యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
'జాతీయ క్రీడా అవార్డులు -2022' దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీని పొడిగింపు
- దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 27 సెప్టెంబర్, 2022 నుండి అక్టోబర్ 1, 2022కు పొడిగించిన యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
28 SEP 2022 11:03AM by PIB Hyderabad
యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ వివిధ జాతీయ క్రీడా అవార్డుల నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానించింది. 2022 సంవత్సరానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ (ఆర్‌కేపీపీ), మౌలానా అబుల్ కలాం ఆజాద్ (ఎంఏకేఏ) ట్రోఫీ -2022 తదితర అవార్డులకు గత ఆగస్టు 27 న మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.yas.nic.inలో ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది.ఈ అవార్డు కోసం అర్హులైన క్రీడాకారులు/ కోచ్‌లు/ ఎంటిటీలు/ విశ్వవిద్యాలయాల వారి నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 27 సెప్టెంబర్, 2022 నుండి అక్టోబర్ 1, 2022 (శనివారం) వరకు పొడిగించబడింది. సంబంధితులు dbtyas-sports.gov.inలో ఆన్‌లైన్‌లో స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ / స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా / గుర్తింపు పొందిన నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు / స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డులు / రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మొదలైన వారికి కూడా తదనుగుణంగా విషయం తెలియజేయబడింది.
అక్టోబర్ 1, 2022 (శనివారం) తర్వాత అందే నామినేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.
***
(रिलीज़ आईडी: 1863162)
आगंतुक पटल : 200