మంత్రిమండలి

పిఎం గ‌తి శ‌క్తి చ‌ట్రం (స‌రుకు సంబంధిత కార్య‌క‌లాపాలు, ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు & ప్ర‌త్యేకంగా రైల్వేల వినియోగం కోసం)ను అమలు చేసందుకు రైల్వే భూములను దీర్ఘ‌కాలం లీజుకు ఇచ్చేందుకు విధానాన్ని ఆమోదించిన కేబినెట్


రైల్వేల‌కు మ‌రింత ఆదాయమే కాక దాదాపు 1.2 ఉద్యోగాలను సృష్టించేందుకు సంభావ్య‌త‌

రానున్న ఐదేళ్ళ‌లో 300 పిఎం గ‌తిశ‌క్తి కార్గో టెర్మిన‌ళ్ళ‌ను అభివృద్ధి చేయ‌నున్నారు

Posted On: 07 SEP 2022 3:58PM by PIB Hyderabad

 పిఎం గ‌తిశ‌క్తి చ‌ట్రం (స‌రుకు సంబంధిత కార్య‌క‌లాపాలు,  ప్ర‌జా వినియోగాలు & రైల్వేల ప్ర‌త్యేక వినియోగం)కి సంబందించి స‌వ‌రించిన రైల్వేల భూ విధానాన్ని అమ‌లు చేయాల‌న్న రైల్వే మంత్రిత్వ శాఖ ప్ర‌తిపాదన‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌తన జ‌రిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 
ప్ర‌భావంః 
ఇది రైల్వేల‌కు మ‌రింత స‌రుకును  ఆక‌ర్షించ‌డం, స‌రుకు ర‌వాణాను పెంచేందుకు రైల్వేల న‌మూనా వాటాను పెంచి త‌ద్వారా ప‌రిశ్ర‌మ‌పై లాజిస్టిక్స్ వ్య‌యాన్ని త‌గ్గించ‌డం.
ఇది రైల్వేల‌కు మ‌రింత ఆదాయాన్ని తీసుకువ‌స్తుంది.
ఇది పిఎం గ‌తిశ‌క్తి కార్య‌క్ర‌మంలో భావించిన విధంగా 
ఇది PM గతి శక్తి ప్రోగ్రామ్‌లో ఊహించిన విధంగా యుటిలిటీల కోసం అనుమతులను సులభతరం చేస్తుంది. ఇది విద్యుత్తు, గ్యాసు, నీటి స‌ర‌ఫ‌రా, టెలికాం కేబుల్‌, మురుగును పార‌వేయ‌డం, డ్రెయిన్లు, ఆప్టిక‌ల్ ఫైబ‌ర్  కేబుళ్ళు (ఒఎఫ్‌సి), పైప్‌లైన్లు, ర‌హ‌దారులు, ఫ్లైఓవ‌ర్లు, వంటి ప్ర‌జా ప్ర‌యోజ‌నాల అభివృద్ధికి తోడ్ప‌డుతుంది. కాగా, టెర్మిన‌ళ్ళు, ప్రాంతీయ రైలు ర‌వాణా, నగ‌ర ర‌వాణా త‌దిత‌రాల‌ను ఒక స‌మ‌గ్ర ప‌ద్ధ‌తిలో వృద్ధి చేసేందుకు తోడ్ప‌డుతుంది. 
ఈ విధాన స‌వ‌ర‌ణ దాదాపు 1.2 ల‌క్ష‌ల‌మందికి ఉపాధిని క‌ల్పించేందుకు తోడ్ప‌డుతుంది. 

