సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘అంబేద్కర్ అండ్ మోదీ: రిఫార్మర్స్ ఐడియాస్ పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్' పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్


డాక్టర్ అంబేద్కర్ దార్శనికతను సాకారం చేయడానికి చేస్తున్న పటిష్ట ప్రయత్నాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ఈ పుస్తకం: శ్రీ అనురాగ్ ఠాకూర్

"వైద్య విద్యలో పోటీ లేని ప్రగతి; 208 కళాశాలలు ప్రారంభం; లక్షకు పైగా పెరిగిన సీట్లు"

" సమానత్వం, మానవ హక్కులు , సామాజిక న్యాయం కోసం పోరాటానికే తన మొత్తం జీవితాన్ని అంకితం చేసిన అంబేద్కర్’’

Posted On: 16 SEP 2022 4:23PM by PIB Hyderabad

'అంబేద్కర్ అండ్ మోదీ: రిఫార్మర్స్ ఐడియాస్ పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్' పుస్తకాన్ని భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్  ఈ రోజు ఆవిష్కరించారు.  కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ కె.జి. బాలకృష్ణన్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ హితేష్ జైన్  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా శ్రీ అనురాగ్ ఠాకూర్

ప్రసంగిస్తూ, ఈ పుస్తకం గొప్ప సంస్కర్త బాబా సాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ ఉదాత్త మైన భావాలు, దార్శనికతల సంకలనం మాత్రమే కాకుండా, గత ఎనిమిదేళ్ళలో

 ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ ఆలోచన లను ఎలా అమలు చేశారనే దానిని కూడా వివరిస్తుందని అన్నారు.  ఈ పుస్తకం డాక్టర్ అంబేద్కర్ దార్శనికతను సాకారం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అని పేర్కొన్నారు.

 

డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని శ్రీ ఠాకూర్ గుర్తు చేసుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ గొప్ప రాజనీతిజ్ఞుడు అని,  ఆయన ఆలోచనలు, జోక్యాలు , సిద్ధాంతాలు తత్వాలు ఈ రోజు మనకు తెలిసిన మన జాతికి, దేశానికి బలమైన పునాదిని ఏర్పరిచాయని అన్నారు.

‘’ సమానత్వం, మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ తన జీవితమంతా అంకితం చేశారు. అణగారిన , సామాజికంగా అణచివేయబడినవారి తరఫున తన గొంతు వినిపించారు. ఆయన జీవితం, ప్రభావం ఆధునిక భారతదేశ నిర్మాణం దిశగా  సర్వత్రా ప్రభావితం చేస్తూనే ఉంది" అని మంత్రి పేర్కొన్నారు.

 

తొలి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ అంబేద్కర్ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందేలా అట్టడుగు వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తెచ్చి వివక్షకు తావులేని సమాజాన్ని ఊహించారని, అయితే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాల ప్రయత్నాలు ఈ ఆలోచనలను సాకారం చేయడంలో విఫలమయ్యాయని ఆయన అన్నారు. 2014 నుండి ప్రభుత్వం ఈ లక్ష్యాలను నిర్విరామంగా కొనసాగిస్తోందని  చెప్పారు.

 

ప్రభుత్వ మౌలిక సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ,

ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ల లోనే ప్రధాన మంత్రి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ తాను దళితులు, అట్టడుగు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంకితం అవుతానని ప్రకటించిన విషయాన్ని శ్రీ ఠాకూర్ గుర్తు చేశారు. ‘’అప్పటి నుండి ప్రభుత్వ చర్యలు, విధానాలు అంత్యోదయ్ గళానికి అనుగుణంగా నడిచాయి. ఇది మేక్ ఇన్ ఇండియా కావచ్చు లేదా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు కావచ్చు, ఇవి డాక్టర్ అంబేద్కర్ ఊహించిన విధంగా ఆధునిక భారతదేశాన్ని సాకారం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన చొరవలు’’ అని పేర్కొన్నారు. 

 

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత మంత్రం 'బహుజన హితాయ, బహుజన్ సుఖాయ ' (ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సంతోషం కోసం ) ప్రధాని మోదీ అభివృద్ధి నమూనాలో ఎల్లప్పుడూ కీలకంగా ఉంది.

విద్యారంగంలో దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎంలు, ఐఐఐటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల సంఖ్య పెరిగింది. అంబేద్కర్ దార్శనికత, తన సొంత నమ్మకాలతో ప్రేరణ పొందిన ప్రధాని మోదీ ప్రాథమిక, ఉన్నత, వైద్య విద్యపై దృష్టి సారించి విద్యా రంగాన్ని వేగంగా మార్చడంలో ప్రతి ప్రయత్నం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో 208 మెడికల్ కాలేజీలు తెరుచుకున్నాయి. మెడికల్ సీట్ల సంఖ్య 78 వేల నుంచి లక్షకు పెరిగింది. ఇది సాటిలేని ఘనత. దేశంలో వైద్యుల సంఖ్య అంతరాన్ని పూడ్చడానికి ,నిరుపేద ప్రజలకు మంచి వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండటానికి కూడా కృషి చేస్తున్నాము.’’ అని చెప్పారు.

