మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పి.ఎం.ఏ.వై-యు) - “అందరికీ గృహ నిర్మాణం” పధకాన్ని 2024 డిసెంబర్, 31వ తేదీ వరకు కొనసాగించడాన్ని ఆమోదించిన - కేంద్ర మంత్రి మండలి.


గృహాలను పూర్తి చేయడానికి మరింత సమయం కావాలన్న రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థనను ఆమోదించిన - భారత ప్రభుత్వం


ఈ పథకం కింద మంజూరైన 122.69 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయనున్న - కేంద్ర ప్రభుత్వం

Posted On: 10 AUG 2022 9:23PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పి.ఎం.ఏ.వై-యు) ని, 2024 డిసెంబర్, 31వ తేదీ వరకు కొనసాగించడానికి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.యు.ఏ) ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది.  ఈ పధకం కింద ఇప్పటికే మంజూరైన 122.69 లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని 2022 మార్చి, 31వ తేదీ వరకు పూర్తి చేసేందుకు తగిన ఆర్థిక సహాయాన్ని కూడా అందించనున్నారు. 

పి.ఎం.ఏ.వై-యు: "హౌసింగ్-ఫర్-ఆల్" అనేది రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు / కేంద్ర నోడల్ ఏజెన్సీ ల ద్వారా దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ అన్ని వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండే పక్కా గృహాలను అందించడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన ఫ్లాగ్‌-షిప్ కార్యక్రమాలలో ఒకటి.  ఈ పథకం దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో  అంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం అన్ని చట్టబద్ధమైన పట్టణాలు, నోటిఫైడ్ ప్లానింగ్ / డెవలప్‌మెంట్ ఏరియాలతో సహా ఆ తర్వాత నోటిఫై చేయబడిన పట్టణాల్లో అమలులో ఉంది.  ఈ పథకం -  లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణం / మెరుగుదల (బి.ఎల్.సి);  భాగస్వామ్యంలో అందుబాటు ధరల్లో (ఏ.హెచ్.పి);  ఇన్-సితు-స్లమ్ రీడెవలప్‌మెంట్ (ఐ.ఎస్.ఎస్.ఆర్);  క్రెడిట్-లింక్డ్-సబ్సిడీ-స్కీమ్ (సి.ఎస్.ఎస్.ఎస్)  అనే  నాలుగు విధాలుగా అమలు చేయబడుతోంది:  ఈ పధకానికి, భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం / కేంద్ర పాలిత ప్రాంతాలు లబ్ధిదారుల ఎంపిక తో సహా ఈ పథకాన్ని అమలు చేస్తాయి.

2004-2014 మధ్య కాలంలో పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 8.04 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.  మోదీ ప్రభుత్వ హయాంలో, అర్హులైన పట్టణ వాసులందరికీ సంతృప్త పద్ధతిలో ఇళ్లను అందించే అంశం దృష్టికి తీసుకురాబడింది మరియు పి.ఎం.ఏ.వై-అర్బన్ పథకాన్ని క్రమబద్దీకరించడం జరిగింది.   2017 లో, 100 లక్షల గృహాలు నిర్మించాలని ప్రారంభంలో అంచనా వేయడం జరిగింది.   కాగా ఈ అసలు అంచనా డిమాండ్‌ ను అధిగమించి, 102 లక్షల గృహాల నిర్మాణం చేపట్టడం జరిగింది / నిర్మాణంలో ఉన్నాయి.  వీటిలో 62 లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది.  మొత్తం మంజూరైన 123 లక్షల ఇళ్లలో, 40 లక్షల ఇళ్ల ప్రతిపాదనలు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆలస్యంగా (అంటే పథకం యొక్క చివరి 2 సంవత్సరాలలో) అందాయి. దీంతో వాటిని పూర్తి చేయడానికి మరో రెండేళ్లు అవసరం.  అందువల్ల, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా, కేంద్ర మంత్రివర్గం పి.ఎం.ఏ.వై-యు అమలు వ్యవధిని 2024 డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించింది.

ఈ పథకం కింద 2004 నుంచి 2014 వరకు 20,000 కోట్ల రూపాయలు కేటాయించగా, 2015 నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల మేర కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.  కాగా, 2022 మార్చి, 31వ తేదీ వరకు, 1,18,020.46 కోట్ల రూపాయల మేర కేంద్ర సహాయం / సబ్సిడీ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది.  అదే విధంగా, 2024 డిసెంబర్, 31వ తేదీ వరకు 85,406 కోట్ల రూపాయల మేర కేంద్ర సహాయం / సబ్సిడీ గా విడుదల చేయడం జరుగుతుంది. 

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థన ఆధారంగా 2024 డిసెంబర్, 31వ తేదీ వరకు ఈ పథకాన్ని కొనసాగించడం, బి.ఏ.సి., ఏ.హెచ్.పి; ఐ.ఎస్.ఎస్.ఆర్; వర్టికల్స్ కింద ఇప్పటికే మంజూరైన ఇళ్ళ నిర్మాణాన్న పూర్తి  చేయడంలో ఇది సహాయపడుతుంది.

 

*****


(Release ID: 1850726) Visitor Counter : 340