ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి కాలం లో స్కందమాత దేవి ఆశీస్సుల కోసం ప్రార్థించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2022 9:08AM by PIB Hyderabad

నవరాత్రి ఉత్సవాల లో అయిదో రోజు న భక్త జనుల కు స్కందమాత దేవి శుభాశీస్సులు లభించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు. దేవి కి సంబంధించిన ప్రార్థన పఠనం (స్తుతి) తాలూకు ఒక సందేశాన్ని కూడా ఆయన శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నమామి స్కందమాతరం స్కంధధారిణీమ్

సమగ్రతత్త్వసాగరామ్ పారపారగహరామ్

నవరాత్రి యొక్క పంచమి తిథి నాడు దేవి స్కందమాత ను పూజించాలన్న విధానం ఉంది. స్కందమాత దేవి అందరి జీవనం లో కొత్త స్ఫూర్తి ప్రవహించేటట్లు చేయు గాక. దేశ ప్రజలందరి పక్షాన దేవి కి ఇదే వందనం.’’ అని పేర్కొన్నారు.

****


(రిలీజ్ ఐడి: 1863683) సందర్శకుల సూచీ సంఖ్య : : 188