ప్రధాన మంత్రి కార్యాలయం

ఆగస్టు 27వ, 28వ తేదీల లో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి


భుజ్ లో స్మృతి వన్ మెమోరియల్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు; ఇది 2001వ సంవత్సరం లో విధ్వంసకారి భూకంపం సంభవించినఅనంతరం ప్రజలు ప్రదర్శించిన దృఢత్వ భావన ను ఉత్సవం గా జరుపుకోవడం కోసంనిర్వహిస్తున్న ఒక విశిష్ట కార్యక్రమం అని చెప్పాలి

అత్యాధునికమైనటువంటి స్మృతి వన్ అర్థ్ క్వేక్ మ్యూజియమ్ ను ఏడు ఇతివృత్తాలుప్రధానం గా ఏడు బ్లాకుల లో ఏర్పాటు చేయడం జరిగింది;  అవి.. పునర్ జన్మ, పునరన్వేషణ, పున:స్థాపన, పునర్ నిర్మాణం, పునరాలోచన, పునర్జీవనం మరియు నవీనీకరణ లు

దాదాపు గా 4400 కోట్ల రూపాయల విలువైన పలు పథకాల ను భుజ్ లో ప్రారంభించడంతో పాటుగా మరికొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధానమంత్రి

సర్ దార్ సరోవర్ పథకం లో ఒక భాగం అయిన కచ్ఛ్ బ్రాంచ్ కెనాల్ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు; ఈ కాలవ ఆ ప్రాంతం లో నీటి సరఫరా ను మెరుగుపరుస్తుంది

స్వాతంత్య్ర పోరాటం జరిగిన కాలం లో ఖాదీ కి మరియు ఖాదీ యొక్క ప్రాముఖ్యాని కినమస్సుల ను అర్పించడం కోసం ఏర్పాటు అవుతున్న ఓ అద్వితీయ కార్యక్రమం అయినటువంటి ఖాదీఉత్సవ్ లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు

అద్వితీయ అంశం:  7500 మంది మహిళా ఖాదీ చేతి వృత్తికళాకారులు ఏక కాలం లో, ఒకే స్థానం లో చరఖా ను తిప్పుతూ నూలు వడకే పనిని చేస్తారు 

భారతదేశం లో సుజుకీ కి 40 సంవత్సరాలు అయినందుకు గుర్తు గా నిర్వహించే ఒకకార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగించడంతో పాటు భారతదేశం లో సుజుకీ గ్రూపున కు చెందినరెండు కీలక ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేస్తారు 

Posted On: 25 AUG 2022 3:22PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27వ మరియు 28వ తేదీల లో గుజరాత్ ను సందర్శించనున్నారు. ఆగస్టు 27వ తేదీ నాడు సాయంత్రం సుమారు అయిదున్నర గంటల వేళ కు ప్రధాన మంత్రి అహమదాబాద్ లోని సాబర్ మతీ నదీముఖం వద్ద జరిగే ఖాదీ ఉత్సవ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆగస్టు 28వ తేదీ నాడు సుమారు ఉదయం 10 గంటల వేళ కు భుజ్ లో స్మృతీ వన్ మెమోరియల్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. అటు తరువాత, మధ్యాహ్నం పూట సుమారు 12 గంటల వేళ కు భుజ్ లోనే వేరు వేరు అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభించడంతో పాటుగా కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. సాయంత్రం పూట ఇంచుమించు 5 గంటల వేళ కు గాంధీనగర్ లో జరిగే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని, జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు, భారతదేశం లోకి సుజుకీ వచ్చి 40 సంవత్సరాలు అయినందుకు గుర్తు గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది.

ఖాదీ ఉత్సవ్

ఖాదీ కి ప్రజల లో మరింత ఆదరణ లభించేటట్లు చూడడం, ఖాదీ ఉత్సాదన ల పట్ల చైతన్యాన్ని వ్యాప్తి చేయడం, మరి అదే విధం గా యువతీ యువకుల లో ఖాదీ వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రధాన మంత్రి నిరంతరం పాటుపడుతున్నారు. ప్రధాన మంత్రి ప్రయాసల ఫలితం గా, 2014 వ సంవత్సరం నుంచి భారతదేశం లో ఖాదీ అమ్మకాలు నాలుగింతల వృద్ధి ని నమోదు చేశాయి. కాగా గుజరాత్ లో, ఖాదీ విక్రయాలు పెద్ద ఎత్తున ఎనిమిదింతల వృద్ధి ని నమోదు చేయడం జరిగింది.

ఖాదీ కి మరియు స్వాతంత్య్ర పోరాటం జరిగిన కాలం లో ఖాదీ యొక్క ప్రాముఖ్యత కు నమస్సుల ను అర్పించడం కోసం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా ఖాదీ ఉత్సవ్ ను ఒక విశిష్ట కార్యక్రమం గా ఏర్పాటు చేయడమైంది. ఈ ఖాదీ ఉత్సవ్ ను అహమదాబాద్ లోని సాబర్ మతీ రివర్ ఫ్రంట్ సమీపం లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో భాగం గా గుజరాత్ లోని వివిధ జిల్లాల లకు చెందిన 7500 మంది మహిళా ఖాదీ చేతి వృత్తి పని వారు ఒకే ప్రదేశం లో ఏక కాలం లో చరఖా ను తిప్పి నూలు ను వడకే పని ని చేయనున్నారు. ఇదే కార్యక్రమం లో చరఖాల పరిణామ క్రమాన్నికళ్ళకు కడుతూ, 1920వ దశాబ్ది మొదలుకొని వేరు వేరు తరాల లో 22 చరఖాల ను ఉపయోగించిన ఘట్టాల తో ఒక ప్రదర్శన ను నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర పోరాటం జరిగిన కాలం లో ఉపయోగించిన చరఖా లకు ప్రతీక గా నిలచినటువంటి ‘‘యర్ వదా చరఖా’’ కూడా ఈ ప్రదర్శన లో భాగం కానుంది. ఈ రోజు కు కూడా ఉపయోగం లో ఉన్నటువంటి నవీన సాంకేతిక పరిజ్ఞ‌ానం తో కూడిన చరఖా లు, నూతన మార్పుచేర్పుల కు లోనైన చరఖా లు ఈ ప్రదర్శన లో కొలువుదీరుతాయి. పొందూరు ఖాదీ తయారీ ని గురించిన ఒక ప్రత్యక్ష ప్రదర్శన ను కూడా ఈ సందర్భం లో చేపడతారు. గుజరాత్ రాజ్య ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు కు నూతనం గా నిర్మాణం జరిగిన కార్యాలయ భవనాన్ని, అలాగే సాబర్ మతీ ప్రాంతం లో ఒక ఫూట్ ఓవర్ బ్రిడ్జి ని కూడా ప్రధాన మంత్రి ఇదే కార్యక్రమం లో భాగం గా ప్రారంభించనున్నారు.

భుజ్ లో ప్రధాన మంత్రి

భుజ్ జిల్లా లో స్మృతి వన్ మెమోరియల్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. స్మృతి వన్ అనేది ప్రధాన మంత్రి స్వయం గా రూపుదిద్దిన ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం. దీనిని 2001వ సంవత్సరం లో భుజ్ కేంద్ర స్థానం గా సంభవించిన భూకంపం లో సుమారు 13,000 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అనంతరం అక్కడి ప్రజలు ప్రదర్శించిన దృ ఢత్వం తాలూకు అణచడం వీలుపడనటువంటి భావన ను ఒక ఉత్సవం గా జరుపుకోవడానికి గాను దాదాపు గా 470 ఎకరాల విస్తీర్ణం లో నిర్మించడం జరిగింది. భూకంప ఘడియల లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల పేరుల ను చెక్కి ఉన్న నిర్మాణాల ను ఈ స్మారకం లో చూడవచ్చును.

అత్యాధునికమైనటువంటి స్మృతి వన్ భూకంప సంగ్రహాలయాన్ని ఏడు ఇతివృత్తాలు ఆధారంగా చేసుకొని ఏడు బ్లాకుల వలె ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏడు ఇతివృత్తాల లో పునర్ జన్మ, పునరన్వేషణ, పున:స్థాపన, పునర్నిర్మాణం, పునరాలోచన, పునర్జీవనం మరియు నవీనీకరణ లు భాగం గా ఉన్నాయి. ఒకటో బ్లాకు భూమి యొక్క పరిణామ క్రమాన్ని మరియు విధ్వంసం జరిగిన ప్రతిసారీ దాని ప్రభావాన్ని అధిగమించిన ధరణి యొక్క సామర్థ్యాన్ని అభివర్ణించేది గా ఉంటుంది. రెండో బ్లాకు గుజరాత్ యొక్క స్థలాకృతి ని మరియు ఆ రాష్ట్రం లో సంభవించిన వివిధ ప్రాకృతిక విపత్తుల ను కళ్ళకు కట్టేదిగా ఉంటుంది. మూడో బ్లాకు 2001వ సంవత్సరం లో సంభవించిన భూకంపం వెనువెంటనే అక్కడి స్థితిగతుల ను చూపరుల కు తెలియజేస్తుంది. ఈ బ్లాకు లోని చిత్రశాలలు వ్యక్తుల తో పాటు, సంస్థ లు చేపట్టిన భారీ సహాయక ప్రయాసల ను వివరిస్తాయి. నాలుగో బ్లాకు గుజరాత్ యొక్క సాఫల్య గాథల ను, గుజరాత్ లో జరిగిన పునర్నిర్మాణ కార్యక్రమాల ను వర్ణిస్తుంది. అయిదో బ్లాకు వేరు వేరు విధాలైన విపత్తుల ను గురించి సందర్శకులు అవగాహన ను ఏర్పరచుకొనడం తో పాటు ఏకాలంలో ఎటువంటి విపత్తు ఎదురైనప్పటికీ అందుకు సన్నద్ధం గా ఎలా ఉండాలి అనేది చెబుతుంది. ఆరో బ్లాకు ఒక సిమ్యులేటర్ సహాయం తో భూకంపం తాలూకు అనుభవాన్ని గ్రహించడం లో మనకు తోడ్పడుతుంది. ఒక 5డి సిమ్యులేటర్ లో సందర్శకునికి / సందర్శకురాలి కి ఇంత పెద్ద స్థాయి లో ఒక విపరిణామం సంభవించినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తెలియజెబుతుంది. ఇక ఏడో బ్లాకు లో విగతజీవుల ను స్మరించుకొంటూ, వారికి ప్రజలు శ్రద్ధాంజలి ని సమర్పించడానికని ఒక ప్రత్యేక స్థలాన్ని నిర్దేశించడం జరిగింది.

 

దాదాపు గా 4400 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక పథకాల ను ప్రధాన మంత్రి భుజ్ లో ప్రారంభించడంతో పాటు కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. సర్ దార్ సరోవర్ ప్రాజెక్టు లో ఒక భాగం గా ఏర్పాటు చేసిన కచ్ఛ్ బ్రాంచ్ కెనాల్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కాలవ మొత్తం పొడవు సుమారు 357 కిలో మీటర్ లుగా ఉంది. ఇదే కాలవ లో ఒక భాగాన్ని 2017వ సంవత్సరం లో ప్రధాన మంత్రి ప్రారంభించ గా, మిగతా భాగాన్ని ప్రస్తుతం ఆయన ప్రారంభించనున్నారు. ఈ కాలవ కచ్ఛ్ లో సేద్యపు నీటి సదుపాయాన్ని సమకూర్చడం లో సాయపడటమే కాకుండా కచ్ఛ్ జిల్లా లోని మొత్తం 948 పల్లె ప్రాంతాల కు మరియు 10 పట్టణ ప్రాంతాల కు తాగునీటి ని అందించనుంది. ప్రధాన మంత్రి ప్రారంభించనున్న వివిధ పథకాల లో మరికొన్ని ఏవేవి అంటే, వాటిలో సర్ హద్ డెయరీ కి చెందిన కొత్త ఆటోమేటిక్ మిల్క్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంటు; భుజ్ లోని రీజనల్ సైన్స్ సెంటర్; గాంధీధామ్ లోని డాక్టర్ బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ కన్ వెన్శన్ సెంటర్; అంజార్ లోని వీర్ బాల్ స్మారక్; భుజ్ 2 సబ్ స్టేశన్ నఖత్రాణా మొదలైనవి ఉన్నాయి. ప్రధాన మంత్రి 1500 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన అనేక పథకాల కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో భుజ్ -భీమాసర్ రోడ్డు ప్రాజెక్టు కూడా ఒకటి గా ఉంది.

 

గాంధీ నగర్ లో ప్రధాన మంత్రి

భారతదేశం లో సుజుకీ కి 40 సంవత్సరాలు అయిన సందర్భాని కి గుర్తు గా గాంధీనగర్ లోని మహాత్మ మందిర్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి భారతదేశం లో సుజుకీ గ్రూపున కు చెందిన రెండు కీలకమైన పథకాలు.. గుజరాత్ లోని హంసల్ పుర్ లో ఏర్పాటు చేసిన సుజుకీ మోటార్ గుజరాత్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ తయారీ కేంద్రం తో పాటు హరియాణా లోని ఖర్ ఖోదా లో త్వరలో రూపుదిద్దుకోనున్న మారుతీ సుజుకీ వాహన తయారీ కేంద్రం.. ఉన్నాయి.

 

గుజరాత్ లోని హంసల్ పుర్ లో ఏర్పాటు అయ్యే సుజుకీ మోటార్ గుజరాత్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని ఇంచుమించు 7300 కోట్ల రూపాయల పెట్టుబడి తో నిర్మించనున్నారు. ఇక్కడ విద్యుత్తు వాహనాల కోసం అవసరమయ్యే అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీల ను ఉత్పత్తి చేస్తారు. హరియాణా లోని ఖర్ ఖోదా లో ఏర్పాటయ్యే వెహికల్ మేన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ లో ఒక్కో సంవత్సరం లో 10 లక్షల ప్రయాణికుల వాహనాల ను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రపంచం లో ఒక ప్రదేశం లో ప్రయాణికుల వాహనాల ను తయారు చేసే అతి పెద్ద కేంద్రాలన్నిటి లో ఇది ఒక కేంద్రం గా ఉంటుంది. ఈ ప్రాజెక్టు లో ఒకటో దశ ను 11,000 కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడి తో ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

***



(Release ID: 1854446) Visitor Counter : 167