ప్రధాన మంత్రి కార్యాలయం
ఆగస్టు 24వ తేదీ నాడు హరియాణా ను మరియు పంజాబ్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి
ఫరీదాబాద్ లో అమృత హాస్పిటల్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
కొత్త గా నిర్మించిన ఆసుపత్రి తో నేశనల్కేపిటల్ రీజియన్ లో వైద్యానికి సంబంధించిన ఆధునిక మౌలిక సదుపాయాలకు ఒక ఉత్తేజంలభించనుంది
సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్ జిల్లా (మొహాలీ) లో ‘హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్సెంటర్’ ను దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధాన మంత్రి
ఈ ఆసుపత్రి పంజాబ్ నివాసుల కు మరియుచుట్టుపక్కల రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నివాసుల కు ప్రపంచ శ్రేణికేన్సర్ సంరక్షణ ను, కేన్సర్ చికిత్స ను అందజేయనుంది
Posted On:
22 AUG 2022 1:38PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఆగస్టు 24వ తేదీ నాడు హరియాణా ను మరియు పంజాబ్ ను సందర్శించనున్నారు. ప్రధాన మంత్రి రెండు ముఖ్యమైన ఆరోగ్య సదుపాయాలను ఆ రోజు న ప్రారంభించడం / దేశ ప్రజల కు అంకితం చేయడం చేస్తారు. ఉదయం సుమారు 11 గంటల వేళ లో హరియాణా లోని ఫరీదాబాద్ లో అమృత హాస్పిటల్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత, ఆయన మొహాలీ కి బయలుదేరి వెళ్లి, సుమారు 2 గంటల 15 నిమిషాల వేళ లో సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్ జిల్లా (మొహాలీ) లోని న్యూ చండీగఢ్ పరిధి లో గల ముల్లాన్ పుర్ లో ‘హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్’ ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు.
హరియాణా లో ప్రధాన మంత్రి
ఫరీదాబాద్ లోని అమృత హాస్పిటల్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తున్నందు వల్ల నేశనల్ కేపిటల్ రీజియన్ (ఎన్ సిఆర్) లో వైద్య సంబంధి ఆధునిక మౌలిక సదుపాయాల లభ్యత కు ఒక ఉత్తేజం లభించనుంది. మాత అమృతానందమయి మఠం నిర్వహించే ఈ సూపర్ స్పెశలిటీ హాస్పిటల్ లో 2600 పడకల ను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు గా 6,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మాణాధీనం లో ఉన్న ఈ ఆసుపత్రి ఫరీదాబాద్ ప్రజలకు మరియు యావత్తు ఎన్ సిఆర్ ప్రాంతం ప్రజల కు అత్యధునాతనమైనటువంటి ఆరోగ్య సంరక్షణ సదుపాయాల ను అందిస్తుంది.
పంజాబ్ లో ప్రధాన మంత్రి
పంజాబ్ మరియు పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాల కు, ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల నివాసుల కు ప్రపంచ శ్రేణి కేన్సర్ సంరక్షణ ను అందించే ప్రయత్నం లో భాగం గా ‘హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్’ ను సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్ జిల్లా (మొహాలీ) లోని న్యూ చండీగఢ్ పరిధి లో గల ముల్లాన్ పుర్ లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ ఆసుపత్రి ని 660 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో భారత ప్రభుత్వ అణుశక్తి విభాగాని కి చెందిన ఒక ఎయిడెడ్ ఇన్ స్టిట్యూట్ అయినటుంటి టాటా మెమోరియల్ సెంటర్ నిర్మించింది.
ఈ కేన్సర్ ఆసుపత్రి 300 పడకల ను కలిగిన, ఇన్ పేశెంట్ లకు మూడో స్థాయి కి చెందిన అభివృద్ధిపరచిన ఆరోగ్య సంరక్షణ సేవల ను, చికిత్సల ను అందించేటటువంటి ఆసుపత్రి గా ఉండబోతోంది; మరి దీనిలో అన్నిఒక్క రకాలైన కేన్సర్ కు సంబంధించిన చికిత్స ల కోసం ఆధునిక సదుపాయాలను జతపరచడమైంది. ఇక్కడ శస్త్ర వైద్యం/చికిత్స, ఎక్స్ రే చికిత్స, మెడికల్ ఆంకాలజి- కీమో థెరపి, ఇమ్యూనో థెరపి మరియు ఎముక మజ్జ మార్పిడి వంటి సౌకర్యాలు అందుబాటు లో ఉంటాయి.
ఈ ఆసుపత్రి యావత్తు ప్రాంతం లో కేన్సర్ సంరక్షణ మరియు చికిత్సల కు ‘కేంద్రం’ గా పని చేయనుంది. కాగా సంగ్ రూర్ లోని 100 పడక ల ఆసుపత్రి ఈ కేంద్రాని కి ‘శాఖ’ గా విధుల ను నిర్వర్తించనుంది.
***
(Release ID: 1853584)
Visitor Counter : 158
Read this release in:
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam