సహకార మంత్రిత్వ శాఖ

జాతీయ సహకార విధాన పత్రాన్ని రూపొందించడానికి జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రకటించారు.


కొత్త జాతీయ సహకార విధానాన్ని అమలు చేసేందుకు రూపకల్పన చేస్తున్నారు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ దార్శ‌నిక నాయకత్వంలో 'సహకార్ సే సమృద్ధి' భవిష్యదృష్టి లక్ష్యం

కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS) స్థాయి నుండి పై వరకూ సమగ్ర జాతీయ సహకార విధానం త్వరలో రూపొందించబడుతుందని ఇటీవల ప్రకటించారు

సహకార సూత్రాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను అందించడానికి, ‘సహకార్ సే సమృద్ధి’ యొక్క దార్శనికత తో దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మరియు అట్టడుగు స్థాయి వరకు దాని విస్తృతిని పెంచడానికి మరియు సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి నమూనాను ప్రోత్సహించడానికి ఈ పత్రం రూపొందించబడుతుంది

Posted On: 06 SEP 2022 11:25AM by PIB Hyderabad

జాతీయ సహకార విధాన పత్రం రూపకల్పన కోసం జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రకటించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో 'సహకార్ సే సమృద్ధి' దృక్పథాన్ని సాకారం చేసేందుకు కొత్త జాతీయ సహకార విధానం రూపొందించబడుతోంది.

 

మాజీ కేంద్ర క్యాబినెట్ మంత్రి శ్రీ సురేష్ ప్రభాకర్ ప్రభు అధ్యక్షతన జాతీయ స్థాయి కమిటీలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి 47 మంది సభ్యులు ఉన్నారు. కమిటీ లో సహకార రంగానికి చెందిన నిపుణులు ; జాతీయ / రాష్ట్ర / జిల్లా & ప్రాథమిక సహకార సంఘాల ప్రతినిధులు; రాష్ట్రాలు/యూ టీ ల సహకార సంఘాల కార్యదర్శులు (సహకారం), రిజిస్ట్రార్లు; మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాల అధికారులు ఉంటారు

 

కేంద్ర హోం మరియు సహకార మంత్రి, శ్రీ అమిత్ షా ఇటీవలే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS) స్థాయి నుండి పై వరకూ సమగ్ర జాతీయ సహకార విదానం త్వరలో రూపొందించబడుతుందని ప్రకటించారు.

 

సహకార సంఘాలపై ఇప్పటికే ఉన్న జాతీయ విధానం 2002లో సహకార సంఘాల సర్వతోముఖాభివృద్ధిని సులభతరం చేయడం మరియు వాటికి అవసరమైన మద్దతు, ప్రోత్సాహం మరియు సహాయాన్ని అందించడం వంటి లక్ష్యాలతో రూపొందించబడింది, తద్వారా సహకార సంస్థలు స్వయంప్రతిపత్తి, స్వావలంబన మరియు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబడే సంస్థలుగా బాధ్యతాయుతంగా పని చేస్తాయి. వారి సభ్యులకు మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందించాయి. నేడు, భారతదేశం లో దాదాపు 8.5 లక్షల సహకార సంఘాలు వున్నాయి. సహకార రంగం దాదాపు 29 కోట్ల మంది సభ్యులతో దేశం వ్యాప్తంగా విస్తరించి ఉంది. ఈ సహకార సంఘాలు వ్యవసాయ అనుబంధ పరశ్రమలు (ఆగ్రో-ప్రాసెసింగ్) పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, గృహ నిర్మాణం, చేనేత, పరపతి, మార్కెటింగ్ వంటి అనేక రకాల కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయి.

 

కొత్త సహకార మంత్రిత్వ శాఖకు ఇచ్చిన ఆదేశాన్ని నెరవేర్చే ఉద్దేశ్యంతో , ‘సహకార్ సే సమృద్ధి’  దార్శనికత తో; దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం మరియు అట్టడుగు స్థాయి వరకు దాని విస్తృతిని పెంచడం; సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలతో కొత్త జాతీయ సహకార విధాన పత్రం రూపొందించబడుతోంది.

 

***



(Release ID: 1857085) Visitor Counter : 171