ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాన్ పుర్ లో జరిగిన ట్రాక్టర్-ట్రాలీ దుర్ఘటన లో ప్రాణనష్టంసంభవించినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


మృతుల కు మరియు గాయపడిన వ్యక్తుల కు పరిహారాన్ని ప్రధాన మంత్రి ప్రకటించారు

Posted On: 01 OCT 2022 10:30PM by PIB Hyderabad

కాన్ పుర్ లో ఈ రోజు న జరిగిన ట్రాక్టర్-ట్రాలీ దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రదాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఈ దుర్ఘటన లో చనిపోయిన వారిలో ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని వారి యొక్క దగ్గరి సంబంధికుల కు చెల్లించడం జరుగుతుంది అని ఆయన ప్రకటించారు. గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘కాన్ పుర్ లో జరిగిన ట్రాక్టర్-ట్రాలీ దుర్ఘటన తో దు:ఖిస్తున్నాను. ఈ దుర్ఘటన లో ప్రియతముల ను కోల్పోయిన వారందరి కి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ప్రమాదం లో గాయపడ్డ వ్యక్తులు త్వరలో పునఃస్వస్థులు కావాలని నేను ప్రార్థిస్తున్నాను. బాధితుల కు స్థానిక పరిపాలన యంత్రాంగం చేతనైన అన్నివిధాలు గాను సహాయాన్ని అందిస్తోంది: ప్రధాన మంత్రి @narendramodi’’

‘‘మృతుల లో ప్రతి ఒక్కరి దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది. గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.

 

 


(Release ID: 1864721) Visitor Counter : 111