హోం మంత్రిత్వ శాఖ

'రాష్ట్రీయ పురస్కార్' పోర్టల్ ప్రారంభం.. వివిధ అవార్డుల కోసం నామినేషన్ల‌కు ఆహ్వానం

Posted On: 22 AUG 2022 12:28PM by PIB Hyderabad

భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లు/ ఏజెన్సీల అవార్డులన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రభుత్వం ఒక ఉమ్మడి 'రాష్ట్రీయ పురస్కార్'  పోర్టల్‌ను (https://awards.gov.in) అభివృద్ధి చేసింది.

ప్ర‌భుత్వం ఇచ్చే అవార్డుల ప్రజా భాగస్వామ్యం (జన్ భగీదారి), పార‌దర్శ‌క‌త‌ను పెంపొందించేందులా ఈ  పోర్టల్‌ను ప్ర‌భుత్వం (https://awards.gov.in) అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్ ప్రతి పౌరుడు లేదా సంస్థను భారత ప్రభుత్వం స్థాపించిన వివిధ అవార్డుల కోసం వ్యక్తులు/సంస్థలను నామినేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం, కింది అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులు తెరవబడి ఉన్నాయి:


పద్మ అవార్డులు - చివరి తేదీ 15/09/2022
ఫారెస్ట్రీలో అత్యుత్తమ జాతీయ అవార్డు 2022- చివరి తేదీ 30/09/2022
జాతీయ గోపాల్ రత్న అవార్డు 2022- చివరి తేదీ 15/09/2022
నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022-చివరి తేదీ 15/09/2022
సీనియర్ సిటిజన్లకు జాతీయ అవార్డు -వయోశ్రేష్ఠ సమ్మాన్ 2022- చివరి తేదీ 29/08/2022
నేషనల్ అవార్డ్ ఫర్ ఇండివిజువల్ ఎక్సలెన్స్ 2021- చివరి తేదీ 28/08/2022
నేషనల్ అవార్డ్ ఫర్ ఇండివిజువల్ ఎక్సలెన్స్ 2022- చివరి తేదీ 28/08/2022
వికలాంగులకు సాధికారత కల్పించడంలో నిమగ్నమైన సంస్థలకు జాతీయ అవార్డులు 2021- చివరి తేదీ 28/08/2022

వికలాంగులకు సాధికారత కల్పించడంలో నిమగ్నమైన సంస్థలకు జాతీయ అవార్డులు 2022- చివరి తేదీ 28/08/2022
జాతీయ సీఎస్ఆర్  అవార్డులు 2022- చివరి తేదీ 31/08/2022
నారీ శక్తి పురస్కార్ 2023- చివరి తేదీ 31/10/2022
సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2023- చివరి తేదీ 31/08/2022
మద్య వ్యసనం మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం నిరోధక రంగంలో అత్యుత్తమ సేవలకు జాతీయ అవార్డులు 2022- చివరి తేదీ 29/08/2022
జీవన్ రక్షా పదక్ - చివరి తేదీ 30/09/2022

 

మరిన్ని వివరాలు మరియు నామినేషన్ల కోసం, దయచేసి 'రాష్ట్రీయ పురస్కార్' పోర్టల్ (https://awards.gov.in) సందర్శించండి.



(Release ID: 1853818) Visitor Counter : 155