శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఇక ద్విచక్ర వాహనం నడపవచ్చు

Posted On: 22 AUG 2022 4:18PM by PIB Hyderabad
ద్విచక్ర వాహనం నడుపుతున్న వారు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి సహాయపడే కాలుష్య నివారణ  హెల్మెట్ ను ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థ అభివృద్ధి చేసింది. ఢిల్లీకి చెందిన  షెల్లియోస్ టెక్నోలాబ్స్ అభివృద్ధి చేసిన హెల్మెట్‌లో అమర్చిన  బ్లూటూత్ ఆధారిత యాప్  హెల్మెట్‌ను ఎప్పుడు శుభ్రం చేయాలో వాహనం నడుపుతున్న వ్యక్తికి సంకేతాల ద్వారా  తెలియజేస్తుంది.
 
శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి  (DST)  సీడ్ ఫండింగ్ పొందిన షెల్లియోస్ టెక్నోలాబ్స్   నోయిడాలోని   సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్ పార్క్ (JSSATE-STEP)  ఇంక్యుబేట్ చేయబడింది. 
 
 ప్రముఖ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ (OEMలు)తో హెల్మెట్ వాణిజ్య ఉత్పత్తి కోసం  షెల్లియోస్ టెక్నోలాబ్స్  ఒప్పందాలపై సంతకం చేసింది.  ఉత్పత్తి, సాంకేతిక సంసిద్ధత స్థాయి (TRL) స్థాయి 9 వద్ద హెల్మెట్‌ కు  యుటిలిటీ పేటెంట్ మంజూరు అయింది.  దేశంలోని అన్ని ప్రాంతాల్లో  4500 రూపాయలను ధరగా నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో వాహనాలు నడుపుతున్న వారి నుంచి హెల్మెట్‌ కు ఆదరణ లభిస్తున్నది. మరింత అభివృద్ధి చేసిన హెల్మెట్‌ వాణిజ్య  కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్స్‌తో షెల్లియోస్ టెక్నోలాబ్స్ కలిసి పనిచేస్తుంది. 
 
శీతాకాలంలో ఢిల్లీలో ద్విచక్ర వాహనదారులు పీల్చేందుకు పరిశుభ్రమైన లభించక ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో  షెల్లియోస్ టెక్నోలాబ్స్ పరిశోధన సాగించి హెల్మెట్ అభివృద్ధి చేసింది. 
 

'రోడ్డుపై ఉన్న ప్రజలు ముఖ్యంగా వాహనాలు నడుపుతున్న వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ  గాలి నాణ్యతకు సంబంధించి అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని మేము గుర్తించాము. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ, గాలిలో ఉండే నలుసు పదార్థం గాలిని కలుషితం చేస్తున్నాయి. కలుషిత గాలిని ప్రజలు  పీల్చుకుంటున్నారు ” అని  షెల్లియోస్ టెక్నోలాబ్స్   వ్యవస్థాపకుల్లో ఒకరైన అమిత్ పాఠక్ అన్నారు.

 PUROS పేరుతో సంస్థ అభివృద్ధి చేసిన  హెల్మెట్ గాలి శుద్దీకరణ ఉపకరణాలతో అనుసంధానించబడింది. వీటిలో కొన్ని ఉపకరణాలకు  షెల్లియోస్ టెక్నోలాబ్స్ పేటెంట్ హక్కులను కలిగి ఉంది.  బ్రష్‌ అవసరం లేని  డీసీ  (BLDC) బ్లోవర్ ఫ్యాన్,గాలిలో కలిసి ఉండే రేణువులను శుద్ధి చేసే ఫిల్టర్లు  (HEPA) , ఎలక్ట్రానిక్ సర్క్యూట్ మరియు మైక్రోయూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ లతో  హెల్మెట్.ను తయారు చేసారు.   హెల్మెట్ వెనుక భాగంలో అమర్చిన ప్యూరిఫయింగ్ వ్యవస్థ గాలిలో ఉండే కలుషిత రేణువులను సంగ్రహించి వాహనం నడుపుతున్న వ్యక్తి గాలి పీల్చుకొనే  సమయానికి   గాలిని శుభ్రపరిచిన  స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. 

 ప్రభుత్వం నిర్దేశించిన అన్ని తప్పనిసరి ప్రమాణాలను అనుసరించి  1.5 కిలోల బరువుతో  హెల్మెట్ ను అభివృద్ధి చేశారు. నియంత్రిత వాతావరణాన్ని ఉపయోగించి నిర్వహించిన పరీక్షల్లో హెల్మెట్  80% కంటే ఎక్కువ కాలుష్యాన్ని తగ్గించిందని వెల్లడయ్యింది. 


(Release ID: 1853816) Visitor Counter : 163