ఆర్థిక ప్ర‌భావాలు: 
ఎలాంటి అద‌న‌పు ఖ‌ర్చు ఉండ‌దు. భూమి లీజింగ్ విధానం అన్న‌ది అంద‌రు వాటాదారుల‌కు/  సేవ‌ల‌ను అందించేవారికి/ స‌రుకుకు సంబంధించిన మ‌రిన్ని కేంద్రాల‌ను ఏర్పాటు చేసేంద‌దుకు ఆప‌రేట‌ర్ల‌కు అవ‌కాశాన్ని క‌ల్పించ‌డ‌మే కాక‌, రైల్వేల‌కు అద‌న‌పు కార్గో ట్రాఫిక్‌, స‌రుకు ర‌వాణా ఆదాయాల ఉత్ప‌త్తిలో వారి భాగ‌స్వామ్యాన్ని అందించ‌డానికి మార్గాల‌ను తెరుస్తుంది. 

ప్ర‌యోజ‌నాలు: 
ఈ విధాన స‌వ‌ర‌ణ దాదాపు 1.2 ల‌క్ష‌ల‌మందికి ఉపాధిని క‌ల్పించేందుకు తోడ్ప‌డుతుంది. 
వివ‌రాలు: 
స‌వ‌రించిన రైల్వేల భూ విధానం మౌలిక స‌దుపాయాల స‌మ‌గ్ర అభివృద్ధిని, మ‌రిన్ని స‌రుకు టెర్మిన‌ళ్ళ అభివృద్ధికి తోడ్ప‌డుతుంది. 
ఇది భూమి మార్కెట్ విలువ‌లో 1.5% చొప్పున దాదాపు 35 సంవ‌త్స‌రాల వ‌ర‌కు స‌రుక‌కు సంబంధిత కార్య‌క‌లాపాల కోసం రైల్వే భూమిని దీర్ఘ‌కాలం అద్దెకు ఇవ్వ‌డానికి సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తుంది. 
పార‌ద‌ర్శ‌క‌మైన‌, పోటీ బిడ్డింగ్ ప్ర‌క్రియ త‌ర్వాత ప్ర‌స్తుతం రైల్వే భూమిపై స‌రుకు టెర్మిన‌ళ్ళ‌ను నిర్వ‌హిస్తున్న సంస్థ‌లు నూత‌న విధానానికి బ‌దిలీ అయ్యే ప్ర‌త్యామ్నాయాన్ని క‌లిగి ఉంటారు. 
రానున్న ఐదేళ్ళ‌లో 300 పిఎం గ‌తిశ‌క్తి కార్గో టెర్మిన‌ళ్ళ‌ను అభివృద్ధి చేయ‌నున్నారు, త‌ద్వారా 1.2 ల‌క్ష‌ల మంది ఉపాధి అవ‌కాశాలు సృష్టి అవుతాయి. 
ఇది స‌రుకు ర‌వాణాలో రైల్వేల మోడ‌ల్ వాటాను పెంచ‌డ‌మే కాక దేశ‌వ్యాప్తంగా లాజిస్టిక్స్ ఖ‌ర్చును త‌గ్గిస్తుంది. 
ఈ విధానం విద్యుత్తు, గ్యాస్‌, నీటి స‌ర‌ఫ‌రా, మురుగు విస‌ర్జ‌న‌, న‌గ‌ర ర‌వాణా త‌దిత‌రాల స‌మ‌గ్రాభివృద్ధి కోసం రైల్వే భూముల వినియోగం రైట్ ఆఫ్ వే (ఆర్ఒడ‌బ్ల్యు - దారి హ‌క్కు)ను రైల్వే భూమిని మార్కెట్ విలువ ఏడాదికి 1.5% చొప్పున రైల్వే భూమిని అందిస్తున్నారు. 
ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుళ్ళ‌ను (ఒఎఫ్‌సి), ఇత‌ర చిన్న వ్యాసం క‌లిగిన భూగ‌ర్భ ప్ర‌యోజ‌నాలు/  వినియోగాల కోసం ఏక‌కాల రుసుము రూ. 1000/- ని రైల్వే ట్రాక్ క్రాసింగ్ కోసం వసూలు చేస్తారు.
రైల్వే భూమిలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు నామ‌మాత్ర‌పు ఖ‌ర్చుతో రైల్వే భూమిని వినియోగించుకునే సౌక‌ర్యాన్ని ఈ విధానం క‌ల్పిస్తుంది. 
ఈ విధానం ఏడాదికి చ‌ద‌ర‌పు కిలోమీట‌రుకు రూ.1 చొప్పున నామ‌మాత్ర‌పు రుసుముతో రైల్వ భూముల‌పై  సామాజిక మౌలిక స‌దుపాయాల అభివృద్ధిని (పిపిపి ద్వారా ఆసుప‌త్రులు, కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ ద్వారా పాఠ‌శాల‌లు వంటివి) ప్రోత్స‌హిస్తుంది. 

