ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ లో జరిగిన ప్ర‌మాదం లో ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల విచారం వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


బాధితులకు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని కూడా ఆయన ప్రకటించారు

Posted On: 28 SEP 2022 2:41PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ జిల్లా లో జరిగిన ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం లో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

బాధితుల కు పరిహారాన్ని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటన లో ప్రాణాలను కోల్పోయినవారి దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయలు, ప్రమాదం లో గాయపడ్డవారికి 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి అందజేయడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో –

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరీ లో జరిగిన ప్రమాద ఘటనపై దుఃఖించాను. మృతుల కుటుంబాల కు నా సానుభూతి ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారంతా త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ దుర్ఘటన లో ప్రాణాలను కోల్పోయినవారి దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రమాదం లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొంది.

*****

DS/ST

 



(Release ID: 1862926) Visitor Counter : 121