ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబైలోని బాంద్రా-వర్లీ సముద్ర సంధాన మార్గంలో ప్రమాదంవల్ల ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం
Posted On:
05 OCT 2022 9:09AM by PIB Hyderabad
ముంబైలోని బాంద్రా-వర్లీ సముద్ర సంధాన మార్గంలో ప్రమాదం వల్ల ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ముంబైలోని బాంద్రా-వర్లీ సముద్ర సంధాన మార్గంలో సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడం నన్నెంతగానో బాధించింది. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు సత్వరం కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను.” అని ఆయన పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1865434)
Visitor Counter : 144
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam