ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశంఅంతటా హర్ ఘర్ తిరంగా అభియాన్ లోపాలుపంచుకొన్న వ్యక్తుల లో పెల్లుబుకిన ఉత్సాహం తాలూకుదృశ్యాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
Posted On:
12 AUG 2022 9:06PM by PIB Hyderabad
హర్ ఘర్ తిరంగా అభియాన్ పట్ల దేశ వ్యాప్తం గా ప్రజల లో వ్యక్తం అవుతున్న ఉత్సాహం తాలూకు చిత్రాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి పలు ట్వీట్ లలో ఇలా పేర్కొన్నారు:
‘‘అలౌకికమైనటువంటి దృశ్యం. దేశం యొక్క జలాలలో, భూమి మీద మరియు గగనం లోనూ త్రివర్ణ పతాకం రెపరెపలాడడం చూసి భారతీయులు ఆహ్లాదభరితులు అవుతున్నారు. #HarGharTiranga”
‘‘ఈ ఉత్సాహానికి ప్రణామాలు. మువ్వన్నెల జండా అంటే అసమానమైనటువంటి సమ్మానం తాలూకు ఈ సాహసిక దృశ్యం భారతీయుల యొక్క ఉత్సాహాన్ని మరియు ఉల్లాసాన్ని చాటిచెప్తున్నది. #HarGharTiranga”
‘‘అద్భుతం. భారతదేశం యొక్క భావి కర్ణధారుల తో నిండిపోయిన ఈ తరహా తిరంగా యాత్ర లు ప్రతి ఒక్కరి లో దేశ భక్తి యొక్క సమధికోత్సాహాన్ని నింపివేసేవి గా ఉన్నాయి. #HarGharTiranga”
“ఇది విశాఖపట్నం ప్రజలు చేపట్టిన ఒక ఘనమైన సామూహిక ప్రయత్నం. #HarGharTiranga పట్ల వ్యక్తం అవుతున్నటువంటి ఈ యొక్క ఉత్సాహాన్ని నేను ప్రశంసిస్తున్నాను.”
‘‘#HarGharTiranga అభియాన్ తో ముడిపడ్డ భావన ను మరింతగా బలపరచేలా లద్దాఖ్ లో చేపట్టినటువంటి ఉత్కృష్ట ప్రయాస ను కనులారా కాంచండి.’’ అని పేర్కొన్నారు.
***
****
DS
(Release ID: 1851908)
Visitor Counter : 128
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam