ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన ఆర్థిక వ్యవస్థ తో, సమాజం తో మరియు పర్యావరణం తో ముడిపడ్డ కార్యక్రమాల లో పాలుపంచుకోవడం ద్వారా ప్రధాన మంత్రి తన పుట్టిన రోజు ను జరుపుకొన్నారు


శుభకామనల ను మరియు స్నేహాన్ని వ్యక్తం చేసినందుకు గాను అందరి కి ధన్యవాదాలు తెలిపారు

శుభాకాంక్షల ను తెలిపినందుకు గాను జాతీయ మరియు అంతర్జాతీయ ప్రముఖుల కు ధన్యవాదాలు పలికారు

Posted On: 17 SEP 2022 9:47PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన ఆర్థిక వ్యవస్థ తో , సమాజం తో మరియు పర్యావరణం తో ముడిపడినటువంటి కార్యక్రమాల లో పాల్గొనడం ద్వారా తన జన్మదినాన్ని జరుపుకొన్నారు.  ఆయన తనకు అందిన శుభాకాంక్షల కు మరియు స్నేహాని కి గాను అందరి కి కృత‌జ్ఞ‌త‌ల ను వ్యక్తం చేశారు.

శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా ట్వీట్ చేశారు.. :

‘‘నాకు లభించినటువంటి స్నేహానికి గాను నేను వినమ్రుడి గా ఉన్నాను.  నా పుట్టిన రోజు న నాకు శుభాకాంక్షల ను తెలియజేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కి నేను ధన్యవాదాల ను పలుకుతున్నాను.  ఈ శుభకామన లు నాకు మరింత గా కష్టపడటానికి శక్తి ని ఇచ్చేవే అవుతాయి.  ఈ దినాన వివిధ సాముదాయిక సేవ కార్యక్రమాల లో పాల్గొన్న అందరి ని నేను మెచ్చుకొంటున్నాను.  వారి సంకల్పం ప్రశంసనీయమైనటువంటిది గా ఉంది.’’

 

 

‘‘నేను నా యొక్క రోజు ను మా ఆర్థిక వ్యవస్థ, సమాజం మరియు పర్యావరణం లతో ముడిపడ్డ కార్యక్రమాల లో పాలుపంచుకోవడం ద్వారా గడిపివున్నాను.  నేను నిజంగా నమ్మేది ఏమిటి అంటే అది ఎప్పుడయితే మనం సామూహికం గా ఈ రంగాల లో కృషి చేశామా అంటే గనక మనం నిరంతరం మరియు అందరి ని కలుపుకొని పోయేటటువంటి అభివృద్ధి అనేటటువంటి మన లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతాం అనేదే.  ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థించేది ఏమిటి అంటే అది మనం రాబోయే కాలం లో మరింత గా కఠోరం గా శ్రమిస్తూ ఉండాలనేదే.’’

 

 

 

 

అంతర్జాతీయ నాయకులు అనేక మంది ప్రధాన మంత్రి కి ఆయన జన్మదినం నాడు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

కామన్ వెల్థ్ ఆఫ్ డొమినికా ప్రధాని శ్రీ రూజ్ వెల్ట్ స్కెరిట్ కు ప్రధాన మంత్రి ఈ కింది విధం గా జవాబిచ్చారు..

‘‘పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలియజేసినందుకు గాను ప్రధాని శ్రీ @SkerritR కు ధన్యవాదాలు.’’

 

 

నేపాల్ ప్రధాని శ్రీ శేర్ బహాదుర్ దేవుబా ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ఇలా అన్నారు..

‘‘పుట్టిన రోజు న మీరు స్నేహపూర్ణమైనటువంటి శుభాకాంక్షల ను వ్యక్తం చేసినందుకు ప్రధాని శ్రీ @SherBDeuba , మీకు ఇవే ధన్యవాదాలు.  మీకు నేను నా హృద‌యాంత‌రాళం లో నుండి కృత‌జ్ఞ‌త‌ల ను తెలియజేస్తున్నాను.’’

 

 

మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ కూడాను ప్రధాన మంత్రి కి శుభాకాంక్ష లు తెలియజేశారు; దీనికి శ్రీ నరేంద్ర మోదీ బదులిస్తూ

‘‘నా ప్రియ మిత్రుడు ప్రధాని శ్రీ @KumarJugnauth కు శుభకామనల కు గాను ఇవే ధన్యవాదాలు.’’

 

 

భూటాన్ ప్రధాన మంత్రి యొక్క శుభాకాంక్షల కు ప్రధాన మంత్రి ఈ దిగువ విధం గా సమాధానాన్ని ఇచ్చారు.

‘‘మీ స్నేహపూర్ణ శుభకామనల కు గాను @PMBhutan,  మీకు ఇవే ధన్యవాదాలు.  నిజాని కి భూటాన్ లో నా మిత్రుల వద్ద నుండి అందినటువంటి ప్రేమ కు మరియు సమ్మానాని కి నేను ఎల్లప్పుడూ ప్రాముఖ్యాన్ని ఇస్తాను.’’

 

 

 

 ప్రధాన మంత్రి దేశం లో ప్రముఖుల కు కూడాను శుభాకాంక్షల కు గాను ధన్యవాదాల ను తెలియజేశారు.

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు ఆమె వ్యక్తం చేసిన శుభకామనల కు ప్రధాన మంత్రి తన ధన్యవాదాల ను తెలిపారు.

‘‘శుభాకాంక్షల కు గాను మీకు చాలా చాలా కృత‌జ్ఞ‌త‌లు మాన్య రాష్ట్రపతి గారు.  @rashtrapatibhvn”

 

 

 

ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ కు ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం ఈ కింది విధం గా ఉంది..

‘‘ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ గారి యొక్క శుభకామనల కు మరియు ఆయన యొక్క ఉదారమైనటువంటి పలుకుల కు నేను కృత‌జ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. ఇవే ధన్యవాదాలు. @VPSecretariat”

 

 

పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కూడా ప్రధాన మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.  ప్రధాన మంత్రి ఇలా జవాబిచ్చారు..

‘‘గౌరవనీయులు శ్రీ @ramnathkovind  గారు, మీకు ఇవే నా హృద‌యపూర్వక ధన్యవాదాలు.  https://t.co/tX06iPMMmw

 

 

 

పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు వ్యక్తం చేసిన శుభాకాంక్షల కు ప్రధాన మంత్రి ఇలా సమాధానమిచ్చారు..

‘‘శ్రీ వెంకయ్య గారు, మీ శుభకామన లు నా మనసు ను స్పర్శించాయి. శ్రీ @MVenkaiahNaidu”

 

 

***


(Release ID: 1860495) Visitor Counter : 128