వూహ అమ‌లు, ల‌క్ష్యం:
కేబినెట్ ఆమోదం వ‌చ్చిన 90 రోజుల లోపు స‌మ‌గ్ర విధాన ప‌త్రాన్ని రూపొందించి, అమ‌లు చేస్తారు. 
పిఎం గ‌తిశ‌క్తి కింద ఊహించిన ప్ర‌యోజ‌నాల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ఆమోదాల‌ను స‌ర‌ళీక‌రిస్తారు.
రానున్న ఐదేళ్ళ‌లో 300కి పైగా పిఎం గ‌తిశ‌క్తి కార్గో టెర్మిన‌ళ్ళ‌ను అభివృద్ధి చేస్తారు. 

నేప‌థ్యం:
రైల్వే సంస్థ‌, నెట్‌వ‌ర్క్ దేశ‌వ్యాప్తంగా వ్యాపించి ఉంది. అయితే, ప్ర‌స్తుత‌మున్న భూమి విధానాల కార‌ణంగా ఇత‌ర ర‌కాల మౌలిక స‌దుపాయాల‌తో ఏకం కాలేక‌పోతున్న‌ది. అందువ‌ల్ల, పిఎం గ‌తిశ‌క్తి చ‌ట్రం కింద  వేగ‌వంత‌మైన స‌మీకృత ప్ర‌ణాళిక‌,  దేశ‌వ్యాప్తంగా మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కోసం రైల్వ‌ల భూమి లీజ్ విధానాల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించి, స‌ర‌ళీకృతం చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. 
రైల్వేల‌కు సంబంధించిన ఏ కార్య‌క‌లాపానికైనా ఐదేళ్ళ స్వ‌ల్ప‌కాలం కోసం రైల్వే భూమిని వినియోగించుకునేందుకు వీలుగా విస్తార‌మైన విధానం అనుమ‌తిస్తుంది. కానీ, అటువంటి స్వ‌ల్ప‌కాలిక లైసెన్సు కాలం బ‌హుళ- న‌మూనా కార్గో హ‌బ్‌ల‌ను సృష్టించేందుకు క‌ట్టుబ‌డిన పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ర్షించ‌లేదు. కానీ, ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లకు  35 ఏళ్ళ‌పాటు దీర్ఘ‌కాలిక లీజును అనుమ‌తించ‌డం ద్వారా కార్గో టెర్మిన‌ళ్ళ‌కు పెట్టుబ‌డుల ప‌రిధిని ప‌రిమితం చేస్తుంది. అయితే, రైల్వేలు స‌మ‌ర్ధ‌వంత‌మైన ర‌వాణా ప‌ద్ధ‌తి అయినందున‌, ప‌రిశ్ర‌మ‌ల లాజిస్టిక్స్ ఖ‌ర్చును త‌గ్గించ‌డం కోసం రైల్వేలలో మ‌రింత స‌రుకును ర‌వాణా చేయ‌డం ముఖ్యం. స‌రుకు ర‌వాణాలో మోడ‌ల్ వాటాను పెంచ‌డం కోసం భూమి లీజింగ్ విధానాన్ని స‌వ‌రించి, మ‌రిన్ని కార్గో టెర్మిన‌ళ్ళ అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యంగా ఉంది. 

 

***
  



(Release ID: 1857661) Visitor Counter : 177