ప్రధాన మంత్రి కార్యాలయం
అసమీ భాషా నిఘంటువు ‘హేమ్ కోశ్’ యొక్క బ్రేల్ సంచిక తాలూకు ప్రతి ని స్వీకరించిన ప్రధాన మంత్రి
Posted On:
21 SEP 2022 7:22PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 19వ శతాబ్దం నాటి అసమీ భాషా నిఘంటువులలోకెల్లా మొదటిది అయినటువంటి ‘హేమ్ కోశ్’ యొక్క బ్రేల్ సంచిక తాలూకు ప్రతి ని ఒకదాని ని శ్రీ జయంత్ బరువా వద్ద నుండి స్వీకరించారు. దీని బ్రేల్ రూపాంతరం ప్రచురణ కు మార్గదర్శకత్వం వహించిన శ్రీ జయంత్ బరువా ను మరియు ఆయన జట్టు ను శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘19వ శతాబ్ది కి చెందిన అసమీ భాషా నిఘంటువు లు అన్నింటి లో మొదటిది అయినటువంటి ‘హేమ్ కోశ్’ యొక్క బ్రేల్ సంచిక ప్రతి ని అందుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ బ్రేల్ వెర్షన్ ప్రచురణ కు దారితీసిన శ్రీ జయంత్ బరువా మరియు ఆయన జట్టు సభ్యుల యొక్క ప్రయాసల ను నేను అభినందిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1861407)
Visitor Counter : 131
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam