వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వంట నూనెల తూకం ప్రకటించడంతోపాటు కొలతలో ఉష్ణోగ్రత లేకుండా నికర ద్రవ్యరాశి పరిమాణాన్ని కూడా ప్రకటించాలని వంట నూనెలు ఉత్పత్తిదారులను కేంద్రం కోరింది.
వంట నూనెల తయారీదారులు, ప్యాకర్లు మరియు దిగుమతిదారులు తమ లేబులింగ్‌ని అదేశాలు జారీ చేసిన తేదీ నుండి ఆరు నెలలలోపు అంటే జనవరి 15, 2023 వరకు సరి చేసుకోవాలని సలహా ఇస్తుంది.
प्रविष्टि तिथि:
25 AUG 2022 11:55AM by PIB Hyderabad
వంట నూనెల తయారీదారులు/ప్యాకర్లు/దిగుమతిదారులకు, ఉష్ణోగ్రత లేకుండా పరిమాణంలో వంట నూనెలు మొదలైన వాటిపై నికర ద్రవ్యరాశి పరిమాణాన్ని ప్రకటించాలని కేంద్రం సూచించింది. ఉత్పత్తి యొక్క బరువుతో పాటు ఉష్ణోగ్రతను పేర్కొనకుండా నికర ద్రవ్యరాశి పరిమాణాన్ని ప్రకటించే లేబులింగ్‌ను, ఆదేశాలు జారీ చేసిన తేదీ నుండి ఆరు నెలలలోపు అంటే జనవరి 15, 2023 వరకు సరిచేయాలని వినియోగదారుల వ్యవహారాల విభాగం వారికి సూచించింది.
లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011 ప్రకారం, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా అన్ని ప్రీ-ప్యాకేజ్ చేయబడిన వస్తువులపై ఇతర ప్రకటనలతో పాటూ ప్రామాణిక యూనిట్లలో బరువు లేదా కొలతల పరంగా నికర ద్రవ్యరాశి పరిమాణాన్ని ప్రకటించడం తప్పనిసరి.
నియమాల ప్రకారం రూపొందించిన నిబంధనలను అనుసరించి, నికర పరిమాణంలో వంట నూనెలు, వనస్పతి నెయ్యి మొదలైనవాటిని బరువు లేదా ద్రవ్యరాశి పరిమాణంలో ప్రకటించాలి, అలాగే ద్రవ్యరాశి లో ప్రకటిస్తే, ఆ వస్తువు యొక్క సమానమైన బరువును తప్పనిసరిగా ప్రకటించాలి. ద్రవ్యరాశి లో నికర పరిమాణాన్ని ప్రకటించేటప్పుడు పరిశ్రమలు ముందుగానే ఉష్ణోగ్రత గురించి ప్రస్తావించడం గమనించవచ్చు.
తయారీదారులు/ప్యాకర్లు/దిగుమతిదారులు నికర పరిమాణంలో వంట నూనెలు మొదలైనవాటిని, ద్రవ్యరాశి యూనిట్లతో పాటు ప్యాకింగ్ సమయంలో ఉష్ణోగ్రతను పేర్కొంటూ ద్రవ్యరాశి లో ప్రకటిస్తున్నారు. కొంతమంది తయారీదారులు ఉష్ణోగ్రతను 600C వరకు పేర్కొంటున్నారు.
వంట నూనెలు, వనస్పతి నెయ్యి మొదలైన వాటి ప్యాకేజింగ్ లో వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ద్రవ్యరాశిని స్థిరంగా ఉంచడం (ఉదాహరణకు 1 లీటర్), నికర పరిమాణాన్ని ద్రవ్యరాశి పరంగా ప్రకటించడం వల్ల, అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవ్యం తేడా ఉంటుందని గమనించబడింది. సోయాబీన్ వంట నూనె యొక్క బరువు వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ఒక లీటరు వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద ద్రవ్యరాశి భిన్నంగాఈ క్రింది విధంగా ఉంటుంది.
|
వరుస సంఖ్య .
|
ఉష్ణోగ్రత
|
బరువు (గ్రా. లలో)
|
|
1
|
210C
|
919.1
|
|
2
|
300C
|
913.0
|
|
3
|
400C
|
906.2
|
|
4
|
500C
|
899.4
|
|
5
|
600C
|
892.6
|
కాబట్టి, వివిధ ఉష్ణోగ్రతల వద్ద వంట నూనెలు బరువు భిన్నంగా ఉంటుంది. అందువల్ల, వినియోగదారు కొనుగోలు సమయంలో ప్యాకేజీలో సరైన ద్రవ్యరాశి పరిమాణాన్ని పొందారని నిర్ధారించుకోవడానికి, తయారీదారులు / ప్యాకర్లు / వంట నూనెల దిగుమతిదారులు మొదలైనవారు పేర్కొన్న ఉత్పత్తులను ఉష్ణోగ్రతను పేర్కొనకుండా ప్యాక్ చేయాలని మరియు ప్రకటించిన పరిమాణాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. పరిమాణం మరియు ద్రవ్యరాశిలో ప్యాకేజీ సరిగ్గా ఉండాలి.
***
(रिलीज़ आईडी: 1854319)
आगंतुक पटल : 216