ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో భార‌త మ‌హిళ‌ల హాకీ బృందం కాంస్య‌ప‌త‌కం గెలుపొంద‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్న ప్ర‌ధాన‌మంత్రి

प्रविष्टि तिथि: 07 AUG 2022 5:23PM by PIB Hyderabad

2022 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో న్యూజిలాండ్ ను ఓడించి భార‌త మహిళ‌ల హాకీ జ‌ట్టు కాంస్య‌ప‌త‌కం గెలుపొంద‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ,
"హాకీతో ఇండియాకు ఎంతో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. మ‌న మ‌హిళ‌ల హాకీ బృందం కాంస్య ప‌త‌కం సాధించినందుకు ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డుతున్నాడు.  మ‌హిళ‌ల హాకీ టీమ్ కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల పోడియం ఎక్కడం ఇటీవ‌లి సంవ‌త్స‌రాల‌లో ఇదే ప్ర‌థ‌మం.ఈ బృంద స‌భ్యుల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను" అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో పేర్కోన్నారు.


(रिलीज़ आईडी: 1849914) आगंतुक पटल : 124
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Gujarati , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Malayalam