 

దేశంలో మౌలిక సదుపాయాల మెరుగుదల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశంలో మారుమూల ప్రాంతాలకు సైతం విద్యుత్ సౌకర్యం ఏర్పడిందని, 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారని, సంక్షోభ సమయంలో

మహిళ ల ఖాతాలకు 31 వేల కోట్ల

రూపాయలకు పైగా బదిలీ అయ్యాయని, ఈ ప్రభుత్వాన్ని గుర్తించే చర్యలు ఇవేనని ఆయన అన్నారు. భీమ్ ఒక బలమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు ఉదాహరణగా నిలుస్తోందని,  దేశం లో 11 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించామని , మరో మూడు కోట్లకు పైగా గృహాలను నిర్మించామని మంత్రి

వివరించారు.

 

మహిళా కేంద్రిత , మహిళా నేతృత్వం లోని అభివృద్ధి ఈ ప్రభుత్వ మూల స్తంభాలలో

ఒకటిగా ప్రధాన మంత్రి ఉద్దేశమని శ్రీ ఠాకూర్ అన్నారు. ఉజ్వ ల యోజన పథకం కింద 12 కోట్ల మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందేలా ప్రభుత్వం చూసిందని , ప్రసూతి శెలవును 12 వారాల నుండి 26 వారాలకు పెంచామని అన్నారు.

 

34 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు పూచీకత్తు లేకుండా రూ.18 లక్షల కోట్ల రూపాయల రుణాలు అందించేందుకు ముద్రా యోజన దోహదపడిందన్నారు. ఎస్ సి, ఎస్ టి వర్గాలకు చెందిన 3.1 కోట్ల మంది ఉజ్వల యోజన లబ్ధిదారులుగా ఉన్నారని,   ఈ వర్గాలకు చెందిన సభ్యులకు 1.31 కోట్ల పక్కా గృహాలు అందించినట్లు తెలిపారు.

 

ఎస్సీ యువతను ఉద్ధరించాలన్న డాక్టర్ అంబేద్కర్ దార్శనికతకు అనుగుణంగా అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్ (ఏఎస్ఐఐఎం)ను 2020లో ప్రారంభించారు. పిఎం దక్ష్ యోజన 2.27 లక్షల మంది యువతను నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో చేర్చడానికి శిక్షణ ఇచ్చింది. 2014కు ముందు కేవలం రూ.15,000/- ఉన్న ఉద్యోగుల స్టేట్ ఇన్స్యూరెన్స్ వేతన పరిమితిని రూ.21,000కు పెంచినట్లు మంత్రి తెలిపారు.

 

బాబా సాహెబ్ కు గౌరవ సూచకంగా ప్ర ధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పంచ్ తీర్ధ్  ను ఏర్పాటు చేసింది. పార్లమెంట్ లో డాక్ట ర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది.

 

పుస్తకాన్ని  ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ తన ప్రసంగంలో డాక్టర్  అంబేద్కర్ బహుముఖ వ్యక్తిత్వాన్ని గురించి వివరించారు. స్వతంత్ర భారత దేశ ప్రారంభ సంవత్సరాలలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, బ్యాంకింగ్ , ఇరిగేషన్ , విద్యుత్ , విద్య , కార్మిక, ఆదాయ పంపిణీకి సంబంధించిన విధానాలకు అంబేద్కర్ సేవలు రూపుదిద్దాయని శ్రీ కోవింద్ అన్నారు.

 

2010లో గుజరాత్ లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ యాత్రను నిర్వహించిన సమయాన్ని శ్రీ కోవింద్ గుర్తు చేసుకున్నారు. అలంకరించిన ఏనుగుపై భారత రాజ్యాంగం పెద్ద ప్రతిని ఉంచి ,సిఎం  మోదీ ప్రజలతో కాలినడకన యాత్ర సాగించారని, రాజ్యాంగం పట్ల గౌరవానికి, బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల గౌరవానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి లేదని ఆయన అన్నారు.

 

డాక్ట ర్ అంబేడ్కర్ విజన్ కు, ప్రధాని మోదీ విధానాలకు మధ్య సారుప్యాన్ని ప్రస్తావిస్తూ, దేశ వ్యాప్తంగా ప్రవేశ పెట్టిన రెండు లక్షలకు పైగా ఆలోచనలతో కూడిన కొత్త విద్యావిధానం, మాతృభాష లో విద్యను అందించాలన్న బాబా సాహెబ్ భావాలకు అనుగుణంగా ఉందని శ్రీ కోవింద్ అన్నారు. అనేక సంక్లిష్ట చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లు, కార్మికులకు సార్వత్రిక ఖాతా సంఖ్య డాక్టర్ అంబేడ్కర్ దార్శనికత ఫలం అని ఆయన అన్నారు.

