రైల్వే మంత్రిత్వ శాఖ
డిజిటల్ ఇండియా ప్రేరణ ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న భారత రైల్వే
రైల్వే ప్రయాణికులకు లావాదేవీలను సులభతరం చేసేందుకు డిజిటల్ వ్యవస్థ
ఇ-క్యాటరింగ్ సేవ ప్రస్తుతం 1755 సర్వీస్ ప్రొవైడర్లు, 14 ఫుడ్ అగ్రిగేటర్ల ద్వారా 310 రైల్వే స్టేషన్లలో అందుబాటులో; రోజుకు సగటున 41,844 భోజనాల సరఫరా.
596 రైళ్లలో 3081 పీఓఎస్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి; 4316 స్టాటిక్ యూనిట్లు అందించిన పీఓఎస్ మెషీన్లు
प्रविष्टि तिथि:
22 SEP 2022 11:55AM by PIB Hyderabad
భారతీయ రైల్వేలలో డిజిటల్ ఇండియా చొరవను ప్రోత్సహించడానికి, రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ యూనిట్ల ద్వారా ఆహార పదార్థాల కొనుగోలు కోసం డిజిటల్ పద్ధతిలో లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు 8878 స్టాటిక్ యూనిట్లు డిజిటల్ చెల్లింపు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అదనంగా, క్యాటరింగ్ యూనిట్లలో హ్యాండ్‌హెల్డ్ పీఓఎస్ మెషీన్‌లను అందించడంతోపాటు, చేపట్టిన లావాదేవీల వివరాలన్నింటినీ ప్రతిబింబించే విధంగా ప్రింటెడ్ బిల్లులు, ఇన్‌వాయిస్‌లను పొందేందుకు, అధిక ఛార్జీలపై ఫిర్యాదులను పరిష్కరించడానికి ఏర్పాట్లు చేయడమైంది. ప్రస్తుతం 596 రైళ్లలో 3081 పీఓఎస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. 4316 స్టాటిక్ యూనిట్లకు పీఓఎస్ మిషన్లు అందించబడ్డాయి.
రైళ్లలో ప్రయాణీకులకు అందుబాటులో ఉన్న ఆప్షన్ల(ఎంపిక) పరిధిని విస్తృతం చేయడం కోసం, భారతీయ రైల్వేలో ఈ-కేటరింగ్ సేవలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇ-కేటరింగ్ సేవలను ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తుంది. ప్రయాణీకులు ఇ-టికెట్ బుకింగ్ సమయంలో, లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు యాప్/కాల్ సెంటర్/వెబ్‌సైట్/1323కు కాల్ చేయడం ద్వారా తమకు నచ్చిన భోజనాన్ని ముందస్తు ఆర్డర్ చేయవచ్చు. ప్రస్తుతం 310 రైల్వే స్టేషన్‌లలో 1755 సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఈ-కేటరింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. 14 ఫుడ్ అగ్రిగేటర్లు, రోజుకు సగటున 41,844 భోజనాలను సరఫరా చేస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 1861532)
आगंतुक पटल : 230