మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
5వ రాష్ర్టీయ పోషణ్ మా 2022 నిర్వహించనున్న మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
“మహిళా అండ్ స్వాస్థ్య” “బచ్చా ఔర్ శిక్ష” - సశక్త్ నారీ, సాక్షర్ బచ్చా, స్వస్థ భారత్ లక్ష్యంగా పోషణ్ మాకు గ్రామ పంచాయతీలు సమాయత్తం
దేశ వ్యాప్తంగా అనీమియా శిబిరాల నిర్వహణ, అభ్యాసానికి దేశీయ ఆటబొమ్మలు, అంగ్ వాడీల వద్ద జెండర్ సెన్సిటివ్ వాన నీటి సంరక్షణ కార్యకలాపాలు, వృద్ధి చర్యలు నిర్వహణ
నెల రోజుల కాలంలో స్థానిక పండుగలను సాంప్రదాయిక ఆహారాలతో అనుసంధానం
Posted On:
31 AUG 2022 10:17PM by PIB Hyderabad
దేశంలో 6 సంవత్సరాల లోపు బాలలు, గర్భిణిలు, బాలింతల్లో పోషకాహార విలువలు పెంచేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం పోషణ్ అభియాన్. పోషకాహార లోపాలను సరిదిద్దే ఉద్యమ స్ఫూర్తి కార్యక్రమం పోషణ్ (సంపూర్ణ పోషకవిలువలకు ప్రధానమంత్రి మెరుగైన పథకం లేదా ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ ఆర్చింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్). సంపూర్ణ పోషకాహారం, అందరికీ చేరడం, అందచేత, ఫలితాలు సాధించడం కోసం ప్రకృతిసిద్ధమైన ఆరోగ్యం, సంరక్షణ, వ్యాధినిరోధకత, పోషకాహార లోపాలు సరిదిద్దడం లక్ష్యంగా చేపట్టిన సంపూర్ణ కార్యక్రమం పోషణ్ అభియాన్ . లేదా మిషన్ పోషణ్ 2.0 (సాక్షమ్ అంగన్ వాడీ, పోషణ్ 2.0).
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2022 సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 5వ రాష్ర్టీయ పోషణ మా 2022ని నిర్వహిస్తోంది. “మహిళా ఔర్ స్వాస్థ్య”, “బచ్చా ఔర్ శిక్ష ఫోకస్”గా పోషణ్ పంచాయతీలుగా గ్రామ పంచాయతీలను తీర్చి దిద్దడం ఈ ఏడాది పోషణ్ మా లక్ష్యం.
పోషకాహారం గురించి చైతన్యం సృష్టించడం, అందరికీ ఆ ప్రయోజనాలు అందేలా కార్యక్రమాల నిర్వహణ, గుర్తింపు చర్యలు; శిబిరాలు, ప్రదర్శనల నిర్వహణ వంటి కార్యకలాపాలు ఈ నెల అంతా చేపడతారు. ఇందులో భాగంగా “స్వస్థ్ భారత్ విజన్”ను సాకారం చేయడానికి గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 6 సంవత్సరాల లోపు బాలలపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు.
పంచాయతీల స్థాయిలో జిల్లా పంచాయత్ రాజ్ అధికారులు, సిడిపిఓల మార్గదర్శకంలో స్థానిక అధికారులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు, 6 సంవత్సరాల లోపు బాలలు, వయోజనులైన బాలికలు అందరికీ మౌలిక సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసులు చేరేందుకు వీలుగా ఎడబ్ల్యుడబ్ల్యులు, ఆశాలు, ఎఎన్ఎంలు వంటి క్షేత్ర స్థాయి సిబ్బంది సహకారంతో పోషణ్ పంచాయతీ కమిటీలు కృషి చేస్తాయి. అంగన్ వాడీ కేంద్రాలు (ఎడబ్ల్యుసిలు), గ్రామీణ ఆరోగ్య, పోషకాహార దినోత్సవ (విహెచ్ఎన్ డి) కమిటీలు, ఇతర వేదికల ద్వారా సేవలను అందిస్తారు.
అంగన్ వాడీ సర్వీసుల ద్వారా చైతన్య కార్యక్రమాలు, మంచి ఆరోగ్య విధానాలు నిర్వహిస్తారు. అంగన్ వాడీ సర్వీసుల ద్వారా మరింత ఎక్కువ మంది లబ్ధిదారులను ఈ కార్యక్రమం పరిధిలోకి తెచ్చేందుకు వారిలోని అభివృద్ధిని మదింపు చేసే కార్యక్రమాలు చేపడతారు. ఎడబ్ల్యుడబ్ల్యులు, ఎడబ్ల్యుహెచ్ లు, ఆశాలు, జిల్లా స్థాయి అధికారులు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లు వంటి ఏజెన్సీల వంటి ఏజెన్సీల సహకారంతో అనీమియా చెక్ లు నిర్వహిస్తారు. ప్రధానంగా ఎడబ్ల్యుసిల వద్ద వయోజన బాలికలకు పరీక్షలు నిర్వహిస్తారు.
అంతే కాదు, అంగన్ వాడీ కేంద్రాల (ఎడబ్ల్యుసి) సమీపంలో పోషకాహార తోటలు లేదా పోషణ్ వాటికలు పెంచేందుకు అనువైన భూమిని గుర్తిస్తారు.
అంగన్ వాడీ కేంద్రాల వద్ద వాన నీటి సంరక్షణ చర్యల ప్రాధాన్యంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఆరోగ్యవంతమైన తల్లి, పిల్లల కోసం గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయిక ఆహారాలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.
“అమ్మ కీ రసోయి” లేదా సాంప్రదాయిక పోషకాహార వంటలతో గ్రాండ్ మదర్స్ కిచెన్ వంటివి రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు. నెల మొత్తం మీద స్థానిక పండుగలను సాంప్రదాయిక ఆహారాలతో అనుసంధానం చేసేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడతారు.
అంగన్ వాడీ కేంద్రాల వద్ద అభ్యాసం కోసం దేశీయంగాను, స్థానికంగాను తయారయ్యే ఆటబొమ్మల తయారీ వర్క్ షాప్ లు జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు.
అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, మహిళా, శిశు అభివృద్ధి శాఖలు; ఆశా, ఎఎన్ఎం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పాఠశాల విద్య, అక్షరాస్యతా శాఖల సహకారంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ; స్వయం సహాయక బృందాల సహకారంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ థీమ్ కు దీటుగా నెల మొత్తం కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సంపూర్ణ పోషకాహారం ప్రాధాన్యాన్ని తెలియచేస్తారు. తద్వారా మహిళలు, బాలల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు భరోసా ఇస్తారు.
పోషకాహారం, మంచి ఆరోగ్యం ప్రాధాన్యతను తెలియచేసే ఒక వేదికగా రాష్ర్టీయ పోషణ్ మా ఉపయోగపడుతుంది. ప్రధాన మంత్రి సుపోషిత్ భారత్ విజన్ ను సాకారం చేసేందుకు జన్ ఆందోళన్ ను జన్ భారీదారీగా మార్చడం 5వ రాష్ర్టీయ పోషణ్ మా ప్రధాన లక్ష్యం.
***
(Release ID: 1856300)
Visitor Counter : 184