 

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ డాక్టర్ అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకుంటూ, భారతదేశ గొప్ప ఆలోచనాపరులలో ఆయన ఒకరిగా పేర్కొన్నారు. పారిశ్రామికీకరణ, మహిళా సాధికారత, విద్య, భారతదేశ ఆధునీకరణపై బాబా సాహెబ్ ఆలోచనలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. డాక్టర్ అంబేద్కర్ ఊహించిన భారత దేశం అనే భావన సారాన్ని ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ప్రతి ఫలిస్తున్నాయని ఆయన ఉద్ఘాటించారు.

 

ఈ కార్యక్రమానికి ముందు, జస్టిస్ కె.జి.బాలకిషన్ ,శ్రీ అనురాగ్ ఠాకూర్ లు మూడు రోజుల పాటు నిర్వహించే డిజిటల్ ఇంటరాక్టవ్ మ ల్టీ మీడియా ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  లో భాగంగా డాక్ట ర్ బి.ఆర్ అంబేడ్క ర్ జీవితం, బోధలు, సేవలపై  ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. . డాక్టర్ అంబేద్కర్ ఆదర్శాలు ,ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించేటప్పుడు సందర్శకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి ఈ ఎగ్జిబిషన్ రూపొందించబడింది. ఇందులో హోలోక్యూబ్స్, డిజిటల్ ఇంటరాక్టివ్ పజిల్స్, RFID ఆధారిత డిజిటల్ ఇంటరాక్టివ్ డిస్ ప్లేలు, ఇంటరాక్టివ్ టచ్ వాల్స్ మరియు ఫ్లిప్ బుక్స్ యొక్క డిస్ ప్లే ఉంటాయి.

 

డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు , ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తూ, సందర్శకులకు అనుభూతిని అందించేలా ఈ ప్రదర్శన రూపొందించబడింది. ఇందులో హోలోక్యూబ్‌లు, డిజిటల్ ఇంటరాక్టివ్ పజిల్స్, ఆర్ ఎఫ్  ఐ  డి ఆధారిత డిజిటల్ ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు, ఇంటరాక్టివ్ టచ్ వాల్స్ ,ఫ్లిప్ పుస్తకాలను ఉంచారు.

 

అంబేద్కర్ అండ్ మోదీ: రిఫార్మర్స్ ఐడియాస్ పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్' పుస్తకం గురించి

 

ఈ పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ అతి జాగ్రత్తగా, నైపుణ్యంతో సంకలనం చేసింది, ఇది భారతీయ ప్రతిభను ఉపయోగించుకునే ప్రముఖ సంస్థలలో ఒకటి. సామాజిక సంక్షేమం కోసం అవగాహన కల్పించడం, అవుట్-ఆఫ్-బాక్స్ ఆలోచనలను అమలు చేయడం ద్వారా భారతీయ సమాజాన్ని శక్తివంతం చేస్తుంది. ఇది రాజ్యసభ ఎంపి ఇళయరాజా (ప్రశంసలు పొందిన సంగీత స్వరకర్త ,గీత రచయిత) ముందుమాటను కలిగి ఉంది, ఇది డాక్టర్ అంబేద్కర్ రచనల్లో కనిపించే విస్తారమైన జ్ఞానం గురించి విలువైన అంతర్దృష్టిని అందిస్తుంది, అదే సమయంలో భారతదేశ పురోగతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనికతకు అనుగుణంగా ఉందని నిర్ధారించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన విధానాలు ,సంస్కరణలకు సమాంతరాన్ని ఆవిష్కరిస్తుంది.

 

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు పనులపై నిరంతర పరిశోధనలకు అంబేద్కర్ అండ్ మోదీ పుస్తకం కీలకమైన జోడింపు. దేశ విధాన ప్రకృతి దృశ్యానికి ఇది ఒక ముఖ్యమైన సహకారం అవుతుంది. ఇది ఒక స్వతంత్ర దేశంగా భారతదేశ ప్రయాణంలో ఒక మైలురాయిగా పనిచేస్తుంది. డాక్టర్ అంబేద్కర్ వంటి వ్యక్తుల దార్శనికత ప్రధానమంత్రి మోదీ దార్శనికత ,చైతన్యవంతమైన నాయకత్వంలో చివరకు ఎలా ఫలవంతం అవుతుందో విశ్లేషిస్తుంది.

 

ఈ పుస్తకం డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని, రచనలను, విజయాలను మేధో దృక్పథంతో లోతుగా పరిశీలిస్తుంది.  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆదర్శాలు - నవ భారతదేశ అభివృద్ధి ప్రయాణం మధ్య తిరస్కరించలేని సమన్వయాన్ని ఆవిష్కరిస్తుంది.

 

 *****



(Release ID: 1860079) Visitor Counter : 179