కోట్లు రూపాయల పైచిలుకు విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేసి వాటిని దేశ ప్రజల కు సమర్పించారు. భారతదేశం లో సౌర శక్తి తో నిరంతరాయ నిర్వహణ సదుపాయాన్ని కలిగివున్నటువంటి ఒకటో గ్రామం గా మొఢేరా నిలచిందని ప్రధాన మంత్రి ప్రకటించారు. శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని మొఢేరా లో గల మొధేశ్వరి మాత దేవాలయాన్ని కూడా సందర్శించి, అక్కడ దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో పాలుపంచుకొన్నారు.



(Release ID: 1866508) Visitor Counter : 142